అక్షాంశ రేఖాంశాలు: 16°36′00″N 81°23′00″E / 16.6000°N 81.3833°E / 16.6000; 81.3833

ఆకివీడు నగరపంచాయితీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకివీడు నగరపంచాయితీ
ఆకివీడు
స్థాపన2021
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

ఆకివీడు నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఈ పురపాలక సంఘం నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం లోని, ఉండి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.ఇది నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధికి చెందినది.

చరిత్ర

[మార్చు]

ఆకివీడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నగర పంచాయతీ. ఇది సమీప పట్టణమైన ఏలూరు నుండి 49 కి.మీ. దూరంలో ఉంది. ఈ నగర పంచాయతీ 2021 లో 20 వార్డులతో ఏర్పాటు చేశారు.[1]

భౌగోళికం

[మార్చు]

ఆకివీడు నగరపంచాయితీ16°36′00″N 81°23′00″E / 16.6000°N 81.3833°E / 16.6000; 81.3833 అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది.ఇది సమీప పట్టణమైన భీమవరం నుండి 18 కి. మీ. దూరంలోను, సముద్ర తీరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి నుండి 122 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ 20,869 ఇళ్లతో, మొత్తం జనాభా 73,889. అందులో పురుషులు 36778, స్త్రీలు 37,111 మంది ఉన్నారు.అక్షరాస్యత కలిగిన వారు 47,757 సగటు అక్షరాస్యత 71.57%, వీరిలో 24,953 మంది పురుషులు, 22,804 మంది స్త్రీలు ఉన్నారు.[2][3]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

మూలాలు

[మార్చు]
  1. "Andhra government notifies five new nagar panchayats, rejigs 13 civic bodies". The New Indian Express. Retrieved 2021-06-06.
  2. https://www.censusindia.gov.in/2011census/dchb/2815_PART_B_DCHB_WEST%20GODAVARI.pdf
  3. "Literacy of AP (Census 2011)" (PDF). Official Portal of Andhra Pradesh Government. p. 43. Archived from the original (PDF) on 14 జూలై 2014. Retrieved 19 అక్టోబరు 2014.