కొమ్మ
Jump to navigation
Jump to search
కొమ్మను శాఖ అని కూడా అంటారు. ఇంగ్లీషులో Branch అంటారు. కొమ్మ అంటే వృక్షాలలో ప్రదానమైన కాండం లేదా మాను చీలిన తరువాత ఉండే పై భాగము. చిన్న గుల్మాలు, పొదలలో కొమ్మలు ఎక్కువగా బలహీనంగా ఉంటాయి. అదే వృక్షాలలో మూలకాండం నుండి 2-3 కొమ్మలు మాత్రమే ఉండి అవి ఉపశాఖలుగా విభజించబడి వృక్షం పెరిగే కొద్దీ అవి బలంగా తయారౌతాయి. దీనినే శాఖోపశాఖలుగా విస్తరించడంగా పేర్కొంటారు. చెట్టు చివరగా ఉండే చిన్న కొమ్మలను రెమ్మలు అంటారు. ఆంగ్లంలో పెద్ద కొమ్మలను బగ్స్ (boughs) అని, చిన్న కొమ్మలను ట్విగ్స్ (twigs) అని అంటారు. కొమ్మలు దాదాపు అడ్డంగా, నిలువుగా, వికర్ణ దిశలో ఉంటాయి, ఎక్కువ చెట్ల యొక్క కొమ్మలు వికర్ణ దిశలోనే వృద్ధి చెందుతాయి. ట్విగ్స్ అనే చిన్న కొమ్మలు అంతిమ కొమ్మలను సూచించగా, బగ్స్ అనే పెద్ద కొమ్మలు మాను నుంచి నేరుగా వచ్చిన శాఖలను సూచిస్తాయి.
పాటలు
[మార్చు]- కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి.
- కొమ్మ మీద కోయిలమ్మ కుహూ అన్నది కుహూ కుహూ అన్నది.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]Look up కొమ్మ in Wiktionary, the free dictionary.