ధర్మవరం పురపాలక సంఘం
ధర్మవరం | |
స్థాపన | 1964 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | ధర్మవరం |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
ధర్మవరం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, ధర్మవరం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర
[మార్చు]ధర్మవరం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 527 కి.మీ దూరంలో ఉంది. ఈ పురపాలక సంఘాన్ని 1964లో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.చేనేత మగ్గాలు కలిగిన పరిశ్రమలు ఉన్న పట్టణాల్లో ధర్మవరం ఒకటి[1]
జనాభా గణాంకాలు
[మార్చు]ధర్మవరం పురపాలక సంఘంలో 40 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2001 లో 103400 ఉన్న పట్టణ జనాభా 2011 లో 121,874 కు పెరిగింది.2011 భారత జనాభా లెక్కల ప్రకారం 121,874 జనాభా ఉండగా అందులో పురుషులు 62,250, మహిళలు 59,624 మంది ఉన్నారు.అక్షరాస్యత 63.64% ఉండగా అందులో పురుష జనాభాలో 36.15%, స్త్రీ జనాభాలో 27.49% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 12730 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 30,096 గృహాలు ఉన్నాయి.[2]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా బీర గోపాలకృష్ణ, వైస్ చైర్మన్‌గా అంబరపు శ్రీనివాసులు పనిచేస్తున్నారు .[3]
మూలాలు
[మార్చు]- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-03. Retrieved 2020-06-20.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)