సాలూరు పురపాలక సంఘం
సాలూరు | |
స్థాపన | 1950 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | సాలూరు |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
సాలూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరంజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అరకు లోక్సభ నియోజకవర్గంలోని, సాలూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
సాలూరు పురపాలక సంఘం, విజయనగరం జిల్లాకు చెందిన పురపాలక సంఘం. ఈ పట్టణానికి తూర్పున వేగావతి నది ప్రవహిస్తుంది. 2001లో 43,435 జనాభా ఉండగా, 2011 నాటికి 48,362కు పెరిగింది. తద్వారా దశాబ్ది జనాభా పెరుగుదల రేటు 10.18%గా నమోదుచేసుకొన్నది.
చరిత్ర[మార్చు]
సాలూరు 1950 అక్టోబర్ 3 మూడవ గ్రేడు పురపాలక సంఘంగా స్థాపించారు. ఇటీవలి కాలంలో రెండవ గ్రేడ్ మున్సిపాలిటీగా మార్చబడినది.పట్టణం వైశాల్యం 19.55 చదరపు కిలోమీటర్లు. పట్టణానికి తూర్పు వైపున పురాతన పంచముకేశ్వర ఆలయం ఉంది.
జనాభా గణాంకాలు[మార్చు]
సాలూరు పురపాలక సంఘం లో 29 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 జనాభా లెక్కల మొత్తం జనాభా 49,500 ఉండగా వీరిలో 24,021 మంది పురుషులు,25,479 మంది మహిళలు ఉన్నారు.ఆదోని నగరంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4900 ఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 58.9% ఉండగా పురుషుల్లో అక్షరాస్యత రేటు 81.8%, స్త్రీలలో అక్షరాస్యత 65.21%. ఉన్నది.[1]
విశేషాలు[మార్చు]
సాలూరు పట్టణంలో పువ్వుల పెంపకం, లారీల శరీరాలు తయారు చేయడం (బాడి బిల్దింగ్), లారీ, బస్సుల ట్యూబ్ లు టైర్లు రిపేరు చేయడం ప్రధాన వృత్తులు. పట్టణంలో 24 ప్రాథమిక పాఠశాలలు, 9 ఉన్నత పాఠశాలలు, 4 జూనియర్ కళాశాలలు, 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అంతేకాక పట్టణంలో 13 రైస్ మిల్లులు, 2 రంపం మిల్లులు (వడ్రంగి పనికి చెక్క కోసే మిల్లు), 3 ఇంజనీరింగ్ వర్క షాప్ లు, 15 వాహనాల రిపైరు చేసే షెడ్స్, 8 లారీ బాడి బిల్డింగ్ కర్మాగారాలు ఉన్నాయి. పట్టణంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, హోమియో ఆసుపత్రి, 5 ప్రైవేటు నర్సింగ్ హోమ్లు, 30 మంది వైద్యులతో ఒక కమ్యూనిటి ఆరోగ్య కేంద్రం ఉన్నాయి.
1959 సంవత్సరం పట్టణానికి రక్షిత మంచి నీరు సరఫరా చేసే ఉద్దేశంతో ఒక బావిని, ఒక పంప్ హౌస్ ని, ఒక ఓవర్ హెడ్ నీరు భద్రపరచే జలాశయాన్ని నిర్మించారు. రక్షిత మంచి నీటి పథకానికి నీటి ఆధారం వేగావతి నది. ఈ పథకానికి 1987, 1993, 2001 సంవత్సరాలలో జరిగిన ఉన్నత మార్పుల వల్ల, 2002 సంవత్సరం నుండి పట్టణంలో 80 శాతం మందికి రక్షిత మంచి నీరు సరఫరా అవుతోంది. రోజుకి సగటున 3.69 MLD (8.11 లక్ష గ్యాలన్ల) నీరు సరఫరా చేయబడుతోంది. నీటి ఫలకం భూమి నుండి 12 మీటర్ల లోతులో ఉంది.
మూలాలు[మార్చు]
- ↑ "Salur Population, Caste Data Vizianagaram Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-08.