విప్రనారాయణ (1954 సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
విప్రనారాయణ
(1954 తెలుగు సినిమా)
Vipranarayana 1954.jpg
దర్శకత్వం పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణం పి.ఎస్.రామకృష్ణారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
పి.భానుమతి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
కూర్పు పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్
భాష తెలుగు

విప్రనారాయణ 1954 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని భానుమతి మరియు రామకృష్ణారావులు భరణీ పిక్చర్స్ పతాకం క్రింద నిర్మించారు. ఈ సినిమాకు కీలకమైన మాటలు మరియు పాటలను సముద్రాల రాఘవాచార్య సమకూర్చారు.

ఈ పూర్తి సంగీతభరితమైన చిత్రంలోని పాటల్ని ఎ.ఎమ్.రాజా మరియు భానుమతి గానం చేయగా సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని కూర్చారు.

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

విప్రనారాయణ (అక్కినేని) శ్రీరంగని భక్తుడు. రంగనాథున్ని పూలదండలతో అలంకరించి, పూజించి తరించాలనే భక్తాగ్రగణ్యుడు. నర్తకి దేవదేవి (భానుమతి) అందించిన నమస్కారాన్ని అన్యమనస్కుడైన విప్రనారాయణుడు గమనించడు. దానితో ఆమెలోని అహంకారం పడగ విప్పి ఎలాగైనా అతడిని తన పాదదాసున్ని చేసుకొంటానని అక్క (సంధ్య) తో పందెం వేస్తుంది. భక్తినెపంతో ఏకాకినని చెప్పి విప్రనారాయణుని ఆశ్రయం సంపాదిస్తుంది. అందుకు విప్రనారాయణుని ప్రియ సచివుడు రంగరాజు (రేలంగి) అడ్డు తగిలినా లాభం లేకపోతుంది.

దేవయాని నెరజాణ, వేశ్య. నాట్యం, హొయలు, నయగారాలు, అమాయకంగా కళ్ళభాషతో కవ్వించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. విప్రనారాయణునిలో నెమ్మదిగా సంచలనం కలిగిస్తూ అక్కడ వున్న మూడో వ్యక్తి రంగరాజుకు ఉద్వాసన పలికిస్తుంది. ఆమె భక్తినుంచి రక్తిపైపు విప్రనారాయణుని మళ్ళిస్తుంది. వర్షానికి తడిసి జ్వరం సెగలతో రగిలిపోతున్న విప్రనారాయణునికి దేవదేవి శీతల గంధం రాసే ప్రయత్నంలో, తొలిసారి స్త్రీ స్పర్శ అనుభూతి పొందిన ఆ భక్తునిలో రక్తి ప్రారంభమై ఆమెకు దాసుడౌతాడు. ఆమె లేనిదే క్షణమైనా నిలువలేని స్థితికి చేరతాడు.

దైవం ఆడిన నాటకం వల్ల విప్రనారాయణునిపై దొంగతనం మోపడం, రాజసభలో విచారణ, శిక్ష పడగా, పతాక సన్నివేశంలో భక్తి పారవశ్యంలో నాయికా నాయకులిద్దరూ భగవంతునిలో ఐక్యమౌతారు.

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

పాటలు[మార్చు]

 1. ఆడది అంటే లయం లయం ఆ నీడంటేనే భయం భయం - రేలంగి
 2. ఎవ్వాడే అతడెవ్వాడే కలలోన నను డాసినాడే ఓ భామా - పి. భానుమతి
 3. ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతనా ఇందుకేనా - గానం: పి. భానుమతి
 4. ఏలా నాపై దయచూపవు దేవా వేడుక చూసేవా - పి. భానుమతి
 5. కౌసల్యా సుప్రజారామా పూర్వాసంధ్యా - ?
 6. చూడుమదే చెలియా కనులా బృందావనిలో నందకిషోరుడు - ఎ. ఎం. రాజా
 7. ధిల్లానా - ?
 8. పాలించర రంగా పరిపాలించర రంగా కరుణాంతరంగ శ్రీరంగా - గానం: ఎ. ఎం. రాజా
 9. మధురమధురమీ చల్లని రేయీ మరువతగనిదీ - ఎ. ఎం. రాజా, పి. భానుమతి
 10. మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా - గానం: ఎ. ఎం. రాజా
 11. రంగా కావేటి రంగ శ్రీరంగ రంగా నా పైయిన్ బడె - ఎ. ఎం. రాజా
 12. రారా నా సామి రారా రారా దాపేల చేసేవు రా ఇటు రారా నా సామి - గానం: పి. భానుమతి
 13. సావిరహే తవదీనా రాధా..విందతి చందన - రచన: జయదేవుడు; గానం: పి.భానుమతి

పురస్కారాలు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు[మార్చు]

 1. "2nd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 23 August 2011. 

బయటి లింకులు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం