కందుకూరు పురపాలక సంఘం
కందుకూరు | |
స్థాపన | 2001 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | కందుకూరు |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
కందుకూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశంకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలోని, కందుకూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర
[మార్చు]కందుకూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 189 కి.మీ దూరంలో ఉంది.1987కు ముందు కందుకూరు పంచాయతీగా ఉండేది. అప్పట్లో పరిసర గ్రామాలైన దూబగుంట, వెంకటాద్రిపాలెం, చుట్టుగుంట, దివివారిపాలెం, గళ్లావారిపాలెం, శ్యామీరపాలెం, కండ్రావారిపాలెం, ముక్కోడిపాలెం గ్రామాలను కలిపి కందుకూరును నగర పంచాయతీగా ఏర్పాటు చేశారు.1988 నుంచి ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చారు. మొదటి ఛైర్మన్‌గా దివి లింగయ్యనాయుడు పనిచేశాడు.2001లో 47 వేల జనాభాతో గ్రేడ్-2 మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది.ఈ పురపాలక సంఘంలో 22 ఎన్నికల వార్డులు ఉన్నాయి. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.[1]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం 57,246 జనాభా ఉండగా అందులో పురుషులు 28,644, మహిళలు 28,602 మంది ఉన్నారు.అక్షరాస్యత 74.84% ఉండగా అందులో పురుష జనాభాలో 82.02%, స్త్రీ జనాభాలో 67.69% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5754 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 13,934 గృహాలు ఉన్నాయి.[2][3]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- జనార్ధన స్వామి దేవాలయం
- కన్యక పరమేశ్వరి దేవాలయం
- సత్యసాయి సేవా సమితి (జనార్ధన స్వామి ఆలయం సమీపంలో ఉంది).
మూలాలు
[మార్చు]- ↑ "కల... కానుందో ఎలా!". m.eenadu.net. Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-29.
- ↑ "Kandukur Municipality". indikosh.com. Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-29.
- ↑ "Kandukur Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-29.