మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ
Mangalagiri Tadepalli Municipal Corporation
రకం
రకం
చరిత్ర
స్థాపితం2021
నాయకత్వం
-ఖాళీ-
-ఖాళీ-
మున్సిపల్ కమీషనర్
పి.నిరంజన్ రెడ్డి
సీట్లు50
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంబంధిత మండలాల్లోని మంగళగిరి, తాడేపల్లి పట్టణాలను, గ్రామాలను పాలించే పట్టణ స్థానిక సంస్థ. ఇది 2021 మార్చి 24న మంగళగిరి , తాడేపల్లి పురపాలక సంఘాలను విలీనం చేయుట ద్వారా ఏర్పడింది.[1] ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 194.41 కిమీ 2 (75.06 చ.మై), 2,53,875 మంది ఓటర్లతో వైశాల్యం పరంగా మహా విశాఖనగరపాలక సంస్థ తర్వాతి స్థానంలో ఉన్న రెండవ అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ముఖ్యమైన మున్సిపల్ కార్పొరేషన్‌గా వర్గీకరించబడింది.[2][3] మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్‌కు నగరమేయర్ నాయకత్వం వహిస్తాడు. దాని పరిపాలన నగర మేయర్, కమీషనర్ చేత నిర్వహించబడుతుంది.

చరిత్ర[మార్చు]

మంగళగిరి, తాడేపల్లి నగరాలను మోడల్ పట్టణాలుగా అభివృద్ధి చేయడానికి, 2021 మార్చి 24న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరి పురపాలక సంఘం, తాడేపల్లి పురపాలక సంఘాలను విలీనం చేసి మంగళగిరి తాడేపల్లి నగరపాలకసంస్థగా ఏర్పాటు చేసింది.[4] నీటిపారుదల శాఖ సహాయంతో నగరపాలక సంస్థ పరిదిలో తాగునీరు, అంతర్గత రోడ్లు, విద్యుత్ సరఫరా, మురుగునీటి పారుదల నిర్వహణను నగరపాలక సంస్థ మెరుగుపరుస్తుంది. [2]

నగరపాలక సంస్థలో విలీనమైన ప్రాంతాలు[మార్చు]

1969లో మంగళగిరి పురపాలక సంఘం ఏర్పడింది. 2021 జనవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, మంగళగిరి మున్సిపాలిటీతోపాటు మంగళగిరి మండలంలోని ఆత్మకూరు, నూతక్కి, పెదవడ్లపూడి, రామచంద్రాపురం, ఎర్రబాలెం, కాజ, చినకాకాని, నవులూరు, చినవడ్లపూడి, నిడమర్రు గ్రామపంచాయితీలను నగరపాలక సంస్థలో 2021 మార్చి 24న విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[3][5]

తాడేపల్లి పురపాలక సంఘం 2009లో ఏర్పాటైంది.2021 జనవరిలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ తాడేపల్లి పురపాలక సంఘంతోపాటు తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, ప్రాతూరు, వడ్డేశ్వరం, ఇప్పటం, మెల్లెంపూడి, చిర్రావూరు, కుంచనపల్లి, కొలనుకొండ, గుండిమెడ గ్రామ పంచాయతీలు నగరపాలక సంస్థలో 2021 మార్చి 24 విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పరిపాలన[మార్చు]

మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్‌కు నగరమేయర్ నాయకత్వం వహిస్తాడు. దాని పరిపాలన నగర మేయర్, కమీషనర్ చేత నిర్వహించబడుతుంది.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

నగర పరిధిలోని డివిజన్లు[మార్చు]

వార్డు సంఖ్య వార్టు పేరు వార్డు సంఖ్య వార్డుపేరు వార్డు సంఖ్య వార్డు పేరు
1. ప్రాతూరు - గుండిమెడ 18. మంగళగిరి 35. మాకెనవారిపేట నుంచి యర్రబాలెం వరకు
2. తాడేపల్లి (బైపాస్) 19. మంగళగిరి (లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, బోస్ బొమ్మ సెంటర్) 36. యర్రబాలెం 1
3. కుంచనపల్లి 20. మంగళగిరి (తెనాలి రోడ్, వీవర్స్ కాలనీ, ఆంజనేయ కాలనీ, నాంచారమ్మ చెరువు, గాజులవారి వీధి) 37. యర్రబాలెం 2
4. వద్దేశ్వరం 21. మంగళగిరి (మెయిన్ రోడ్ జంక్షన్) 38. యర్రబాలెం 3
5. కొలనుకొండ-వడ్డేశ్వరం 22. మంగళగిరి (11 వార్డు సచివాలయం, కొప్పురావురు కాలనీ, భార్గవ పేట, తెనాలి రోడ్) 39. పెనుమాక
6. ఇప్పటం-గుండిమెడ-మెల్లెంపూడి 23. మంగళగిరి (రాజీవ్ క్రాస్‌రోడ్, భార్గవపేట్, షేర్ బజార్) 40. ఉండవల్లి 1
7. రామచంద్రాపురం -చిర్రావూరు 24. మంగళగిరి (నిడమర్రు రోడ్, గౌతం బుద్ధ జంక్షన్ , బ్యాంక్ కాలనీ, మార్కెట్ యార్డు దగ్గర వరకు) 41. ఉండవల్లి 2
8. నూతక్కి - చిర్రావూరు - రామచంద్రాపురం 25. మంగళగిరి (గౌతమబుద్ద రోడ్, ఎన్ఆర్ఐ జంక్షన్ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంతం) 42. ఉండవల్లి సెంటరు
9. నూతక్కి -పెదవడ్లపూడి 26. మంగళగిరి (11వార్డ్ సచావలయం, దింపుడుకల్లం ప్రాంతం) 43. ఉండవల్లి - పోల్కంపాడు
10. పెదవడ్లపూడి 27. మంగళగిరి (పాత మంగళగిరి, దింపుడుకల్లం ప్రాంతం, హుస్సేని కట్ట, ఎన్.సి.సి రోడ్డు) 44. తాడేపల్లి 1
11. పెదవడ్లపూడి-చినవడ్లపూడి 28. చినకాకాని (ఎన్ఆర్ఐ ఏరియా) 45. పోల్కంపాడు - తాడేపల్లి
12. ఆత్మకూరు 1 29. కాజ (ఎ.ఎన్.యు.ఏరియా) 46. తాడేపల్లి 2
13. ఆత్మకూరు 2 30. కాజ 47. తాడేపల్లి 3
14. మంగళగిరి (ఎ.పి.ఎస్.పి) 31. నిడమానూరు 48. తాడేపల్లి 4
15. మంగళగిరి (ఇందిరానగర్) 32. మంగళగిరి (ఉడా కాలనీ, నవులూరు) 49. తాడేపల్లి -సీతానగరం
16. మంగళగిరి (యానాది కాలనీ, గాజులవారి కాలనీ) 33. నవులూరి -1 50. తాడేపల్లి-మహానాడు
17. మంగళగిరి (ఘాట్ రోడ్) 34. నవులూరు -2

పర్యాటక ప్రదేశాలు[మార్చు]

  • మంగళగిరిలో లక్ష్మీ నరసింహ దేవాలయం, ప్రధాన దేవతగా వెలిసిన విష్ణుమూర్తి నివాసం. ఇక్కడ మూడు నరసింహ స్వామి ఆలయాలు ఉన్నాయి.
  • ఉండవల్లిలో ఉన్న ఉండవల్లి గుహలు భారతీయ రాక్-కట్ ఆర్కిటెక్చర్ నమూనా. చారిత్రాత్మక గుహలు.ఇవి 4వ-5వ శతాబ్దంలో నిర్మించబడిన కృష్ణా నదికి ఎదురుగా కొండల పైభాగంలో ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి, నరసింహ స్వామికి అంకితం చేయబడిన ఉండవల్లి గుహ దేవాలయాలు విష్ణుకుండిన రాజులకు సంబంధించినవి.
  • స్వామి చిన్న జీయర్ ఆశ్రమం, ఆలయ పట్టణం సీతానగరం తాడేపల్లిలో ఉంది.
  • గుంటూరు-విజయవాడ హైవేపై హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్ అతిపెద్ద వినోద ఉద్యానవనం.

నగరపాలక సంస్థ పరిధిలో గుర్తింపుఉన్న ప్రదేశాలు[మార్చు]

  • ప్రకాశం బ్యారేజీ
  • బకింగ్‌హామ్ కాలువ
  • కనక దుర్గా వారధి
  • ఎయిమ్స్ మంగళగిరి.
  • ఎసిఎ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.
  • లక్ష్మీ నరసింహ దేవాలయం, మంగళగిరి.
  • ఉండవల్లి గుహలు.
  • కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్.
  • మంగళగిరి రైల్వే స్టేషన్.
  • కెఎల్ విశ్వవిద్యాలయం.
  • ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్.
  • ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్.
  • అమృత విశ్వ విద్యాపీఠం.
  • మణిపాల్ హాస్పిటల్స్ ఇండియా.

మూలాలు[మార్చు]

  1. "Andhra Pradesh government issues G.O. to form Mangalagiri Tadepalli Municipal Corporation- The New Indian Express". web.archive.org. 2022-06-22. Archived from the original on 2022-06-22. Retrieved 2022-08-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "Andhra Pradesh government issues G.O. to form Mangalagiri Tadepalli Municipal Corporation- The New Indian Express". web.archive.org. 2022-06-22. Archived from the original on 2022-06-22. Retrieved 2022-06-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 "AP: Merger of villages to boost Mangalagiri as model town". Vijayawada: Times of India. Retrieved 4 January 2021.
  4. "AP government issues GO forming Mangalagiri Tadepalli Municipal Corporation". web.archive.org. 2022-06-23. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "AP: Merger of villages to boost Mangalagiri as model town | Vijayawada News - Times of India". web.archive.org. 2022-06-23. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు[మార్చు]