తాడేపల్లి పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడేపల్లి పురపాలక సంఘం
తాడేపల్లి
స్థాపన2009
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

తాడేపల్లి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరుజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం లోని, మంగళగిరి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

తాడేపల్లి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు లోని మునిసిపాలిటీ. ఈ పురపాలక సంఘం రాజధాని ప్రాంతంలో ఉంది. 2009 లో మున్సిపాలిటీగా స్థాపించబడింది.[1][2]

జనాభా గణాంకాలు[మార్చు]

2001 లో 41698 జనాభా ఉండగా 2011 లో 54362 జనాభా పెరిగింది.ఈ పురపాలక సంఘంలో మొత్తం 158,12 గృహాలు ఉన్నాయి.

చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

చైర్‌పర్సన్‌గా కె. మహాలక్ష్మి, వైస్ చైర్మన్‌గా డి. రామకృష్ణా రెడ్డి పనిచేసారు.[3]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. పోలకంపాడు శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం
  2. శ్రీ భద్రకాళీ వీరభద్ర సమేత శ్రీ విశ్వేశ్వరస్వామి దేవాలయం
  3. శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం.
  4. శ్రీ మద్వీరాంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామి దేవాలయం.
  5. శ్రీ లక్ష్మీగణపతిస్వామి దేవాలయం

ఇతర వివరాలు[మార్చు]

ఈ పురపాలక సంఘం 19.5.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.15 రెవెన్యూ వార్డులు,23 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 30 మురికివాడలు ఉన్నాయి.తాడేపల్లి మునిసిపాలిటీలో మొత్తం 23 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

దిగువ పట్టికలో రిజర్వ్ చేయని, రిజర్వు చేయబడిన (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బిసి) కులాలు వారీగా జాబితా.[4]

జాబితా ఎన్నికల వార్డులు రిజర్వు చేసిన మహిళా వార్డులు మొత్తం
జనరల్ 4 5 9
BC 4 4 8
SC 3 2 5
ST 0 1 1
మొత్తం 11 12 23

విలీనం లేదా రద్దు చేసిన పురపాలక సంఘం[మార్చు]

తాడేపల్లి పురపాలక సంఘం 2009లో ఏర్పాటైంది. 2021 మార్చి 23న మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ తాడేపల్లి పురపాలక సంఘంతోపాటు తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, ప్రాతూరు, వడ్డేశ్వరం, ఇప్పటం, మెల్లెంపూడి, చిర్రావూరు, కుంచనపల్లి, కొలనుకొండ, గుండిమెడ గ్రామ పంచాయతీలు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[5]

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 8 August 2016. Retrieved 23 June 2016.
  2. Srinivas, Rajulapudi (16 August 2015). "Tadepalli Municipality to be upgraded soon". The Hindu. Tadepalli (Guntur). Retrieved 30 March 2016.
  3. "Wayback Machine" (PDF). web.archive.org. 2019-09-06. Archived from the original on 2019-09-06. Retrieved 2022-08-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Wayback Machine" (PDF). web.archive.org. 2019-09-06. Archived from the original on 2019-09-06. Retrieved 2022-08-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. Chronicle, Deccan (2021-03-24). "AP government issues GO forming Mangalagiri Tadepalli Municipal Corporation". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-08-24.

వెలుపలి లంకెలు[మార్చు]