కాండం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కణుపులు మరియు కణుపు మధ్యమాలు చూపుతున్న కాండం.

మొక్కలో వాయుగతంగా పెరిగే వ్యవస్థను 'ప్రకాండ వ్యవస్థ' (Shoot system) అంటారు. ఇది ప్రథమాక్షం (Plumule) నుంచి ఉద్భవిస్తుంది. ప్రకాండ వ్యవస్థ అక్షాన్ని 'కాండం' (ఆంగ్లం: Stem) అంటారు. పత్రాలు, మొగ్గలు, పుష్పాలు వంటి ఉపాంగాలు కాండం మీద లేదా శాఖల మీద ఉద్భవిస్తాయి.

లక్షణాలు[మార్చు]

 • కాండం ప్రకాండవ్యవస్థలో నిటారుగా పెరిగే అక్షం.
 • కాండం చివరలో ఉండే కొన మొగ్గ (terminal bud) కాండం నిలువు పెరుగుదలను నియంత్రిస్తుంది.
 • కాండం కణుపులు (nodes) , కణుపు మధ్యమాలు (internodes) గా విభేదన చెంది ఉంటుంది.
 • కాండం మీద పత్రాలు కణుపుల నుంచి ఏర్పడతాయి. పత్రానికి, కాండానికి మధ్య ఉండే పై కోణాన్ని గ్రీవం (Axil) అంటారు. గ్రీవంలో ఏర్పడే గ్రీవపు మొగ్గలు శాఖలను ఉత్పత్తి చేస్తాయి.
 • సాధారణంగా లేత కాండం ఆకుపచ్చగాను, ముదిరిన కాండం గోధుమవర్ణంలోను ఉంటాయి.

విధులు[మార్చు]

 • కాండం పత్రాలన్నింటికి సూర్యరశ్మి తగిలేటట్లుగా విస్తరింపచేయడంలో సహాయపడుతుంది.
 • పేళ్ళు భూమినుంచి గ్రహించిన నీటిని, లవణాలను పత్రాలకు అందజేయడం, పత్రాలలో తయారైన ఆహారపదార్ధాలను మొక్కలోని ఇతర భాగాలకు అందించడంలో ప్రధానపాత్ర వహిస్తుంది.

కాండం రూపాంతరాలు[మార్చు]

కాండం వాతావరణానికి అనుగుణంగా సాధారణ విధులతో పాటు కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి రూపాంతరం చెందుతుంది. ఇలాంటి శాశ్వతమార్పులను 'కాండ రూపాంతరాలు' అంటారు. ఉనికిని బట్టి కాండం రూపాంతరాలు మూడు రకాలు.

వాయుగత కాండ రూపాంతరాలు[మార్చు]

రింగులు తిరిగిన నులితీగ.

ఉపవాయుగత కాండ రూపాంతరాలు[మార్చు]

 • రన్నర్లు (Runners)
 • స్టోలన్లు (Stolons)
 • పిలకమొక్కలు (Suckers)
 • ఆఫ్ సెట్లు (Offsets)

భూగర్భ కాండ రూపాంతరాలు[మార్చు]

భూమి పైగాగాన కనిపించే చెట్టులోని మొదటి భాగంను మాను, చెట్టు మొండెం, మ్రాను, మొద్దు, చెట్టు మొదలు అని అంటారు

మాను[మార్చు]

The base of a Yellow Birch trunk

మాను (Trunk) అంటే భూమి పైభాగాన, కొమ్మలకు క్రింది భాగాన ఉన్న కనిపించే చెట్టు లేదా వృక్షపు కాండంలోని మొదటి భాగం.[1] మాను పైభాగాన బెరడుతో కప్పబడి వుంటుంది.[2] వృక్షం యొక్క మాను నుండే ప్రధానమైన కలప తయారౌతుంది.

పాటలు[మార్చు]

‍* మాను మాకును కాను రాయీ రప్పను కానే కాను మామూలు మనిషిని నేను

మూలాలు[మార్చు]

 1. "trunk". http://www.thefreedictionary.com/: The Free Online Dictionary. Retrieved 2011-04-30. The main woody axis of a tree. 
 2. "trunk". http://www.thefreedictionary.com/: The Free Online Dictionary. Retrieved 2011-04-30. The tough outer covering of the woody stems and roots of trees, shrubs, and other woody plants. It includes all tissues outside the vascular cambium. 
"https://te.wikipedia.org/w/index.php?title=కాండం&oldid=1959325" నుండి వెలికితీశారు