పెంటపాడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెంటపాడు
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెంటపాడు మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెంటపాడు మండలం యొక్క స్థానము
పెంటపాడు is located in ఆంధ్ర ప్రదేశ్
పెంటపాడు
ఆంధ్రప్రదేశ్ పటములో పెంటపాడు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°47′38″N 81°32′25″E / 16.794024°N 81.540413°E / 16.794024; 81.540413
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము పెంటపాడు
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 71,164
 - పురుషులు 35,668
 - స్త్రీలు 35,496
అక్షరాస్యత (2001)
 - మొత్తం 72.07%
 - పురుషులు 76.27%
 - స్త్రీలు 67.85%
పిన్ కోడ్ 534166
పెంటపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పెంటపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 319
 - పురుషుల సంఖ్య 172
 - స్త్రీల సంఖ్య 147
 - గృహాల సంఖ్య 94
పిన్ కోడ్ 534 166
ఎస్.టి.డి కోడ్ 08818

పెంటపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 534 166., యస్.టీ.డ్.కోడ్ = 08818.

  • ఈ గ్రామానికి చెందిన, రాష్ట్ర ఉత్తమ రైతు పురస్కార గ్రహీత శ్రీ నల్లమిల్లి రాఘవరెడ్డి పెరట్లో 45 కిలోల బూడిద గుమ్మడి కాయ కాసింది. ఈ గుమ్మడి పాదును

ఈయన సేంద్రియ ఎరువులతోనే సంరక్షించారు. [1]

చరిత్ర[మార్చు]

క్విట్ ఇండియా ఉద్యమం[మార్చు]

1942 ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా పెంటపాడు గ్రామంలోని పోస్టాఫీసు మీద, టెలిగ్రాఫ్ స్తంభాల మీద ఆంగ్ల వలస పాలనకు నిరసనగా దాడిచేసి స్థానిక స్వాతంత్ర సమర యోధులు జాతీయ స్థాయి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. గాంధీజీ అరెస్టు వార్త తెలిసినాకా ఆగస్టు 15 నుంచి ఎస్‌టివిఎన్ హిందూ పాఠశాల విద్యార్థులు క్లాసులు బహిష్కరించారు, కొద్దిరోజుల్లోనే సమీపంలోని భీమవరంలో ఉద్యమకారులపై కాల్పుల దుర్ఘటన జరిగిందని తెలిసిన విద్యార్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణరెడ్డి విద్యార్థులను సమావేశపరిచి ప్రసంగిస్తూ బొంబాయిలో జాతీయ నాయకులను అరెస్టుచేయడం, భీమవరంలో ప్రజలపై కాల్పులు జరపడం వంటివి చెప్పి ప్రభుత్వాస్తులు ధ్వంసం చేసి వారికి గుణపాఠం నేర్పాలని సూచించాడు. సత్యనారాయణరెడ్డి నాయకత్వంలో 300 మంది విద్యార్థులు ఊరేగింపుగా వెళ్ళి ముందు పీడబ్ల్యుడి ఆఫీసు మీద, పోస్టాఫీసు మీద దాడిచేశారు. తాళం వేసివున్న పోస్టాఫీసును బద్దలుకొట్టి లోపలి వస్తువులు నాశనం చేసి, రికార్డులు తగలబెట్టారు. పిడబ్ల్యుడి అధికారి, పోస్టు మాస్టరుల ఫిర్యాదుమేరకు బి.సత్యనారాయణరెడ్డి, ఎం.దుర్గాప్రసాద్, సారంగపాణి, పాషా సాహెబ్, వరదా బ్రహ్మానందం, ప్రత్తి శేషయ్య, తాడేపల్లి ముసలయ్య వంటి 12 మంది యువకులను అరెస్టు చేశారు.[1] కొవ్వూరు మేజిస్ట్రేటు ముందు కోర్టులో సత్యనారాయణరెడ్డి ప్రసంగిస్తూ, "ఈ ఘటనకు తనదే పూర్తి బాధ్యత అనీ, విద్యార్థులను రెచ్చగొట్టింది తానేననీ వారిని విడిచిపెట్టి తనకు ఏ శిక్ష అర్హమని తోస్తే దానిని విధించమనీ" పేర్కొన్నారు "ఇలా చేయడంపై తానేమీ విచారం వ్యక్తం చేయట్లేదని, ఇది తన విధిగా భావిస్తున్నానీ" అన్నాడు.[2] 11 మంది విద్యార్థులకు కొరడా దెబ్బల శిక్షను విధిస్తూ, సత్యనారాయణరెడ్డికి 25 కొరడా దెబ్బలతో పాటుగా రెండేళ్ళ కారాగార శిక్ష కూడా విధించారు. దాడిలో పోస్టాఫీసు వద్ద జరిగిన ఆస్తినష్టం రూ.1030 కాగా పెంటపాడు గ్రామంపైన జడ్జి రూ.3 వేలు సామూహిక జరిమానా విధించాడు, ఇందులోంచి ముస్లిములను బలహీనవర్గాలుగా పేర్కొంటూ విడిచిపెట్టాడు.[1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 319 - పురుషుల సంఖ్య 172 - స్త్రీల సంఖ్య 147 - గృహాల సంఖ్య 94

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12970.[3] ఇందులో పురుషుల సంఖ్య 6418, మహిళల సంఖ్య 6552, గ్రామంలో నివాస గృహాలు 3220 ఉన్నాయి.

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 సిహెచ్. ఎం., నాయుడు (1996). MAHATMA GANDHI'S LEADERSHIP AND QUIT INDIA MOVEMENT IN COASTAL ANDHRA. విశాఖపట్టణం: ఆంధ్ర విశ్వవిద్యాలయం. Retrieved 17 April 2018. 
  2. గాదం గోపాలస్వామి (30 August 2016). భారత స్వాతంత్ర్యోద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధులు (మొదటి ed.). అత్తిలి: శ్రీ సత్య పబ్లికేషన్స్. 
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[1] ఈనాడు మెయిన్ 21-9-2013. 3వ పేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=పెంటపాడు&oldid=2336822" నుండి వెలికితీశారు