రామచంద్రపురం పురపాలక సంఘం
రామచంద్రపురం | |
స్థాపన | 1959 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
రామచంద్రపురం పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా, రామచంద్రాపురం పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థ. ఈ పురపాలక సంఘం అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం లోని రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం పరిధిలోనిది.
చరిత్ర
[మార్చు]రామచంద్రపురం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా లోని మునిసిపాలిటీ.1959 సంవత్సరంలో III వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 13.985.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.27 ఎన్నికల వార్డులు ఉన్నాయి.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం 43,657 జనాభా ఉండగా అందులో పురుషులు 21,544,మహిళలు 23,113 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 82.25% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 85.23% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 79.35%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3994 ఉన్నారు.[1]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా నాగేశ్వరరావు,[2] వైస్ చైర్మన్‌గా సత్యనారాయణ పనిచేస్తున్నారు.[2]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు
[మార్చు]కాకర్లపూడి వంశానికి చెందిన కోట ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈకోటలో అనేక సినిమాలను చిత్రీకరించారు.ఈ కోటలో ఇప్పటికీ వారి వంశస్థులు నివసిస్తున్నారు.
పరిశ్రమలు, వ్యాపారం
[మార్చు]100 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించిన ఆర్టోస్ శీతలపానీయాల పరిశ్రమ శీతలపానీయాల పరిశ్రమ అభివృద్ధి చెందింది. పట్టణంలో ఇంకా వున్న చిన్నతరహా పరిశ్రమలతో పాటు ప్రక్క గ్రామం చెల్లూరు లోని సర్వారాయ పంచదార కర్మాగారం ఈ ప్రాంతం పారిశ్రామికాభివృద్ధికి దోహద పడ్డాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 29 August 2014.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.
- ↑ "ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ". www.msn.com. Retrieved 2020-03-29.