సూళ్లూరుపేట పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూళ్లూరుపేట పురపాలక సంఘం
సూళ్లూరుపేట
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

సూళ్లూరుపేట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా లోని పురపాలక సంఘం. ఈ పురపాలక సంఘం తిరుపతి లోకసభ నియోజకవర్గం లోని, సూళ్ళూరుపేట శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.పురపాలక సంఘ ప్రధాన కార్యాలయం సూళ్లూరుపేట పట్టణంలో ఉంది. [1]

చరిత్ర[మార్చు]

ఈ పురపాలక సంఘం 2012 లో గ్రేడ్-III గా ఏర్పాటు చేశారు.25 వార్డులు ఉన్నాయి. దీనికి పురపాలక సంఘం కౌన్సిల్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.[2]

భౌగోళికం[మార్చు]

సూళ్లూరుపేట పురపాలక సంఘం 13°42′00″N 80°01′05″E / 13.700°N 80.018°E / 13.700; 80.018అక్షాంశ రేఖాంశాలు: 13°42′00″N 80°01′05″E / 13.700°N 80.018°E / 13.700; 80.018అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి 374 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇది సమీప పట్టణమైన నెల్లూరు నుండి 100 కి.మీ దూరంలో ఉంది.[3]

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం సూళ్లూరుపేట జనాభా 83760, అందులో పురుషులు కాగా 41198 స్త్రీలు 42562 ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 8719 ఇది మొత్తం జనాభాలో 10%.సగటు లింగ నిష్పత్తి 1002, సూళ్లూరుపేట అక్షరాస్యత శాతం 65.67% ఇందులో పురుషులు 70.65% అక్షరాస్యులు 60.85% స్త్రీలు అక్షరాస్యులు ఉన్నారు.[4][5]

పౌర పరిపాలన[మార్చు]

ఈ పురపాలక సంఘంలో కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 25 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[6]

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. Telugu, TV9 (2021-03-14). "AP Municipal Election Results 2021 Highlights: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా". TV9 Telugu. Retrieved 2021-10-28.
  3. Layout Page - Sullurpeta Mandal Panchayat[permanent dead link]
  4. "Sullurpeta Population Sri Potti Sriramulu Nellore, Andhra Pradesh". Censusindia2011.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-29.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. Layout Page - Sullurpeta Mandal Panchayat[permanent dead link]
  6. "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.

వెలుపలి లంకెలు[మార్చు]