పెనుమంట్ర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెనుమంట్ర
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెనుమంట్ర మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెనుమంట్ర మండలం యొక్క స్థానము
పెనుమంట్ర is located in ఆంధ్ర ప్రదేశ్
పెనుమంట్ర
ఆంధ్రప్రదేశ్ పటములో పెనుమంట్ర యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°38′39″N 81°38′54″E / 16.644087°N 81.648273°E / 16.644087; 81.648273
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము పెనుమంట్ర
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 62,190
 - పురుషులు 31,124
 - స్త్రీలు 31,066
అక్షరాస్యత (2001)
 - మొత్తం 81.79%
 - పురుషులు 86.02%
 - స్త్రీలు 77.55%
పిన్ కోడ్ 534124
పెనుమంట్ర
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పెనుమంట్ర
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 11,061
 - పురుషుల సంఖ్య 5,491
 - స్త్రీల సంఖ్య 5,570
 - గృహాల సంఖ్య 2,820
పిన్ కోడ్ 534 124
ఎస్.టి.డి కోడ్

పెనుమంట్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.[1]. పిన్ కోడ్: 534 124. మార్టేరు మరియు అత్తిలి ప్రధాన రహదారిపై ఉంది. ఈ గ్రామము మంచి అభివృద్ధి చెందిన గ్రామము.

గ్రామచరిత్ర[మార్చు]

మొదట ఈ గ్రామము అనే పిలువ బడుతుండేది. ఈ గ్రామములో చాలా కాలం ముందు వరుసగా కొన్ని సంవత్సరాలు ప్రతి వేసవిలోనూ అగ్ని ప్రమాదాలు జరిగి గ్రామములో ఏదో ఒకవైపు చాలావరకు కాలిపోవుట జరుగుతుండేది. సమీప గ్రామములవారు పెద్దగా మండేమంటలను చూసి పెనుమంటలు మండుతున్నవి అనుకొనేవారు. అది పరిపాటిగా జరుగుతుండుటచే మెల్లగా ఆ ప్రాంతమును పెనుమంటగా వాడుకలో పెనుమంట్రగా పిలువడం మొదలెట్టారు.గ్రామము తణుకు తాలుకాలో ఉన్నాది.

దేవాలయాలు[మార్చు]

  • ఉమా ఇంద్రేశ్వరస్వామివారి దేవస్థానము. ఇది పెనుమంట్రలోని అతి పురాతన దేవాలయము.
  • శ్రీ భద్రాచలసీతారామచంద్రస్వామివారి దేవస్థానము.
  • శ్రీ సాయిబాబా దేవాలయము.
  • శ్రీరామాలయము[ద్వారంపూడివారి వీధి]. ఇది కూడా పెనుమంట్రలో మొదటగా కట్టబడిన అతి పురాతన ఆలయం.
Penumantra-2.jpg
  • శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానము (pedda చెరువు వెనుక). ఈ కనకదుర్గమ్మవారి దేవస్థానములో ఏప్రిల్ నెలలో పౌర్ణమికి జరిగే ఉత్సవాలు ఇక్కడ బహుప్రసిద్ధం. ఈ ఉత్సవాలను చూసేందుకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తుంటారు. పౌర్ణమి రాత్రికి జరిగే బాణాసంచా కార్యక్రమము ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఊరిలో వారు రెండు వర్గాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తదనంతరం ఎవరు బాగా బణాసంచా కాల్చారో వారికి బహుమతి ప్రదానం జరుగుతుంది.
Penumantra-1.jpg

విద్యాలయాలు[మార్చు]

ఉన్న తణుకు లేదా పెనుగొండలకు వెళ్ళవలసి రావడంతో పలు ఇబ్బందులు పడేవారు. విద్యార్థుల ఇబ్బందులను గమనించి కొందరు విదేశాలలో స్థిరపడిన స్థానికులు మరియు ఊరి పెద్దలు కళాశాల నిర్మించాలని ఉత్సాహంగా విరాళాలు ఇవ్వడంతో ఆంధ్రా అసోషియేషన్ యు.కె కాలేజి శరవేగంతో నిర్మాణం జరిగిపోయింది. ఈ కళాశాల వలన మండల మరియు పరిసర గ్రామ విద్యార్థులకు దగ్గరలో విద్యనభ్యసించే అవకాశం కలిగినది. పదవతరగతి వరకూ సేవలందిస్తున్న శ్రీ రామయ్య అచ్యుతానంద ఉన్నత పాఠశాల చరిత్ర బహుప్రసిద్ధం. ప్రతి సంవత్సరం పదవతరగతిలో మొదటగా వచ్చిన విద్యార్థికి బంగారు పతకం ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. బోర్డుస్కూల్స్-ఊరిలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.ఒకటి మంచినీటి చెరువు వెనుక, రెండవది సాంబయ్య చెరువు గట్టున, మూడవది రజక పేటలోనూ నాల్గవది వెలమపేటలోనూ ఉన్నాయి.

ఊరి విశేషాలు[మార్చు]

ఊరిలో ప్రజల వినోదం కోసం నిర్మింపబడిన శ్రీ వెంకటేశ్వరా థియేటర్ 1996 వ సంవత్సరంలో నష్టాలబాట పట్టడంతో మూసివేయబడింది. ప్రతి శనివారము సంత జరుగుతుంది.

ఊరి పెద్దలు[మార్చు]

కీర్తి శేషులు డాక్టర్ మేడపాటి రామ కృష్ణా రెడ్డి గారు, ప్రసిద్ధ వైద్యులు మరియు రాజకీయ నాయకులు, పేదలకు ఉచిత వైద్యం చేసెవారు, రోగులకు అతి తక్కువ ఖర్చుతో కార్పురేట్ వైద్యం చేసెవారు.
శ్రీ డాట్ల రామరాజు ప్రజావైధ్యశాల బహుప్రసిద్ధం. ఏరోగికైనా ఒకేఒక రూపాయి ఫీజు తీసుకొనుట ఇక్కడి ప్రత్యేకత. ఎప్పుడు ఏసమయంలొ ఏరోగి వచ్చినా లేదనకుండా వైద్యం చేసి ఒకే ఒక రూపాయి ఫీజుగా తీసుకొనే రామరాజు గారిని మండలంలోనే కాక జిల్లాలో సైతం ఎందరో గౌరవిస్తారు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11,061.[1] ఇందులో పురుషుల సంఖ్య 5491, మహిళల సంఖ్య 5570, గ్రామంలో నివాస గృహాలు 2820 ఉన్నాయి.

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు"https://te.wikipedia.org/w/index.php?title=పెనుమంట్ర&oldid=2239972" నుండి వెలికితీశారు