తణుకు పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తణుకు పురపాలక సంఘం
తణుకు
స్థాపన1979
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
తణుకు
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికారక వెబ్సైట్

తణుకు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పురపాలక సంఘం.ఈ పురపాలక సంఘం నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, తణుకు శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది నరసాపురం రెవెన్యూ డివిజను పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర

[మార్చు]

తణుకు పురపాలక సంఘం, 1979 సంవత్సరంలో గ్రేడ్ II మునిసిపాలిటీగా స్థాపించబడింది. 2002 సంవత్సరంలో గ్రేడ్ I గా మార్చబడింది.ఈ మున్సిపాలిటీలో 34 వార్డులు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతికి 165 కిలోమీటర్లు దూరంలో ఉంది. ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ తణుకు పురపాలక సంఘం చైర్మన్ గా పనిచేసాడు.[1] ఇందులో మూడు గ్రామపంచాయతీలు ఇటీవల తణుకు పురపాలక సంఘంలో విలీనం చేశారు.

జనాభా గణాంకాలు

[మార్చు]

తణుకు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలంలో ఉన్న మునిసిపాలిటీ, అవుట్‌గ్రోత్ నగరం. తణుకు నగరాన్ని 34 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం 77,962, అందులో 38,325 మంది పురుషులు, 39,637 మంది మహిళలు. తణుకు పురపాలక సంఘం పరిధిలో 2011 భారత  జనగణన గణాంకాల ప్రకారం మొత్తం 20,909 కుటుంబాలు నివసిస్తున్నాయి.సగటు సెక్స్ నిష్పత్తి 1,034.[2]

తణుకు నగరంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6882, ఇది మొత్తం జనాభాలో 9%. 0 - 6 సంవత్సరాల మధ్య 3438 మంది మగ పిల్లలు, 3444 ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లైంగిక నిష్పత్తి 1,002, ఇది సగటు సెక్స్ నిష్పత్తి (1,034) కన్నా తక్కువ. అక్షరాస్యత రేటు 85.5%. పశ్చిమ గోదావరి జిల్లాలో 74.6%తో పోలిస్తే తణుకు అక్షరాస్యత ఎక్కువ. పురుషుల అక్షరాస్యత రేటు 88.74%, స్త్రీ అక్షరాస్యత రేటు 82.39%.[2]

2001 లో 68,224 ఉన్న పట్టణ జనాభా 2011 లో 90,430 కు పెరిగింది,

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్ గా దొమ్మేటి వెంకట సుధాకర్ (9వార్డు కౌన్సిలరు) పనిచేస్తున్నాడు.[3] మంత్రిరావు వెంకటరత్నం వైస్ చైర్మన్ గా (20 వార్డు కౌన్సిలరు) పనిచేస్తున్నాడు.

ప్రస్తుత పాలకవర్గం

[మార్చు]

ఈ క్రిందివారు ప్రస్తుత పాలకవర్గ సభ్యులు (కౌన్సిలర్లు) గా పనిచేస్తున్నారు.

  • చిట్టల అనంత లక్ష్మి -1 వార్డు
  • బొడ్డాని నాగరాజు - 2 వార్డు
  • గుబ్బల రామారావు -3 వార్డు
  • ఏలుబుడి ఈశ్వరరావు -4 వార్డు
  • తణుకు రేవతి -5 వార్డు
  • ఉండ్రాజవరపు హేమలత -6 వార్డు
  • పెరవలి రామకృష్ణ -7 వార్డు
  • ఉటా గోవింద రాజు -8 వార్డు
  • దొమ్మేటి వెంకట సుధాకర్ (చైర్మన్) -9వార్డు
  • నాయుడు లావణ్య -10 వార్డు
  • తామరపు రామణమ్మ -11 వార్డు
  • బత్తవిల్లి లక్ష్మి -12 వార్డు
  • గంటి విజయ -13 వార్డు
  • చిట్టూరి స్వర్ణలత -14 వార్డు
  • తేనేటి వీరయ్య -15 వార్డు
  • కలగూర వెంకటకృష్ణ -16 వార్డు
  • బసవ వీర వెంకటసత్య రామకృష్ణారావు -17 వార్డు
  • సప్పా వీర రాఘవులు -18 వార్డు
  • దులం చిట్టిపాప -19 వార్డు
  • మంత్రిరావు వెంకటరత్నం (వైస్ చైర్మన్) -20 వార్డు
  • పరిమి వెంకటేశ్వరరావు -21 వార్డు
  • కీర్తి శివప్రసాదు -22 వార్డు
  • మల్లిన వెంకటరాధాకృష్ణారావు -23 వార్డు
  • వావిలాల సరళాదేవి -24 వార్డు
  • బైశెట్టి నాగ సత్యశ్రీదేవి -25 వార్డు
  • మాదాసు రామకృష్ణ ప్రసాదు -26 వార్డు
  • కుప్పల ఇందిరాదేవి -27 వార్డు
  • గంధి వరలక్ష్మి -28 వార్డు
  • కాకిలేటి సత్యవాణి -29 వార్డు
  • కొమేమిరెడ్డి రమాదేవి -30 వార్డు
  • పీతాని సత్యదేవి -31 వార్డు
  • తాడిపర్తి శ్యాంబాబు -32 వార్డు
  • ఇందుగపల్లి బలరామకృష్ణ -33 వార్డు
  • ఉరింకల ఎల్లరేశ్వరి -34 వార్డు

మూలాలు

[మార్చు]
  1. "Mullapudi Harischandra Prasad dead". The Hindu (in Indian English). Special Correspondent. 2011-09-04. ISSN 0971-751X. Retrieved 2020-06-15.{{cite news}}: CS1 maint: others (link)
  2. 2.0 2.1 "Tanuku Population, Caste Data West Godavari Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-15. Retrieved 2020-06-15.
  3. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]