డోలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డోలు వాద్యకారులు.

డోలు (ఆంగ్లం: Dhol; హిందీ: ढोल) ఒక సంగీత వాయిద్య పరికరం. దీనిని భారత దేశపు జానపద సంగీతంలో ఎక్కువ ఉపయోగిస్తారు. చెక్కతో చేయ్యబడే ఈ డోలకు రెండు వైపులా జంతు చర్మం బిగించి ఉంటుంది. దీనిని చిన్న కర్రలతో కానీ చేతి వేళ్ళతో కానీ వాయిస్తారు. ముఖ్యంగా పంజాబీయులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

డోలు వాయిద్యాన్ని ప్రధానంగానాదస్వరం (సన్నాయి)కు, కర్ణాటక సంగీతం కచేరిలలో తాళ వాద్యంగా ఉపయోగిస్తారు. డోలు శభ్దం గంభీరంగా ఉంటుంది. చెట్టు కాండంలో కొంత భాగాన్ని తీసుకొని మధ్యభాగాన్ని తొలచి రొండు వైపులా జంతు చర్మాన్ని అమర్చి తయారు చేస్తారు. ఒక వైపు కొయ్యపుల్ల తోనూ మరియొకవైపు చేతి వేళ్ళతోను కొట్టటం ద్వారా దీనిని వాయిస్తారు. సన్నాయితో కలిపి డోలు సన్నాయిగా ఆంధ్రప్రదేశ్ లో, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిపొందిన వాద్యం. ఉత్తర భారతంలో డోలక్ అనే వాద్యపరికరాన్ని ఒక్క దాన్నే వాడుతారు. దీనికి ప్రక్క వాద్యాలుండవు. ఇది దక్షిణ దేసపు డోలుకన్నా కొంత తేలికగానూ చిన్నదిగాను వుంటుంది. ఈ రెంటి వాయిద్యాలలోనూ, ఉపయోగంలోను చాల తేడావుంది.

నాదస్వర కచేరిలో డోలు వాద్య కళాకారులు
డోలు వాయిస్తున్న కళాకారుడు/ అప్పలాయగుంట ఆలయం బయట తీసిన చిత్రము
"https://te.wikipedia.org/w/index.php?title=డోలు&oldid=3846803" నుండి వెలికితీశారు