హిందూపురం పురపాలక సంఘం
హిందూపురం | |
![]() హిందూపురం పురపాలక సంఘం | |
స్థాపన | 1920 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | హిందూపురం |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
హిందూపురం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఈ పురపాలక సంఘం హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, హిందూపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర
[మార్చు]హిందూపురం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 558 కి.మీ దూరంలో ఉంది.1920 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 38 ఎన్నికల వార్డులు ఉన్నాయి.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం 151,677 జనాభా ఉండగా అందులో పురుషులు 76,370, మహిళలు 75,307 మంది ఉన్నారు.అక్షరాస్యత 75.23% ఉండగా అందులో పురుష జనాభాలో 80.80%, స్త్రీ జనాభాలో 69.58% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 17185 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 34,507 గృహాలు ఉన్నాయి.[1]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]2025 ఫిబ్రవరి 3 నుండి చైర్మన్‌గా టిడిపికి చెందిన.రమేష్ కుమార్ కొనసాగుతున్నారు. [2]
ఇతర వివరాలు
[మార్చు]ఈ పురపాలక సంఘం 38.16 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది.30 రెవెన్యూ వార్డులు,38 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఈ పురపాలక సంఘంలో మురికివాడలో 52% జనాభా ఉన్నారు.1 ప్రభుత్వ ఆసుపత్రి,25 ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Hindupur Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2019-10-07. Retrieved 2020-07-02.
- ↑ ABN (2025-02-03). "AP News: హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ నేత ఎన్నిక." Andhrajyothy Telugu News. Retrieved 2025-02-16.