కొండపల్లి పురపాలక సంఘం
కొండపల్లి | |
రకం | స్థానిక సంస్థలు |
---|---|
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
కొండపల్లి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా లోని పురపాలక సంఘం. ఈ పురపాలక సంఘం విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం లోని, మైలవరం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.పురపాలక సంఘ ప్రధాన కార్యాలయం కొండపల్లి పట్టణంలో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]ఈ పురపాలక సంఘం గ్రేడ్ - 3 మునిసిపాలిటీ. దీనిని ఇబ్రహీంపట్నం, కొండపల్లి మేజర్ పంచాయతీలను కలిపి ఏర్పాటు చేశారు.దీని పరిధిలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. దీనికి పురపాలక సంఘం కౌన్సిల్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.2021 నవంబరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తం 29 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 14 వార్డులు తెలుగుదేశం పార్టీ గెలుపొందగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 వార్డులు గెలిచింది, 10వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి గెలిచింది .స్వతంత్ర అభ్యర్థి ఓటు, ఎక్స్ అఫీషియా ఓట్లుతో మున్సిపల్ చైర్మన్ గా తేదేపా అభ్యర్థి ఎన్నికయ్యాడు.[2][3][4]
భౌగోళికం
[మార్చు]కొండపల్లి పురపాలక సంఘం 16°37′06″N 80°32′28″E / 16.61833°N 80.54111°E అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ గుండా పోయే 221 జాతీయ రహదారి 16 కి.మీ. దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పట్టణ పరిధిలో 33,373 జనాభా ఉండగా అందులో పురుషులు 16,772 ఉండగా స్త్రీలు 16,606 మంది ఉన్నారు. ఈ పురపాలక సంఘం పరిధిలో 8,947 గృహాలు ఉన్నాయి.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ https://goir.ap.gov.in/
- ↑ "DTCP". Archived from the original on 2021-10-25. Retrieved 2021-10-25.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-10-25. Retrieved 2021-10-25.
- ↑ "Villages & Towns in Ibrahimpatnam Mandal of Krishna, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-10-25.