రేలంగి వెంకట్రామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేలంగి వెంకట్రామయ్య
Ralangi venkatramayya.jpg
రేలంగి
జననం రేలంగి వెంకట్రామయ్య
ఆగష్టు 13, 1910
రావులపాడు
మరణం నవంబరు 26, 1975
నివాస ప్రాంతం రావులపాలెం
ఇతర పేర్లు రేలంగి, రేలంగోడు..
వృత్తి హాస్య ప్రియుడు

రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య (ఆగష్టు 13, 1910 - నవంబరు 26, 1975) పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.

బాల్యం[మార్చు]

రేలంగి వెంకట్రామయ్య రావులపాడులో 1910 ఆగష్టు 13వ తేదీన జన్మించాడు. రేలంగి తండ్రి హరికథలు, సంగీతం నేర్పించేవాడు. రేలంగి చిన్నతనం నుండి తన తండ్రి దగ్గర సంగీతం, హరికథలు నేర్చుకుంటూ పాటలు, పద్యాలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. 1919లో బృహన్నల అనే నాటకంలో స్త్రీ పాత్రతో మొదటిసారి నటించాడు. ఎస్వీ రంగారావు, అంజలీదేవి మొదలయిన వారు సభ్యులుగా ఉన్న యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ నిర్వహించే నాటకాలలో వేషాలు వేసేవాడు. రేలంగి సతీమణి పేరు బుచ్చియమ్మ. [1]

సినీ రంగ ప్రవేశం[మార్చు]

1931లో విడుదలయిన భక్త ప్రహ్లాద చిత్రం చూసి తాను కూడా చలనచిత్రాలలో నటించాలని నిశ్చయించుకొని కలకత్తా చేరుకున్నాడు. అక్కడ సి.పుల్లయ్య నిర్మిస్తున్న శ్రీకృష్ణ తులాభారంలో రేలంగికి చిత్రాలలో మొదటి అవకాశం లభించింది. తర్వాత వరవిక్రయం, గొల్లభామ మొదలయిన చిత్రాలలోని వేషాలతో పాటు చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు. దాదాపు పన్నెండేళ్ళ తర్వాత గుణసుందరి కథ చిత్రంలో పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చి రేలంగికి హాస్యనటుడిగా పేరు ప్రఖ్యాతులు, మరిన్ని అవకాశాలు తీసుకువచ్చింది.

విజయాలు[మార్చు]

తర్వాత దాదాపు ప్రతి సినిమాలో రేలంగి ఒక ప్రముఖ పాత్రలో కనిపించేవాడు. ముఖ్యముగా మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పు చేసి పప్పు కూడు మొదలయిన చిత్రాలలో వేసిన పాత్రలు కథానాయకుడితో సరిసమాన పేరు ప్రాముఖ్యతలను తెచ్చిపెట్టాయి. రేలంగి పోషించిన కొన్ని పాత్రలు:

రేలంగి సరసన సూర్యకాంతం, గిరిజ ఎక్కువ నటించారు. రేలంగి నటుడిగా మాత్రమే కాకుండా కొన్ని చిత్రాలలో పాటలు కూడా పాడేవాడు. 'వినవే బాల నా ప్రేమ గోల ' 'కాణీ ధర్మం సెయ్ బాబూ ' 'సరదా సరదా సిగరెట్టు ' వంటి రేలంగి పాడిన పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. నిర్మాతగా రేలంగి సామ్రాజ్యం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం హాస్యనటుడు రాజబాబుకు మొదటి చిత్రం.

విశిష్టత, పురస్కారాలు[మార్చు]

రేలంగి ఎన్నో కళాశాలలకు విరాళాలు ఇచ్చేవాడు. ఎందరికో వివాహాలకు సహాయం చేసేవాడు. రేలంగి ఇంట నిత్యం అన్నదానములు జరిగేవి. పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడయిన రేలంగి 1975 నవంబరు 26 న కన్నుమూశాడు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నందు ఈయనకు ఓక సినిమా థియేటర్ కలదు దాని పేరు రేలంగి చిత్ర మందిర్. ఈ థియేటర్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది..

మూలాలు[మార్చు]

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 80.