ఆదోని పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదోని పురపాలక సంఘం
ఆదోని
ఆదోని పురపాలక సంఘ భవనం.jpeg
ఆదోని పురపాలక సంఘ భవనం
స్థాపన1865
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన కార్యాలయాలుఆదోని
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

ఆదోని పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలుజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కర్నూలు లోకసభ నియోజకవర్గంలోని, ఆదోని శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

ఆదోని పురపాలకసంఘం 1865 లో ఆవిర్భవించింది. అప్పటిలో బళ్లారి జిల్లాలో ఉండేది. అప్పటి బళ్లారి కలెక్టర్‌ అధ్యక్షతన తొలి పాలకవర్గం కొలువుదీరింది. ఆనాటి జనాభా కేవలం 12,500 మాత్రమే. నివాస గృహాలు 450. పట్టణ విస్తీర్ణం 10.5 చ. కి.మీ.పురపాలక సంఘం తొలి చైర్మన్ గా‌ హజీకే అబ్దుల్‌ రెహమాన్‌ పని చేశారు.ఆదోని మున్సిపాలిటీకి 1917లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి.1952లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాకా బళ్లారి జిల్లా నుంచి ఆదోని విడిపోయి, కర్నూలు జిల్లాలో చేరింది.[1]

జనాభా గణాంకాలు[మార్చు]

కర్నూలు జిల్లాలోని ఆదోని పురపాలక సంఘం లో 41 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 జనాభా లెక్కల మొత్తం జనాభా 269,286 ఉండగా వీరిలో 134,306 మంది పురుషులు,134,980 మంది మహిళలు ఉన్నారు.ఆదోని నగరంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 34,555 వీరిలో మగ పిల్లలు సంఖ్య 17,585,ఆడ పిల్లలు సంఖ్య 16,970 ఉన్నారు.[2]

ప్రస్తుత కమిషనర్, చైర్‌పర్సన్[మార్చు]

ప్రస్తుతం పురపాలక సంఘం కమిషనర్ గా బి.శ్రీకాంత్ పని చేస్తున్నారు.[3] చైర్‌పర్సన్ కురుబా సరోజమ్మ పని చేస్తున్నారు.[4]

అవార్డులు, విజయాలు[మార్చు]

2015 లో, స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్‌లో ఆదోని పురపాలక సంఘం దేశంలో 148 వ స్థానంలో ఉంది.[5]

ఇతర వివరాలు[మార్చు]

ఈ ప్రాంతం 38.16 చ.కి.మీ.లో విస్తరించి ఉంది. గృహాల సంఖ్య 33071, రెవెన్యూ వార్డుల సంఖ్య 26, ఎన్నికల వార్డుల సంఖ్య 41 ,మురికివాడల సంఖ్య 51, మురికివాడల జనాభా 61510 ,ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య 3 ,ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 15, పబ్లిక్ పార్కుల సంఖ్య 2 ,కమ్యూనిటీ హాల్స్ 5 ఉన్నాయి.[6]

మూలాలు[మార్చు]

  1. "ఆంధ్రా ముంబై అథోగతి". www.andhrajyothy.com. Retrieved 2020-06-16.
  2. "Adoni Mandal Population, Religion, Caste Kurnool district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2020-06-16.
  3. "Commissioner". Official website of Adoni Municipality. Archived from the original on 2016-05-13. Retrieved 12 May 2016.
  4. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబర్ 2019. Retrieved 13 May 2016. Check date values in: |archive-date= (help)
  5. Kumar, S. Sandeep (2015-08-10). "Small towns fare better in Swachh Bharat rankings". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2020-06-16.
  6. https://adoni.cdma.ap.gov.in/en/municipality-profile

వెలుపలి లంకెలు[మార్చు]