కుప్పం పురపాలక సంఘం
కుప్పం | |
స్థాపన | 2020 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | కుప్పం |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
కుప్పం పురపాలకసంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఈ పురపాలక సంఘం చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలోని, కుప్పం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర
[మార్చు]ఈ పురపాలక సంఘం 2020వ సంవత్సరంలో మూడవ గ్రేడు పురపాలక సంఘంగా ఏర్పాటు చేశారు.[1]
భౌగోళిక స్వరూపం
[మార్చు]కుప్పం పురపాలక సంఘం 12′ 45″ ఉత్తరం, 78′ 20″ తూర్పు అక్షాంశరేఖాంశాలవద్ద ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 21,963 మంది జనాభా ఉన్నరు. ఉండగా అందులో పురుషులు 11,091, మహిళలు 10,872 మంది ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2,551 ఉన్నారు. అక్షరాస్యత సగటు అక్షరాస్యత రేటు 83.62% ఉంది, ఇది రాష్ట్ర సగటు 67.41% కంటే గణనీయంగా ఎక్కువ.లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 980 మంది మహిళలు ఉన్నారు.[2]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 25 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[3] ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు". apdpms.ap.gov.in. Archived from the original on 2019-08-03. Retrieved 2021-04-02.
- ↑ "Literacy of AP (Census 2011)" (PDF). Official Portal of Andhra Pradesh Government. p. 43. Archived from the original (PDF) on 14 జూలై 2014. Retrieved 5 సెప్టెంబరు 2014.
- ↑ "కుప్పం పురపాలక సంఘం 25 వార్డులుగా విభజన". www.andhrajyothy.com. Retrieved 2021-04-02.