Jump to content

నెల్లిమర్ల నగరపంచాయితీ

వికీపీడియా నుండి
నెల్లిమర్ల నగరపంచాయితీ
నెల్లిమర్ల
స్థాపన2021
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

నెల్లిమర్ల నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగర జిల్లాకు చెందిన నగర పంచాయతీ.[1] ఈ నగరపంచాయితీ విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం లోని, నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.[2]

చరిత్ర

[మార్చు]

నెల్లిమర్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంంలోని విజయనగరం జిల్లాకు చెందిన నగర పంచాయతీ. ఇది సమీప పట్టణమైన విశాఖపట్నం నుండి 48 కి.మీ. దూరంలో ఉంది. జిల్లాలోని సుప్రసిద్ద పుణ్యక్షేత్రం రామతీర్ధం 7 కిలో మీటర్ల దూరంలో ఉంది.ఈ నగర పంచాయతీ 2021 లో 20 వార్డులతో ఏర్పాటు చేశారు.[3]

పట్టణ స్వరూపం

[మార్చు]

నెల్లిమర్ల పట్టణం చంపావతి నది వడ్డున ఉంది. దీని భౌగోళిక స్థానం 18°10′00″N 83°26′00″E / 18.1667°N 83.4333°E / 18.1667; 83.4333.[4] సముద్ర మట్టం నుండి ఎత్తు 190 మీటర్లు (626 అడుగులు).

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం నెల్లిమర్ల పట్టణ జనాభా మొత్తం 20,498, ఇందులో 9,677 మంది పురుషులు కాగా, 10,821 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1795, ఇది నెల్లిమర్ల సెన్సస్ టౌన్ మొత్తం జనాభాలో 8.76 %గా ఉంది. స్త్రీల లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 993 కి 1118 గా ఉంది. అంతేకాకుండా నెల్లిమర్లలో పిల్లల లింగ నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే 953 గా ఉంది.నెల్లిమర్ల పట్టణ అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే 72.66% ఎక్కువ . నెల్లిమర్లలో పురుషుల అక్షరాస్యత 79.53% కాగా, స్త్రీల అక్షరాస్యత 66.61 %గా ఉంది

నెల్లిమర్ల సెన్సస్ టౌన్‌లో 4,994 ఇళ్లకు పైగా పరిపాలన ఉంది, దీనికి నీరు సరఫరా, మురుగునీరు పారుదల వంటి ప్రాథమిక సదుపాయాలను స్థానిక స్వపరిపాలన చేస్తుంది. సెన్సస్ టౌన్ పరిధిలో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలో ఉన్న ఆస్తులపై పన్ను విధించడానికి కూడా స్థానిక స్వపరిపాలన సంస్థకు అధికారం ఉంది.

2001 జనాభా లెక్కల ప్రకారం నెల్లిమర్ల పట్టణ జనాభా 19,352. ఇందులో పురుషుల సంఖ్య 48% ఉండగా, స్త్రీల సంఖ్య 52% ఉంది. పట్టణ అక్షరాస్యత 62% ఉంది. దేశపు సగటు అక్షరాస్యత 59.5% కంటే ఇది మెరుగు. నెల్లిమర్ల పట్టణపు పురుషుల అక్షరాస్యత 70%, స్త్రీల అక్షరాస్యత 54%. మొత్తం జనాభాలో 8% వరకు ఆరు సంవత్సరాలలోపు బాలబాలికలు ఉన్నారు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Nellimarla Census Town City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-08-14.
  2. "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
  3. "Andhra government notifies five new nagar panchayats, rejigs 13 civic bodies". The New Indian Express. Retrieved 2021-06-06.
  4. Fallingrain.com Nellimarla

వెలుపలి లంకెలు

[మార్చు]