వేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Wurzeln am Berghäuser Altrhein, Speyerer Auwald.JPG

వేరు (ఆంగ్లం: Root) వృక్ష దేహంలో భూగర్భంగా పెరిగే ప్రధానాక్షం. పిండాక్షంలోని ప్రథమ మూలం భూమిలోకి వేరుగా పెరుగుతుంది. ఇవి మొక్కని భూమిలో పాతుకునేలా చేసి స్థిరత్వాన్ని కలిగిస్తాయి. నేలనుండి నీటిని, ఖనిజ లవణాలను శోషించి, ప్రకాండ వ్యవస్థ అంతటికీ సరఫరా చేస్తాయి.

భాషా విశేషాలు[మార్చు]

తెలుగు భాషలో వేరు పదానికి వివిధ ప్రయోగాలు ఉన్నాయి.[1] వేరు [ vēru ] vēru. [Tel.] n. A root. మూలము. బహువచనం వేరులు or వేళ్లు. వేరిడి vēr-iḍi. [వేరు+ఇడి.] n. A fool, a mad man. అవివేకి, వెర్రివాడు, వెర్రిస్త్రీ." వృథాబోధకుండు వేరిడికాడే." P. i. 729. వేరిడించు vēriḍintsu. v. n. To cause to become foolish, అవివేకమును పొందజేయు. వేరుపారు or వేరుతన్ను vēru-pāru. v. a. To take root. వేరుపనస vēru-panasa. n. That kind of jack tree, the fruit of which springs from the root. A. i. 21. వేరు మల్లె vēru-malle. n. A creeper called Ipomea cymosa. వేరు సంపెంగ vērē-sampenga. n. A plant called Polyanthes tuberosa. వేరుసెనగ vēru-senaga. n. The ground nut. Arachis hypogœa (Watts.) వేరునకాచే సెనగలు. వేరువిత్తు vēru-vittu. n. A bane, ruin, destroyer. నాశకము, నాశకుడు. "వినవేమీకెల్ల వేరువిత్తనినన్నున్." M. VIII. iv. 247. "పుంజులవేరువిత్తు." H. iii. 268.

వేరు వ్యవస్థలు[మార్చు]

ఆవృతబీజాలలో రెండు రకాల వేరువ్యవస్థలు ఉంటాయి.

 • 1. తల్లి వేరు వ్యవస్థ (Tap root system) ద్విదళజీజ మొక్కలలో కనిపిస్తుంది.
 • 2. అబ్బురపు వేరు వ్యవస్థ (Adventitious root system) ఏకదళబీజ మొక్కలలో ఉంటుంది.

వేరు అంతర్నిర్మాణం[మార్చు]

ద్విదళ బీజ వేరు[మార్చు]

ద్విదళ బీజ వేరులో మూడు ముఖ్యమైన మండలాలు ఉంటాయి:

 • బాహ్యచర్మం: ఇవి సజీవకణాలతో ఏర్పడిన పొర. ఇది లోపలి భాగాలకు రక్షణ కల్పిస్తుంది. ఏకకణయుత మూలకేశాలతో ఉండటంవల్ల బాహ్యచర్మాన్ని కేశధారి స్తరం అని కూడా అంటారు.
 • వల్కలం: ఇందులో కణాలు అనేక వరుసలలో అమరివుంటాయి. దీనిలోని పొరలను అధశ్చర్మం, సామాన్య వల్కలం, అంతశ్చర్మంగా విభజించారు.
  • అధశ్చర్మం 2-3 వరుసలలో మందమైన కణాలతో ఉండి కాండానికి తన్యతా బలాన్నిస్తుంది. బాహ్యచర్మం నశించినప్పుడు రక్షణ కవచంగా పనిచేస్తుంది.
  • సామాన్య వల్కలం ఆహారాన్ని నిలువ చేస్తుంది. గుండ్రటి మృదుకణాలు అనేక వరుసల్లో, పలుచని కణకవచాలతో, కణాల మధ్య ఖాళీలను ఏర్పరుస్తూ అమరివుంటాయి. నీటిని, లవణాలను ప్రసరణ కణజాలానికి చేర్చడానికి సహకరిస్తుంది.
  • అంతశ్చర్మంలో ఒకే వరుసలో పీపా ఆకార కణాలు, వ్యాసార్ధ గోడలపైన కాస్పేరియన్ మందాలు ఉంటాయి. వీటిలో నీటిని ప్రసరింపజేసేవి వాహక కణాలు.
 • ప్రసరణ స్తంభం: ఇది పరిచక్రం, నాళికాపుంజాలు, దవ్వ అనే భాగాలతో వేరు మధ్యభాగంలో ఉంటుంది.
  • పరిచక్రం దీర్ఘ చతురస్రాకార మృదుకణాలతో ఏర్పడుతుంది. కణాలు విభజన చెందగలిగి ప్రక్క వేర్లను ఉత్పత్తి చేయగలవు.
  • నాళికాపుంజాలు వేర్వేరు వ్యాసార్ధ రేఖలపై ప్రాథమిక దారువు, పోషక కణజాల పుంజాలు సమాన సంఖ్యలో ఏర్పడతాయి. పరిచక్రం వైపు ప్రథమ దారువు, దవ్వ వైపు అంత్యదారువు ఉంటాయి. ఆహారాన్ని దాచివుంచే సజీవ కణాలు దారువు పోషక కణజాలాల మధ్య అమరివుంటాయి. వీటిని సంశ్లేషక కణజాలం అని పిలుస్తారు.
  • దవ్వ ఏర్పడదు లేదా చాలా తక్కువ పరిమాణంలో ఉండి నీటిని, ఆహారాన్ని నిలువచేయడానికి తోడ్పడుతుంది.

ఏకదళ బీజ వేరు[మార్చు]

ద్విదళ బీజవేరుతో సారూప్యం కనిపిస్తుంది. నాళికాపుంజాలవద్ద కొన్ని మర్పులు ఉంటాయి. దారువు, పోషక కణజాల పుంజాలు వేర్వేరు వ్యాసార్ధాల రేఖలపై ఆరుకంటే ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. దవ్వ అధికభాగాన్ని ఆక్రమించి ఆహారాన్ని నిలువచేయడానికి, యాంత్రికబలాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది.

వేరు రూపాంతరాలు[మార్చు]

కాంతి, నీరు, ఖనిజ లవణాలు, గాలి వంటి వాతావరణ కారకాలు తగినంతగా లేకపోతే మొక్కలు జీవించలేవు. మనుగడ కోసం జరిగే పోరాటంలో మొక్కలు వివిధ ఆవాసాల్లో జీవించవలసి ఉంటుంది. ఇటువంటి కొన్ని పరిసరాల్లో మొక్కలు జీవించాలంటే వాటిలోని వివిధ అంగాలు వాటి సామాన్య విధులతో పాటుగా కొన్ని ప్రత్యేక విధులు కూడా నిర్వర్తించవలసి ఉంటుంది. ఇలా ఏర్పడే నిర్మాణాత్మకమైన శాశ్వత మార్పులను 'వేరు రూపాంతరాలు' అంటారు.

దుంప వేళ్ళు[మార్చు]

వేర్లలో కొన్ని మొక్కలు ఆహరపదార్ధాల్ని నిలువచేసుకుంటాయి. వాటిని మనం ఆహారంగా ఉపయోగిస్తాము. వీటిని దుంపలు అంటాము.

అంటువేరు[మార్చు]

చెట్ల మీదనే పెరుగు చిన్న చిన్న మొక్కలు మర్రి కొన్నిగలవు. వాని వేళ్లును భూమిలోనికికేగవు. బదనిక వేళ్లవలె కొమ్మలోపలికిపోయి దాని ఆహారమును తస్కరింపవు. భూమిలో నాటుకొనుటకు బదులు ఆ కొమ్మను అంటి పెట్టుకొని గాలిలో దొరకు నావిరిని బీల్చుకొనుచుండును. ఇట్టివి అంటువేరులు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వేరు&oldid=2890095" నుండి వెలికితీశారు