అద్దంకి నగరపంచాయితీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అద్దంకి నగరపంచాయితీ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థలకు చెందిన ఒక నగర పంచాయితీ.ఇది నగర పంచాయితీగా 2011 లో ఏర్పడింది. దీని ప్రధాన కేంద్రం అద్దంకి పట్టణం.ఇది గుండ్లకమ్మ నది ఒడ్డున ఉంది.ఈ నది అద్దంకి పట్టణానికి ప్రధాన నీటి వనరు. బాపట్ల లోకసభ నియోజకవర్గం, అద్దంకి శాసనసభ నియోజక వర్గం పరిధికి చెందిన పట్టణ స్థానిక సంస్థ.ఒంగోలు రెవెన్యూ డివిజను పరిధిలోకి వస్తుంది.ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 120 కి.మీ దూరంలోనూ జిల్లా ప్రధాన కేంద్రం 36 కి.మీ. దూరంలో ఉంది.ఇటుక పరిశ్రమకు పేరు పొందింది.[1]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం అద్దంకి నగర పంచాయితీ పరిధిలో మొత్తం జనాభా 43,8502 మంది ఉన్నారు.మొత్తం 12,393 కుటుంబాలు నివసిస్తున్నాయి.ఇది 25.00 చ. కి.మీ.విస్థీర్నంలో విస్తరించి ఉంది.నగరపంచాయితీని పరిధిని 20 ఎన్నికలు వార్డులుగా, 20 రెవెన్యూ వార్డులుగా విభజింపబడింది.[1]

నైసర్గిక స్వరూపం[మార్చు]

ఇది బౌగోళికంగా అక్షాంశం: 15.81670 N, రేఖాంశం: 79.98330 E వద్ద ఉంది.దీని సగటు ఎత్తు 40.00 మీటర్లు (131 అడుగులు). ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నుండి దాదాపు 36 కి.మీ. దూరంలోనూ, రాష్ట్ర రాజధాని అమరావతికి 120 కి.మీ.దూరంలో ఉంది.

వాతావరణం, వర్షపాతం[మార్చు]

అద్దింకి పట్టణం సాధారణంగా ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది, శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది, వేసవి కాలం మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది. వార్షిక వర్షపాతం 83.77 మి.మీ. (రెవెన్యూ రెయిన్ గేజ్), ఇది చాలా వరకు జూలై నుండి సెప్టెంబర్ వరకు కలిగి ఉంటుంది.

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా పరిమి దయామణి, వైస్ చైర్మన్‌గా చిన్ని శ్రీనివాసరావు పనిచేస్తున్నారు.[2]

సౌకర్యాలు[మార్చు]

 • సిమ్మెంటు రహదారులు - 65.31 కి.మీ. పొడవు
 • కచ్చా రహదారులు - 13.08 కి.మీ. పొడవు
 • పక్కా సైడుకాలువులు - 64.82 కి.మీ. పొడవు
 • కచ్చా సైడుకాలువులు - 4.08 కి.మీ. పొడవు
 • ప్రభుత్వ పాఠశాలలు -11
 • ప్రభుత్వ ఆసుపత్రి-1
 • అప్పర్ ప్రైమరీ పాఠశాలలు -4

పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు[మార్చు]

ప్రకాశం జిల్లా ప్రసిద్ధిచెందిన నరసింహ స్వామి ఆలయం,ఆంజనేయస్వామి అలయం 3 కి.మీ. దూరంలో ఉన్నాయి.[3] [4]గుండ్లకమ్మ నది కూడా సమీపంలోనే ఉంది.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 https://addanki.cdma.ap.gov.in/en/municipality-profile
 2. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Retrieved 13 May 2016.
 3. https://telugu.nativeplanet.com/travel-guide/sri-prasannanjaneya-swamy-temple-singarakonda-001365.html
 4. "Singarakonda Anjaneya Swamy / సింగరకొండ ఆంజనేయస్వామి". www.telugukiranam.com. Retrieved 2020-07-16.

వెలుపలి లంకెలు[మార్చు]