ఆకివీడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆకివీడు
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో ఆకివీడు మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో ఆకివీడు మండలం యొక్క స్థానము
ఆకివీడు is located in ఆంధ్ర ప్రదేశ్
ఆకివీడు
ఆకివీడు
ఆంధ్రప్రదేశ్ పటములో ఆకివీడు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°36′00″N 81°23′00″E / 16.6000°N 81.3833°E / 16.6000; 81.3833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము ఆకివీడు
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 74,766
 - పురుషులు 37,601
 - స్త్రీలు 37,165
అక్షరాస్యత (2001)
 - మొత్తం 78.94%
 - పురుషులు 83.31%
 - స్త్రీలు 74.53%
పిన్ కోడ్ 534235
ఆకివీడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం ఆకివీడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 24,259
 - పురుషుల సంఖ్య 12,124
 - స్త్రీల సంఖ్య 12,135
 - గృహాల సంఖ్య 5,944
పిన్ కోడ్ 534 235
ఎస్.టి.డి కోడ్

ఆకివీడు (ఆంగ్లం Akiveedu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, మరియు ఆకివీడు మండలానికి కేంద్రాలయం. పిన్ కోడ్: 534 235. ఇటీవల బాగా అభివృధ్ధి సాధించి దగ్గర పట్టణమైన భీమవరంతో పోటీపడే స్థాయికి ఎదిగింది.

చరిత్ర[మార్చు]

ఆకివీడు సంత బజారు సెంటరు

ఆకివీడు గ్రామంలో అందరూ వరి పంట ఎక్కువుగా పండిచేవారు. అందువలన ఒకానొక సమయంలో రాష్ట్రములోనే అత్యధికంగా బియ్యం మిల్లులు ఉండేవి. పరిసర ప్రాంతాలు అన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. 1990లో చేపల, రొయ్యల పెంపకం జోరు అందుకుంది. ఆ తరువాత బియ్యం మిల్లులు తగ్గుముఖం పట్టాయి. కాని ఆర్ధికంగా అభివృధ్ధి చెందింది.

రాష్ట్రములో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు, కొల్లేరు సరస్సు, ఆకివీడు గ్రామం ద్వారా చేరవచ్చు.

ఆకివీడు అక్షాంశ రేఖాంశాలు: 16°36'North,81°23'East. [1]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24259.[1] ఇందులో పురుషుల సంఖ్య 12124, మహిళల సంఖ్య 12135, గ్రామంలో నివాసగృహాలు 5944 ఉన్నాయి.

విద్యా సదుపాయాలు[మార్చు]

 1. P.L.S.Z.P.P. ఉన్నత పాఠశాల
 2. C.M.ఉన్నత పాఠశాల
 3. M.P.P.U.P స్కూలు
 4. బాలికల ఉన్నత పాఠశాల
 5. సైన్త్ అలోసియస్ ఉన్నత పాఠశాల
 6. జిల్లా గ్రంథాలయ సంస్థ లైబ్రరీ: ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొదటి డిజిటల్ లైబ్రరీ. 'DIGITAL LIBRARY' ఇందులో నాలుగు కంప్యూటర్లు ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

రైలు వసతి[మార్చు]

ఉన్న ప్రాంతము, ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

ఆకివీడు సముద్ర తీరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రోడ్డు మార్గము

ఈ గ్రామం రాష్ట్ర రహదారి మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ముఖ్య పట్టణాల నుండి, మరియు హైదరాబాదు నుండి ప్రతిరోజు బస్సు సదుపాయం ఉంది. రోడ్డు మార్గంలో ఏలూరు నుంచి రెండు గంటలోపు చేరుకోవచ్చు. ప్రతి 30 నిమిషములకు 1 బస్సు ఉంది. ఆకివీడుకు రాష్ట్ర రాజధాని హైదరాబాదునుండి 437 కి.మీ., విశాఖపట్నం నుండి 288 కి.మీ., విజయవాడ నుండి 85 కి.మీ., భీమవరం నుండి 18 కి.మీ. ఇది రోడ్డు, రైలు మార్గములతో చక్కగా కలపబడింది.

రైలు మార్గము

ఈ గ్రామం విజయవాడ - కాకినాడ లను కలిపే రైలు మార్గము మధ్యలో ఉంది. చెన్నై (మద్రాసు), బెంగుళూరు ల నుండి కూడా ప్రయాణ సదుపాయం ఉంది.

విమాన మార్గము

ఇక్కడకి దగ్గ్గ్గరలోని విమానాశ్రయము విజయవాడ. విజయవాడ లేదా విశాఖపట్నంకు వచ్చి అక్కడ నుండి రోడ్డుమార్గములో రావచ్చు.

ఊరిలో జరిగే ఉత్సవములు/జాతరలు[మార్చు]

ఆకివీడు పురవాస ప్రజలకు భక్తి, శ్రధ్ధలు ఎక్కువ. ప్రతీ ఏటా ఉత్సవాలను సంప్రదాయరీతిలో ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. అందులో ముఖ్యమైనవి

వీరభధ్రస్వామి సంబరం

ప్రతీ ఏటా మహాశివరాత్రి నాడు శంకరుడిని పూజిస్తూ శివాంశ సంభూతుడైన వీరభధ్రస్వామిని కొలుస్తూ సాలిపేటలో వెలసిన వీరభధ్రస్వామి గుడి దగ్గర సంబరాన్ని భక్తి శ్రద్ధలతో సంప్రదాయరీతిలో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు చాలామంది శివభక్తులు శివశూలాలను దవడ మీద గుచ్చుకుని ఎడ్లబండ్ల మీద ఊరంతా తిరుగుతారు. ఈ సంబరాన్ని చూడటానికి రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. శివరాత్రినాడు రాత్రి జరిగే "నిప్పుల సంబరం" ప్రత్యేక ఆకర్షణ. ఈ "నిప్పుల సంబరం"లో పాల్గొనాలనుకునే శివభక్తులు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. అలా ఉన్న భక్తులు మాత్రమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిప్పులు మీద నడవగలరని ఒక విశ్వాసం. ఈ సంబరంలో ఏదో విధంగా పాల్గొన్న వారికి ఆ సంవత్సరం అంతా బాగా నడుస్తుందని విశ్వాసం.

సుబ్రహ్మణ్యస్వామి షష్టి

సుబ్రహ్మణ్యస్వామి షష్టిని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పూర్వకాలంలో చాలా వైభవంగా జరిగేది. ఊరులోని జనమంతా ఆ జాతరలోనే సమయం గడిపేవారు.

దేశాలమ్మ సంబరం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

చుట్టుప్రక్కల చూడదగ్గ ప్రదేశాలు[మార్చు]

ప్రార్ధనా స్థలాలు
 • కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం.
 • కొల్లేరు పెద్దింట్లమ్మవారి మందిరం
 • సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి
 • పెద్ద మసీదు, చిన్న మసీదు, అన్వారి మసీదు
ఊరిలో ముఖ్యమైన స్థలాలు
 • గాంధీ పార్క్
 • సర్ అర్ధర్ కాటన్ మెమోరియల్ పార్కు
 • జెడ్-టర్నింగ్
 • డైలీ మార్కెట్టు
 • బస్ స్టాండ్ ఏరియా
 • సమథనగర్ కనక దుర్గ కమి Cotton park

మూలాలు[మార్చు]

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

బయటి లింకులు[మార్చు]

వనరులు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=ఆకివీడు&oldid=2264644" నుండి వెలికితీశారు