భీమవరం పురపాలక సంఘం
భీమవరం | |
స్థాపన | 1948 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | భీమవరం |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
భీమవరం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా పట్టణం భీమవరానికి స్థానిక స్వపరిపాలన సంస్థ.ఈ పురపాలక సంఘం నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, భీమవరం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందినది.
చరిత్ర
[మార్చు]భీమవరం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 150 కి.మీ దూరంలో ఉంది. ఈ పురపాలక సంఘాన్ని 1948లో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించారు.భీమవరం పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ముఖ్య పట్టణాలలో ఒకటి. పంచారామాల్లో ఒకటైన సోమారామం భీమవరంలోనే ఉంది. ఈ పట్టణ పరిసరాలు రొయ్యల/చేపల చెరువులతో వర్ధిల్లుతున్నాయి.[1]
జనాభా గణాంకాలు
[మార్చు]భీమవరం పురపాలక సంఘంలో 39 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2001 లో పట్టణ జనాభా 137409 ఉండగా 2011 లో 142,184 కు పెరిగింది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 142,184 జనాభా ఉండగా అందులో పురుషులు 70,044, మహిళలు72,140 మంది ఉన్నారు.అక్షరాస్యత రేటు 70%. ఉండగా అందులో పురుష జనాభాలో 56%, స్త్రీ జనాభాలో 44% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 13,137 ఉన్నారు. భీమవరం పురపాలక సంఘంలో మొత్తం 37838 గృహాలు ఉన్నాయి.[2]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా కోటికలపుడి గోవింద రావు పనిచేస్తున్నాడు.[3] వైస్ చైర్మన్ గా ముదునూరి సత్యనారాయణ రాజు పనిచేస్తున్నాడు.[3]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]ఇతర వివరాలు
[మార్చు]ఈ పురపాలక సంఘం 25.64 చదరపు కి.మీ. విస్తరించి ఉంది. ఈ పురపాలక సంఘంలో 56 మురికివాడల ఉండగా అందులో జనాభా 32973 మంది ఉన్నారు. మొత్తం గృహాలు 37838, ప్రాథమిక పాఠశాలలు 51, ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 43, మూడు ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి .
మూలాలు
[మార్చు]- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 2016-01-28. Retrieved 19 June 2020.
- ↑ "Bhimavaram City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-19.
- ↑ 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016.