అపూర్వ సహోదరులు (1950 సినిమా)
స్వరూపం
| అపూర్వ సహోదరులు (1950 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | సి.పుల్లయ్య |
|---|---|
| నిర్మాణం | ఎమ్.ఎస్.వాసన్ |
| తారాగణం | భానుమతి, ఆర్.నాగేంద్రరావు, ఎం.కె.రాధా |
| సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
| నేపథ్య గానం | భానుమతి |
| నిర్మాణ సంస్థ | జెమినీ పిక్చర్స్ |
| నిడివి | 151 నిమిషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
అపూర్వ సహోదరులు 1950, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఫ్రెంచి రచయిత అలెగ్జాండర్ డ్యూమాస్ వ్రాసిన ది కార్సికన్ బ్రదర్స్ నవల ఆధారంగా భారతీయ వాతావరణానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుని జెమినీ పిక్చర్స్ వారు ఈ సినిమాను తమిళంలో అపూర్వ సహోదరగళ్ అనే పేరుతో తీశారు. ఇదే సినిమాను హిందీలో నిషాన్గా విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- ఎం.కె.రాధా (ద్విపాత్రాభినయం)
- పి.భానుమతి
- ఆర్.నాగేంద్రరావు
- సూర్యప్రభ
- లక్ష్మీప్రభ
- నారాయణరావు
- స్టంట్ సోము
- వేళాయుధం
- జి.పట్టు అయ్యర్
- వి.పి.ఎస్.మణి
- డి.బాలసుబ్రమణియన్
- వెంకుమాంబ
- కృష్ణబాబు
- శ్యామ్ సుందర్
- జె.ఎస్.కశ్యప్
- రామకృష్ణారావు
- విజయారావు
- సంపత్ కుమార్
- ఆనంద్
- జి.వి.శర్మ
- బలరాం
- టి.ఎస్.బి. రావు.
సాంకేతికవర్గం
[మార్చు]- మాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంతం
- సంగీతం: రాజేశ్వరరావు
- దర్శకత్వం: సి.పుల్లయ్య
- నిర్మాత: ఎం.ఎన్.వాసన్
- నిర్మాణ సంస్థ: జెమినీ పిక్చర్స్
- గాయనీ గాయకులు: పాలువాయి భానుమతి, టి.ఎ.మోతీ
- ఛాయ గ్రహణం: కమల్ ఘోష్
- విడుదల:14:01:1950.
పాటలు
[మార్చు]- అహ సుఖదాయి వెన్నెలరేయి మనమూరించె ఆశలతో - పి.భానుమతి, టి. ఎ.మోతి
- ఓ నిజమో మాయో ఏమో కాని ఆతడొకానొక రాజే అవునట - పి.భానుమతి
- జో జో జో శ్రీరాసుతులారా జో జో జో సుగుణమణులారా - బృంద గీతం
- లడ్డు లడ్డు మిఠాయి కావాలా రవ్వలడ్డు బాదుషా - పి.భానుమతి
- వనజీవనమే సుఖ జీవనం కమనీయం_పాలువాయీ భానుమతి
- ఓడవాడ ఓడవాడా అద్దరి చేర్చగదోయీ_పి.భానుమతి
- జగంబే మాయమౌనా ఈజీవనమే కలే _
- పరదేశమదేలా నన్ను ఒంటిగా విడిచిపోవ న్యాయమా_బృందం
- యువరాజువులే మనరే రాజులు అహా జన్మించినారట_