తాడేపల్లిగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడేపల్లిగూడెం
CountryIndia
రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
విస్తీర్ణం
 • మొత్తం20.71 కి.మీ2 (8.00 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం1,03,906
 • సాంద్రత5,000/కి.మీ2 (13,000/చ. మై.)
Languages
 • Officialతెలుగు

తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఇది జిల్లాలో ఒక ముఖ్య వాణిజ్య కేంద్రం.

ఆంధ్ర ప్రదేశ్ మునిసిపాలిటీలలో తాడేపల్లిగూడెం (Tadepalligudem) ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ఇది ఒకటి. 2011 లో సెలెక్షన్ గ్రేడ్ మునిసిపాలిటిగా అవతరించింది.వ్యాపార, విద్యా రంగాల్లో వేగంగా అభివ్రుద్ది చెందుతుంది. జిల్లా కేంద్రం భీమవరనికి 33 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణాన్ని ఆనుకుని అనేక పల్లెటూళ్ళు ఉన్నాయి, కోస్తాలో ముఖ్యపట్టణలు ఏలూరు,విజయవాడకు 50,100 కి.మీల దూరంలో ఉంది. రాజమండ్రికి 45 కి.మీల దూరంలో ఉంది.

2001 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా వివరాలు మొత్తం జనాభా 103,906.అందులో మగవారు 49%,ఆడవారు 51%,సగటు అక్షరాస్యత శాతం 61%.

పరిపాలన[మార్చు]

ప్రస్తుత పురపాలక సంఘం కమీషనర్ గా పి.నిరంజన్ రెడ్డి, చైర్మెన్ గా బోలిసెట్టి శ్రీనివాస్ ఉన్నారు.[3]

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

వ్యాపారం[మార్చు]

తాడేపల్లిగూడెం వ్యవసాయోత్పత్తుల అమ్మకాలు నిర్వహించే కేంద్రంగా కోస్తా జిల్లాలలో పేరుగాంచింది. బెల్లం, పప్పు దినుసుల వ్యాపారానికి మిక్కిలి ప్రసిద్ధి చెందింది. వ్యవసాయ ఉత్పత్తులు నిలవ ఉంచే గిడ్డంగులకు కూడా ఈ పట్టణం గుర్తింపు పొందింది. రాష్ట్రంలోనే అతి పెద్ద ధాన్యం నిలువ చేసే ఎఫ్.సీ.ఐ. గిడ్డంగులు ఈ పట్టణంలో ఉన్నాయి. ఇక్కడి నుండి దేశంలోని పలు ప్రాంతాలకు ఉల్లిపాయలు ఏగుమతి చేయబడుచున్నవి.

మామిడి మార్కెట్

వేసవి సీజన్ వచ్చిందంటే తాడేపల్లిగూడేం కళకళలాడుతుంటుంది. జిల్లాలోనే అతిపెద్ద మామిడి కాయల మార్కెట్ పిప్పర వెళ్ళే మార్గంలో ఉంది. రిటైలర్స్,హోల్ సేలర్స్,, సామాన్య ప్రజల కొనుగోళ్ళతోనూ అతిరద్దీగా ఉండే మార్కెట్.

పరిశ్రమలు[మార్చు]

పట్టణంలో గొయంకా వారి ఫుడ్ ఫ్యట్స్ ‍‍‍‍ఫెర్టిలైజర్స్ (3 ఏఫ్) కర్మాగారము మరియ చాక్ పీసుల తయారీ, కొవ్వత్తుల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. పట్టణానికి దగ్గరగా బెల్లం తయారీ కేంద్రాలు ఉన్నాయి. పట్టణములో 6000 పైగా రవాణా వాహనములు ఉన్నాయి. జిల్లాలో ఉన్న బియ్యపు మిల్లులలో తాడేపల్లిగూడెంలోనే అత్యధిక బియ్యపు మిల్లులు ఉన్నాయి.ఈ పరిశ్రమల కార్మికులకు ఈ యస్ ఐ ఆసుపత్రి ఉంది.

విశేషాలు[మార్చు]

రెండవ ప్రపంచయుద్ధ కాలములో బ్రిటీషువారు నిర్మించిన తాడేపల్లిగూడెం విమానాశ్రయం రన్వే
రన్వేపై సూచించిన నిర్మాణ తేదీ

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీషు వారు యుద్ధ విమానాలను నిలిపేందుకు అణువుగా తాడేపల్లిగూడెంలో 2 కి.మీ పొడవున్న రన్ వేను నిర్మించారు. దీన్ని ప్రస్తుతం ఎవరూ వాడనప్పటికీ ఈ నాటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ మార్గం గుండా ప్రసిద్ధిపొందిన మిలటరీ మాధవవరం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రన్వే వలన చుట్టు ప్రక్కల భూములు ఒకప్పుడు అభివృద్ధి చెందకున్నప్పటికీ ప్రస్తుతం జిల్లాలోనే ప్రఖ్యాతినోందిన నాలుగయిదు {ఈస్ట్ కోస్ట్ హైబ్రీడ్స్, ఎస్.ఆర్.కె.నర్సరీ లాంటి} పెద్ద నర్సరీలు ఉన్నాయి. ప్రస్తుతం విమానాశ్రయ నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం

విద్య[మార్చు]

ఇక్కడ 6 ఇంజనీరింగ్ కాలేజిలు, 4 ఎం.బి.ఎ కాలేజిలు, 4 ఎం.సి.ఎ కాలేజిలు ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క అనుబంధ క్యాంపస్, డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

రవాణా[మార్చు]

తాడేపల్లిగూడెం రైల్వేస్టేషను

పట్టణం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో రైలు, రోడ్డు మార్గాలతో కలుపబడింది. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను చెన్నై-కోల్కత్తా రైలు మార్గములో ఉంది. జాతీయ రహదారి "ఎన్.హెచ్-5(ప్రస్తుతం 16)" ఈ పట్టణం నడిబొడ్డు గుండా వెళుతుంది.

సంస్కృతి[మార్చు]

సాహిత్యం[మార్చు]

తాడేపల్లిగూడెంలో 1972 నుంచి సాహిత్య సేవ చేస్తున్న సంస్థ - తెలుగు సాహితీ సమాఖ్య. ప్రముఖ న్యాయవాది చామర్తి సుందర కామేశ్వరరావు (ప్లీడరు బాబ్జిగా ప్రఖ్యాతుడు), పత్రికా సంపాదకుడు, రచయిత మారేమండ సీతారామయ్య 1972 అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు తెలుగు సాహితీ సమాఖ్యను స్థాపించారు. ప్రతీ నెలా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, మధుమంజరి మాసపత్రిక, వార్షిక పత్రికగా వెలువరించడం, కొన్ని పుస్తకాలను ప్రచురించడం తెలుగు సాహితీ సమాఖ్య ద్వారా చేశారు. సంస్థ ద్వారా విశ్వనాథ సత్యనారాయణ, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, శ్రీశ్రీ వంటి ప్రముఖ కవిపండితులతో సాహిత్య కార్యక్రమాలు చేశారు. చామర్తి సుందర కామేశ్వరరావు, మారేమండ సీతారామయ్య, గూడవల్లి నరసింహారావు, వేమూరి గోపాలకృష్ణమూర్తి, జంధ్యాల వేంకటేశ్వరశాస్త్రి "శాంతిశ్రీ", ఎన్.వి.ఎస్.రామారావు, రసరాజు, లాల్ అహ్మద్, తదితరులు సంస్థ అభివృద్ధికి కృషిచేశారు. యద్దనపూడి సూర్యనారాయణమూర్తి, మామిడి వెంకటేశ్వరరావు, వాజపేయయాజుల సుబ్బయ్య, యద్దనపూడి వెంకటరత్నం, తదితరులు సంగీత, సాహిత్యాది లలిత కళలను అభివృద్ధి చేయడానికి నడిపిన లలితకళాసమితి కొన్నాళ్ళు కొనసాగి ఆగిపోయింది.

ప్రార్థన స్థలాలు[మార్చు]

తాడేపల్లిగూడెం పట్టణంలో పలు ఆలయాలు, మసీదులు, చర్చిలు ఉన్నాయి.అవతార్ మెహెర్ బాబా వారి సెంటరు ఉంది.

ఇతర సమాచారం[మార్చు]

  • . తాడేపల్లిగూడెం గ్రామ దేవత : బలుసులుమ్మ
  • . తాడేపల్లిగూడెం పిన్ కోడ్ : 534101, 534102
  • . తాడేపల్లిగూడెం టెలిఫోన్ యస్.టి.డి కోడ్: 08818
  • . తాడేపల్లిగూడెం ఆర్టీసీ, షాట్ కట్కోడ్ : TPG
  • . తాడేపల్లిగూడెం రైల్వే కోడ్ : TDD
  • దగ్గరలోని విమానాశ్రయం: రాజమహేంద్రవరం

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 5 మార్చి 2016. Retrieved 3 December 2015. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards - Population Statistics in Maps and Charts". citypopulation.de.
  3. "Contact Details of Commissioners and Mayors of Amrut Cities" (PDF). Atal Mission for Rejuvenation and Urban Transformation. Government of India. Archived from the original (PDF) on 15 ఏప్రిల్ 2016. Retrieved 28 March 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help)

వెలుపలి లంకెలు[మార్చు]