కమలాపురం నగరపంచాయతీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కమలాపురం నగరపంచాయతీ
కమలాపురం
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంనగర పంచాయతీ

కమలాపురం నగరపంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్‌ఆర్ జిల్లా లోని నగర పంచాయతీ. ఈ నగరపంచాయతీ కడప లోక్‌సభ నియోజకవర్గం లోని, కమలాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.పురపాలక సంఘ ప్రధాన కార్యాలయం కమలాపురం పట్టణంలో ఉంది. [1]

చరిత్ర[మార్చు]

పంచాయతీగా ఉన్న కమలాపురం గ్రామాన్ని 2020 జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వం నగరపంచాయతీగా ఏర్పాటు చేసింది. సమీపంలోని మీరాపురం పంచాయతీని కమలాపురం నగర పంచాయతీలో విలీనం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ మీరాపురం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం స్టే ఇవ్వడం వల్ల 20 వార్డులు, 15,660 ఓటర్లు కలిగిన కమలాపురం నగర పంచాయతీ ఎన్నికలు గత మార్చిలో జరగలేదు. న్యాయస్థానం నగరపంచాయతీ ఏర్పాటుకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది.దీనికి పురపాలక సంఘం కౌన్సిల్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.20 వార్డులు ఉన్నాయి.[2]

భౌగోళికం[మార్చు]

కమలాపురం నగర పంచాయతీ 14°35′00″N 78°39′00″E / 14.5833°N 78.6500°E / 14.5833; 78.6500.[3].రాష్ట్ర రాజధాని అమరావతి 111 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 440 అడుగులలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం కమలాపురం నగర పంచాయతీ జనాభా 20,623, అందులో 10,018 మంది పురుషులు కాగా 10,605 మంది స్త్రీలు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2324 మంది ఉన్నారు.2011లో కమలాపురం అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే 72.02 % ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 79.65% కాగా, స్త్రీల అక్షరాస్యత 64.29% అక్షరాస్యులు ఉన్నారు. ఈ నగర పంచాయతీ పరిధిలో మొత్తం 4,687 ఇళ్లకు పైగా ఉన్నాయి.నీరు, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది.

పౌర పరిపాలన[మార్చు]

ఈ నగర పంచాయతీ కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తాడు. అతను ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[4]

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. Telugu, TV9 (2021-03-14). "AP Municipal Election Results 2021 Highlights: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా". TV9 Telugu. Retrieved 2021-10-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Falling Rain Genomics.Kamalapuram
  4. "Commissioner and Director of Municipal Administration |". cdma.ap.gov.in. Retrieved 2021-10-19.

వెలుపలి లంకెలు[మార్చు]