వెంకటగిరి పురపాలక సంఘం
వెంకటగిరి | |
స్థాపన | 2005 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
వెంకటగిరి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తిరుపతిజిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఈ పురపాలక సంఘం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం లోని,వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర
[మార్చు]రాష్ట్ర రాజధానికి అమరావతికి 352 కి.మీ దూరంలో ఉంది.2005 లో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది.[1]వెంకటగిరి అనే గ్రామనామం వెంకట అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. వెంకట అనేది దైవ సూచి, శ్రీనివాసుని మరో పేరు వెంకట.[2]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం 52,688, జనాభా ఉండగా అందులో పురుషులు 26,132 , మహిళలు 22,556 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 84.27%,ఉండగా స్త్రీ జనాభాలో 68.93%. అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4888 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 13,247గృహాలు ఉన్నాయి.[3]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా శ్రీమతి నక్కా భానుప్రియ,[4]వైస్ చైర్మన్‌గా చింతపట్ల ఉమామహేశ్వరి పనిచేస్తున్నారు.[4]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- వెంకటగిరి సంస్థానం: ఆంధ్రప్రదేశ్‌లోని సంస్థానాల్లోకెల్లా అతిపెద్దదైన, ప్రాచీనమైన సంస్థానాల్లో ఒకటి.[5]
- రామలింగేశ్వర స్వామి దేవాలయం
- ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం
- పోలరమ్మ దేవాలయం.
ఇతర వివరాలు
[మార్చు]ఈ పురపాలక సంఘం 23.50 చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.25 రెవెన్యూ వార్డులు,25 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘం లో మురికివాడల సంఖ్య 42 ఉండగా అందులో జనాభా 32160 ఉన్నారు.1 ప్రభుత్వ ఆసుపత్రి,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Brief about Municipality". Commissioner and Director of Municipal Administration. Government of Andhra Pradesh. Archived from the original on 19 ఫిబ్రవరి 2015. Retrieved 19 February 2015.
- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 233. Retrieved 10 March 2015.
- ↑ "Venkatagiri Population, Caste Data Sri Potti Sriramulu Nellore Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-07-04. Retrieved 2020-07-04.
- ↑ 4.0 4.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.
- ↑ శ్రీరామ్, వీరబ్రహ్మమ్ (1918). నానారాజన్య చరిత్రము. p. 2.