సితార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సితార గురించిన మరిన్ని వ్యాసాల కొరకు సితార (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

సితార్[permanent dead link] ఆకృతి

సితార్, ఒక తీగల సంగీత వాయిద్యం. ఇది హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉపయోగిస్తారు. ఇది మధ్యయుగంలో భారత ఉపఖండంలో ఉద్భవించింది.16, 17 శతాబ్దాలలో అభివృద్ధి చెందింది. 18 వ శతాబ్లంలో ప్రస్తుత రూపానికి చేరుకుంది. రెండు కాళీ కలిగిన బుర్రలను కలుపుతూ ఒక పొడవైన ఆకారము కలిగిన దానికి తీగెలు బిగించిన పరికరం సితార. భారత ఉపఖండం అంతటా విస్తృతంగా ఉపయోగించే సితార 1950 ల చివరలో, 1960 ల ప్రారంభంలో మొదలైన రవిశంకర్ ప్రదర్శనల ద్వారా విస్తృత ప్రపంచంలో ప్రసిద్ధి గాంచింది. [1] 1960 వ దశకంలో, పాశ్చాత్య సంగీతంలో కూడా సితార్ కొన్నాళ్ళ పాటు వాడారు. ఈ పరికరం ది బీటిల్స్, ది డోర్స్, ది రోలింగ్ స్టోన్స్, మెటాలికా తదితరుల సంగీతంలో కనిపిస్తుంది.

చరిత్ర

[మార్చు]

వీణ సితారకు పూర్వగామి.[2] సితార పదమూడవ శతాబ్దంలో ప్రసిద్ధ సూఫీ ఆవిష్కర్త, కవీ ఖ్యాల్, తరానా కవ్వాలి మార్గదర్శకుడు అమీర్ ఖుస్రో వీణ నుండి దీన్ని తయారు చేసాడు. [3] సితార అనే పేరు పర్షియన్ సెహ్ + తార్ నుండి ఉద్భవించింది, దీని అర్ధం "మూడు తీగలు". [4] అయితే, ఈ సంగీత వాయిద్యం 21 తీగలను కలిగి ఉంటుంది.

రూపురేఖలు, నిర్మాణం

[మార్చు]
సితార్ నేర్చుకుంటున్న యువకులు.

సితారకు 18, 19, 20, 21 తీగలు ఉంటాయి. వీటిలో ఆరు లేదా ఏడు తీగలు వాయించడానికి వాడతారు. మిగతావి తోడు తీగలు. వాయించే తీగలకు అనుబంధంగా ఇవి ప్రతిధ్వనిస్తూంటాయి. ప్రదర్శన ప్రారంభంలో రాగం మూడ్‌ను సెట్ చేయడానికి ఈ తీగలను ఉపయోగిస్తారు. వీటిని పర్దా అని థాట్ అనీ పిలుస్తారు [5] ఫైన్ ట్యూనింగ్ చేసుకునేందుకు వీటితో వీలౌతుంది. వాయించే తీగలు వాయిద్యం తల బుర్రకు ఉన్న కొక్కేలకు తగిలించి ఉంటాయి. తోడు తీగలు వివిధ పొడవులతో తలబుర్రకు ఉన్న చిన్నచిన్న రంధ్రాల గుండా వెళ్ళి వాయిద్యం మెడపైన ఉండే చిన్న ట్యూనింగ్ పెగ్‌లతో కలుస్తాయి. ఈ వాయిద్యానికి రెండు వంతెనలు - వాయించే తీగకు, డ్రోన్ తీగలకు పెద్ద వంతెన ( బడా గోరా ), తోడు తీగలకు చిన్న వంతెన ( చోటా గోరా ) ఉంటాయి. కంపించే తీగ అంచు ఈ వంతెనను తాకినప్పుడు దాని పొడవు కొద్దిగా మారి, అనుస్వరాలు ఏర్పడతాయి.సితార నిర్మాణంలో వివిధ భాగాలకు వాడే పదార్థాలు ఇలా ఉన్నాయి. మెడకు, తబలీకి టేకు గానీ టూన్ కలప ( సెడ్రెలా టూనా ) గానీ వాడతారు. ప్రతిధ్వనించే గదులను సొరకాయ బుర్రలతో చేస్తారు. వాయిద్యం యొక్క వంతెనలను జింక కొమ్ము, ఎబోనీ లేదా ఒంటె ఎముక నుండి తయారు చేస్తారు. ప్రస్తుతం సింథటిక్ పదార్థాలు వాడడం మామూలై పోయింది.

విశేషాలు

[మార్చు]
  • దీనిని కచేరీలలో తప్పని సరిగా వాడుతారు.
  • సినిమా సంగీతంలో ముఖ్యంగా నేపథ్య సంగీతంలో తప్పక ఉమ్దవలసిన వాయిధ్యాలలో మొదటిది సితార

సితార ఘరానాలు

[మార్చు]

ప్రసిద్ధ సితార విద్వాంసులు

[మార్చు]

ఈ పరికరం ద్వారా అనేకానేకులు కళాకారులుగా మారారు వారిలో అత్యధికంగా పేరు పొంది దేశదేసాలలో ప్రదర్శనలు ఇచ్చినవారు.

మూలాలు

[మార్చు]
  1. Julien Temple (2011-07-18). "BBC Four – Dave Davies: Kinkdom Come". Bbc.co.uk. Retrieved 2012-06-15.
  2. Alexander Refsum Jensenius, Michael J. Lyons. A NIME Reader: Fifteen Years of New Interfaces for Musical Expression. Springer. p. 148.
  3. James Sadler Hamilton (1994). Sitar Music in Calcutta: An Ethnomusicological Study. Motilal Banarsidass. p. 50. ISBN 9788120812109. Due to the absence of any mention of the sitar in the writings of Amir Khusrau (1285-1351) or in those of his contemporaries it is unlikely that any musical instrument with this name existed at that time.
  4. Sitar – Definition and More from the Free Merriam-Webster Dictionary. Merriam-webster.com (2012-08-31). Retrieved on 2013-07-17.
  5. Saṅgīt Mahābhāratī (2011). "Thāṭ (Instrumental)". The Oxford Encyclopaedia of the Music of India (in ఇంగ్లీష్). ISBN 9780199797721. Retrieved 5 September 2018.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సితార్&oldid=3488388" నుండి వెలికితీశారు