భానుమతీ రామకృష్ణ

వికీపీడియా నుండి
(పి.భానుమతి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భానుమతీ రామకృష్ణ
Bhanumati.jpg
భానుమతీ రామకృష్ణ
జననం
భానుమతీ రామకృష్ణ

సెప్టెంబరు 7, 1926
మరణండిసెంబరు 24, 2005
చెన్నై
ఇతర పేర్లుభానుమతి
వృత్తిసినిమా నటి,
నిర్మాత,
దర్శకురాలు,
స్టూడియో అధినేత్రి,
రచయిత్రి,
గాయని
సంగీత దర్శకురాలు.
జీవిత భాగస్వాములుపి.యస్. రామకృష్ణారావు
పిల్లలుఏకైక సంతానం భరణి
తల్లిదండ్రులు
  • బొమ్మరాజు వెంకటసుబ్బయ్య (తండ్రి)
సంతకం
Bhanumathi sign.jpg

భానుమతీ రామకృష్ణ (సెప్టెంబరు 7, 1926 - డిసెంబరు 24, 2005) దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. మల్లీశ్వరి, మంగమ్మ గారి మనవడు ఆమె నటించిన చిత్రాలు. ఒంగోలులో జన్మించింది. ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత కళాకారుడు. తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ళ వయసులోనే వరవిక్రయం అనే సినిమాలో నటించింది. తమిళ, తెలుగు చిత్రాల నిర్మాత, దర్శకుడు, ఎడిటరు అయిన పి. ఎస్. రామకృష్ణారావును వివాహమాడింది. తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారీ దంపతులు. భానుమతి రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. 1966 లో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం లభించింది.

జీవిత విశేషాలు[మార్చు]

భానుమతి 1926 వ సంవత్సరము సెప్టెంబరు 7 ప్రకాశం జిల్లా, ఒంగోలులో జన్మించింది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య, శాస్త్రీయ సంగీత ప్రియుడు, కళావిశారదుడు. [1]

భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడు. హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.

ఆమె 1943, ఆగష్టు 8 న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడినది. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.

2005 డిసెంబర్ 24చెన్నై లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించింది.

సినిమాలలో[మార్చు]

మల్లీశ్వరి సినిమాలో భానుమతి పాడి, నాట్యం చేసిన పిలచిన బిగువటరా పాట

భానుమతి గారు అర్ధ శతాబ్దానికి పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే. ఆమె సినిమాలలో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు. ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించింది[2].

భానుమతి కేవలము నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నది. ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్ధవంతంగా నిర్వర్తించింది.

అవార్డులు[మార్చు]

భానుమతి కుమారుడు భరణి, భానుమతి 1999 హైదరాబాదులో అంతర్జాతీయ చిత్రోత్సవము సమయములో పత్రికా సమావేశమునందు తీసిన చిత్రము
  • 1956లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము
  • మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు, పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకు)
  • అన్నాదురై నడిప్పుకు ఇళక్కనం (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించాడు.
  • తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ, ఈమె బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు
  • 1966లో ఆమె వ్రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది.
  • ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
  • 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది.
  • 1984లో కలైమామణి బిరుదుతో తమిళనాడు లోని ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది.
  • బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984 ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.
  • 1984లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
  • 1986లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది.
  • 1986లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.
  • 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలయిన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో ఒకటి భానుమతి ది.
భానుమతి జ్ఞాపకార్ధం విడుదలయిన తపాలాబిళ్ళ

భానుమతి రచనలు[మార్చు]

Telugubookcover Bhanumathi.JPG

భానుమతి సినిమాల జాబితా[మార్చు]

Telugucinemaposter varavikrayam 1939.JPG
Telugucinemaposter malliswari 1951.JPG
  1. పెళ్ళికానుక (1998) .... సావిత్రమ్మ
  2. చామంతి (1992)
  3. చెంబరుతి (1992)
  4. పెద్దరికం (1992) .... అడుసుమిల్లి బసవపున్నమ్మ
  5. సామ్రాట్ అశోక్ (1992)
  6. బామ్మ మాట బంగారు బాట (1990)
  7. అన్నపూర్ణమ్మగారి అల్లుడు (1988)
  8. అత్తగారూ స్వాగతం (1988)
  9. ముద్దుల మనవరాలు (1986)
  10. మంగమ్మగారి మనవడు (1984) .... మంగమ్మ
  11. గడసరి అత్త సొగసరి కోడలు (1981)
  12. మనవడి కోసం (1977)
  13. అమ్మాయి పెళ్ళి (1974)
  14. తాతమ్మ కల (1974)
  15. విచిత్ర వివాహం (1973)
  16. అంతా మన మంచికే (1972)
  17. మట్టిలో మాణిక్యం (1971)
  18. గృహలక్ష్మి (1967)
  19. పల్నాటి యుధ్ధం (1966) .... నాగమ్మ
  20. అంతస్తులు (1965)
  21. తోడు నీడ (1965)
  22. బొబ్బిలి యుధ్ధం (1964) .... మల్లమ్మ
  23. వివాహ బంధం (1964) .... భారతి
  24. పెంచిన ప్రేమ (1963)
  25. బాటసారి (1961)
  26. అంబికాపతి (1957) .... రాకుమారి అమరావతి
  27. నల దమయంతి (1957) .... దమయంతి
  28. సారంగధర (1957) .... చిత్రాంగి
  29. వరుడు కావాలి (1957)
  30. తెనాలి రామకృష్ణ (1956/I) .... రంగసాని
  31. చింతామణి (1956) .... చింతామణి
  32. మధురై వీరన్ (1956) .... రాకుమారి బొమ్మ:ి
  33. రంగూన్ రాధ (1956) ....
  34. తెనాలి రామన్ (1956) .... రంగసాని
  35. అలీబాబావుమ్ నార్పతు తిరుడర్‌గలుమ్ (1955)
  36. కల్వనిన్ కథలి (1955) .... కళ్యాణి
  37. విప్రనారాయణ (1954) .... దేవదేవి
  38. అగ్గి రాముడు (1954)
  39. చక్రపాణి (1954)
  40. మలైకళ్ళన్ (1954)
  41. చండీరాణి (1953/I)
  42. చండీరాణి (1953/II)
  43. ప్రేమ (1952) .... మోతి
  44. మల్లీశ్వరి (1951) .... మల్లీశ్వరి
  45. మంగళ (1951) .... మంగళ
  46. మాయా రంభ (1950)
  47. అపూర్వ సహోదరులు (1950) .... రంజన
  48. లైలామజ్ఞు (1949/I) .... లైల
  49. రక్షరేఖ (1949) .... రాకుమారి కళావతి
  50. నల్లతంబి (1949) .... పుష్ప
  51. రత్నమాల (1947) .... రత్నమాల
  52. గృహప్రవేశం (1946) .... జానకి
  53. స్వర్గసీమ (1945) .... సుబ్బి/సుజాత దేవి
  54. తాసీల్దార్ (1944) .... కమల
  55. గరుడ గర్వభంగం (1943)
  56. కృష్ణ ప్రేమ (1943) .... చంద్రవల్లి
  57. భక్తిమాల (1941) .... రాధ
  58. ధర్మపత్ని (1941/I)
  59. ధర్మపత్ని (1941/II)
  60. మాలతీమాధవం (1940)
  61. వర విక్రయం (1939) .... కాళింది

గాయనిగా[మార్చు]

గాయనిగా భానుమతి ఎంతో పేరుప్రతిష్టలు సంపాదించుకుంది. సినిమా పాటలే కాక రేడియోలోనూ, రికార్డుల్లోనూ ఆమె పాడిన పాటలు వినవచ్చాయి. విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైనప్పుడు వినిపించిన ప్రారంభగీతం పసిడి మెరుంగుల తళతళలు బాలాంత్రపు రజనీకాంతరావుతో కలిసి ఆమె పాడినదే.[3] [[దస్త్రంపసిడిమెరుంగుల తళతళలు - గానం – భానుమతి , రజని గార్లు.ogg|thumb|విజయవాడ కేంద్రం ప్రారంభ గీతికగా బాలాంత్రపు రజనీకాంత రావు, భానుమతీ రామకృష్ణ పాడిన "పసిడి మెరుంగుల తళతళలు" ప్రసారం చేశారు.]]

దర్శకురాలిగా[మార్చు]

నిర్మాతగా[మార్చు]

సంగీత దర్శకురాలిగా[మార్చు]

రచయిత్రిగా[మార్చు]

మూలాలు[మార్చు]

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 120. |access-date= requires |url= (help)
  2. నాలో నేను:భానుమతి రామకృష్ణ:మానస పబ్లికేషన్స్:2004ప్రచురణ:పేజీ.186
  3. [http//eemaata.com/em/issues/200101/616.html తెలుగు సంగీతంలో రజనీ - పరుచూరి శ్రీనివాస్ - ఈమాట]

బయటి లింకులు[మార్చు]