మొగ్గలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

తెలుగు సాహిత్యంలో మూడు పాదాల ఆధునిక మినీ వచన కవితా ప్రక్రియ మొగ్గలు . ఈ కవితా ప్రక్రియను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ప్రవేశపెట్టారు.

ఎన్ని అక్షరాలు విత్తనాలుగా నాటానో
మొగ్గలుగా కవితావనంలో విరబూయడానికి
మొగ్గలు సాహిత్య క్షేత్రంలో పండే నిత్య పంట

ప్రణాళికబద్దమైన ఏ కవితా ప్రక్రియ అయిన ఎక్కువకాలం సాహిత్యంలో మనుగడ ఉంటుంది. అంతేకాదు సైద్దాంతిక ధృక్పథం ; బలమైన శిల్పం ; వస్తు అనుకూలత ఇలాంటివి ఉండడమే ఏ కవితా ప్రక్రియ మనుగడకైనా అవసరం. అలాంటి మంచి కవితా ప్రక్రియనే భీంపల్లి శ్రీకాంత్ గారు సృష్టించిన " మొగ్గలు " కవితా ప్రక్రియ. మొగ్గలు మరీ కఠిన ప్రక్రియ కాదు.అర్ధం చేసుకొని సులభసాధ్యంలా రాయవచ్చు. కొత్తగా వచ్చే యువకవులకు ఇదీ మంచివేదిక లాంటి ప్రక్రియ అవుతుందనడంలో ఎలాంటి అత్యుక్తి లేదు.

మొగ్గలు ఆవిర్భావ నేపథ్యం[మార్చు]

ఈ మొగ్గలు ప్రక్రియ యాదృచ్ఛికంగానే ఆవిర్భవించింది. ఒక ప్రక్రియను ప్రారంభించాలని చేసిన ప్రయత్నమేమి కాదు. మూడుపాదాలతో రెండు మూడు వచన కవితలను ఆవిష్కరించినపుడు, అందులో కవిత్వం వైవిధ్యంగా ఉండడం, కొత్త అభివ్యక్తితో ఆవిష్కరించడం వంటి లక్షణాలు ఉండడంతో ఒక కవితా ప్రక్రియగా మొగ్గలు తెలుగు సాహిత్యములో విరబూసింది. ఈ మొగ్గలు ఆవిర్భవించడానికి ప్రేరణ తన గురువులు ఆచార్య మసన చెన్నప్ప గారే అంటారు భీంపల్లి. తెలుగు కవితా ప్రక్రియలైన నానీలు, నానోలు, గజళ్ళు, రుబాయిలు రాస్తున్నప్పుడు, అనేక రకాలైన వచనకవితా ప్రక్రియల్లో కవిత్వం రాస్తున్నవాడివి. నీవే ఒక ప్రక్రియ ఎందుకు ప్రారంభించకూడదు అంటూ భీంపల్లికి ఒక చక్కని సూచన చేశారు. కానీ అప్పటికీ తెలుగు సాహిత్యంలో అనేక కవితా ప్రక్రియలు ఉండటం, మళ్ళీ ఒక కొత్త ప్రక్రియను ప్రారంభిస్తే ఆదరించేవారు ఉంటారా అనే సందేహంతో వారి సూచనను సున్నితంగానే తిరస్కరించారు. అయినా నీకా శక్తి ఉందంటూ భీంపల్లి కవిత్వాన్ని పరామర్శ చేశారు. వారు చెప్పిన ఆర్నెల్లకు గాని ఈ ప్రక్రియ విరబూయలేదు. ఇది కూడా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. వారి ఆశీస్సులతోనే ఈ మొగ్గలు విరబూస్తున్నాయి. తెలుగు సాహిత్యాన్ని పరిమళింపజేస్తున్నాయి.మొగ్గలు మరింతగా విరబూయడానికి యువకవి బోల యాదయ్య మరో కారణమంటారు భీంపల్లి. అతని ప్రోత్సాహం, సహకారం వల్లే మొగ్గలు తెలుగు సాహిత్యంలో నిత్యనూతనంగా విరబూస్తూ పరిమళిస్తున్నాయంటారు భీంపల్లి.

మొగ్గలు నామకరణం[మార్చు]

పూలు వికసించడానికి ముందు గల రూపం మొగ్గలు. మొగ్గ దశలో ఉన్న పువ్వులాగనే ఆనందాన్నిస్తుంది. పూలు పూసే క్రమంలో మొగ్గలనేవి ఒక దశను సూచిస్తున్నాయి. మొగ్గలు ఎప్పటికీ వాడిపోనివి. ఎప్పుడూ తాజాగా ఉంటాయి. ఈ మొగ్గలు కూడా అంతే. భీంపల్లి శ్రీకాంత్ ఆధునిక కవితా రూపాలకు తానొక స్వీయ కవితా రూపాన్ని అందించి, దానికో పేరు పెట్టడం అతని నూతన కవితా తృష్ణను తెలియజేస్తుంది. మూడు చుక్కలు పెట్టి ముచ్చటగొలిపేవే మొగ్గలు. మొగ్గలు ప్రక్రియను భీంపల్లి శ్రీకాంత్ యాదృచ్ఛికంగానే మొదలుపెట్టారు. మొగ్గలను మొదటగా 2017 సెప్టెంబరులో అంకురార్పణ చేసారు. భీంపల్లి వారి మొదటి మొగ్గలు కవిత

కొన్ని అక్షరాలు చాలు
కవిత్వాన్ని ఆవిష్కరించడానికి
వాక్యం రసాత్మక కావ్యం

మొగ్గలు కవితా లక్షణాలు[మార్చు]

  • మొగ్గలు మూడు పాదాల కవిత్వం
  • ఎలాంటి అక్షర నియమం కానీ, ఛందస్సు కానీ లేదు.
  • ప్రతి పాదంలో మూడు నుంచి ఐదు పదాలు ఉండాలి.
  • ఈ మొగ్గలు మూడుపాదాల కవిత్వం అయినప్పటికీ క్లుప్తత, సరళత, సంక్షిప్తత, గాఢత దీని ప్రధాన లక్షణాలు.
  • మూడు పాదాలలో మొదటి పాదానికి కొనసాగింపుగా రెండవపాదం వుండాలి. అంటే మొదటిపాదంలో వాక్యం అంతం కారాదు.
  • మొదటి రెండు పాదాలు భావయుక్తంగా, అర్ధవంతంగా చెబితే, దానిని సమర్థిస్తూ, అన్వయిస్తూ, బలపరుస్తూ, మూడవపాదం ముక్తాయింపుగా ఉంటుంది.
  • మరోవిధంగా చెప్పాలంటే కొన్నిసార్లు మొదటి రెండు పాదాలు ఒక "సంశ్లిష్ట వాక్యం"లా ఉండాలి. అంటే కవితా సౌలభ్యం బట్టీ ఉపయోగించుకోవచ్చు.
  • ఈ మూడవపాదం ఒక నినాదంగా, సూక్తిగా, సామెతగా చెప్పబడుతుంది. ఈ మూడవపాదాన్ని చెప్పడంవల్ల కవి ఒక కొత్త నినాదాన్ని, సూక్తిని, సామెతను చెప్పినట్లవుతుంది.
  • వస్తు అనుకూలత, బలమైన శిల్పం, నూతన అభివ్యక్తి, ఈ నూతన ప్రక్రియకు ఆలంబన. ఈ మూడు అనుకూలతలే మొగ్గలు వికసించడానికి పాదుకలు.
  • మొగ్గలు కవితా ప్రక్రియలో మొదటి రెండు పాదాలు లోకం నుంచి గ్రహించి, మూడవపాదాన్ని తన అనుభవంలోచి వ్యక్తంచేయడం ఎంతో రమణీయపొందిక.

మొగ్గల కవితా వికాసం[మార్చు]

మొగ్గలు చాలా సులభమైన, అందరు రాయదగిన కవితా ప్రక్రియ. మొదట్లో ఈ ప్రక్రియ సామాజిక మాద్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్ ట్రాగ్రామ్ మొదలైన వాటిలో విరివిగా మొగ్గలు విరబూశాయి. అంతేకాకుండా మొగ్గలు పేరిట వాట్సాప్ గ్రూప్, అలాగే ఫేస్ బుక్ లో కూడా మొగ్గలు పేరిట గ్రూప్ ఉంది. వీటి నిర్వాహకులు భీంపల్లి శ్రీకాంత్. మొదట ఈ గ్రూప్లో పోస్ట్ చేసి సరిచూసుకొని ఒకరికొకరు విశ్లేషణ చేసుకొని మొగ్గలు అనే అక్షరాల అభినందనలు తెలుపుకొని ఆ మొగ్గలు పువ్వుల్లా వికసించడానికి గ్రూపుల ద్వారా ఈ ప్రక్రియను పరిపుష్టం చేస్తున్నారు. ఇప్పటి వర్తమాన కవులనుంచి ప్రముఖ కవులదాకా వెయ్యిమందికిపైగా మొగ్గలు నేటికీ ఆవిష్కరిస్తున్నారు.ఇది చినుకులా ప్రారంభమై వరదలా పారుతున్నది. ప్రారంభించిన అనతికాలంలోనే అత్యున్నత వేగంగా ఈ మొగ్గలు విరభూస్తున్నాయి. కవుల ఆదరణతోనే ఈ మొగ్గలు పరిమళిస్తున్నాయి. ఈ మొగ్గలు సులభమైన ప్రక్రియ కావడంతో విరివిగా కవులు వైవిధ్యమైన శైలితో భిన్నమైన వస్తువుతో మొగ్గలు రాస్తున్నారు. ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న ఈ మొగ్గలు కవితా ప్రక్రియను సహస్రాధిక కవులు రాయడం విశేషం.ప్రతి రోజూ "మొగ్గలు" గ్రూపులో మొగ్గలు ఎవరో ఒకరు రాస్తూనే ఉంటారు. పండుగలు, ప్రముఖుల జయంతులు, ప్రత్యేకమైన దినోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా మొగ్గలను రాస్తున్నారు.

తెలుగు దిన, వార, పక్ష, మాస, పత్రికల్లో మొగ్గలు[మార్చు]

నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, మన తెలంగాణ, మనం పత్రిక, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి, ఆంధ్ర ప్రభ, సూర్య, వార్త, గణేష్, మొదలైన దినపత్రికల్లో స్వర్ణపుష్పం, సాహితి ప్రస్థానం, విశాలాక్షి, అష్టాక్షరి, మొదలైన మాసపత్రికలో మగ్గాలు ప్రచురితమయ్యాయి. అలాగే అంతర్జాల పత్రికలైన విహంగ, నవ్య మీడియా, భాగ్యనగర్ పోస్ట్, ప్రతిలిపి వంటి వాటిలో కూడా మొగ్గలు పరిమళించాయి. ఏ కవితా ప్రక్రియ అయినా వికసించాలంటే పత్రికా సంపాదకుల సహకారం ఉండాల్సిందే, వారి సహకారం ఉంటేనే, ఏ ప్రక్రియ అయినా రాణించగలదు. ఆయా పత్రికల సంపాదకుల ప్రోత్సాహంతో నేటికీ మొగ్గలు పత్రికల్లో వెలుగు చూస్తున్నాయి.

అంతర్జాతీయ మాసపత్రికలో మొగ్గలు[మార్చు]

అమెరికా సిలికానాoద్ర వారి సుజనరంజని అంతర్జాల మే నెల మాసపత్రిక కవితా స్రవంతి శీర్షికలో వారి భీంపల్లి శ్రీకాంత్ వారి చదువు మొగ్గలు, ప్రచురితమయ్యాయి. రెండు నెలలకు ఓసారి వచ్చే పశ్చిమ బెంగాల్ వారి ఒరవడి ఏడవ సంచిక గ్రీష్మ సంచికలో కవి హృదయం అనే భీంపల్లి శ్రీకాంత్ వారి మొగ్గలు ప్రచురితమయ్యాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి అక్షర దీపిక మే నెల మాసపత్రికలో భీంపల్లి శ్రీకాంత్ వారి నాన్న మొగ్గలు ప్రచురితమయ్యాయి. అమెరికా వారి తెలుగు మాస పత్రికలో భీంపల్లి శ్రీకాంత్ వారి *అమ్మ మొగ్గలు* ప్రచురితమయ్యాయి.ఇంకా మధురవాణి, సంచిక, విహంగ, తెలుగుతల్లి కెనడా తదితర వెబ్ మ్యాగజైన్ లలో వీరి మొగ్గలు ప్రచురితమయ్యాయి.

మొగ్గలు కవితా సంపుటాలు[మార్చు]

 "మొగ్గలు" కవితా పక్రియతో ఇప్పటివరకు ముప్పైకి పైగా కవితాసంపుటాలు వెలువడ్డవి. "మొగ్గలు నాన్న" భీంపల్లి శ్రీకాంత్ 300 మొగ్గలతో "మొగ్గలు" కవితా సంపుటిని వెలువరించిండు. ఆ తర్వాత మట్టి మొగ్గలు (బోల యాదయ్య), చిరుమొగ్గలు (ఉప్పరి తిరుమలేష్), సిరిరేఖలు (ధనాశి ఉషారాణి), శ్రీ సాయి అక్షరాంజలి (ఎ.బాబూరావు), ఆదిశక్తి మొగ్గలు (సత్యనీలిమ), బతుకమ్మ మొగ్గలు (భీంపల్లి శ్రీకాంత్), బతుకమ్మ మొగ్గలు (ఉప్పరి తిరుమలేష్), తొలి మొగ్గలు (అనుపటి హేమలత), నాన్న మొగ్గలు (భీంపల్లి శ్రీకాంత్), సాయి దీవెన (కె.రాధికా రాణి), చేనేత మొగ్గలు ( భీంపల్లి శ్రీకాంత్), అసామాన్యుడు (భీంపల్లి శ్రీకాంత్), సింగిడి (కొలిపాక శ్రీనివాస్), ఫిలంగదళం ( భీంపల్లి శ్రీకాంత్ ), అసాధ్యుడు ( భీంపల్లి శ్రీకాంత్), నేత మొగ్గలు (భీంపల్లి శ్రీకాంత్), స్వాతంత్ర్య మొగ్గలు (భీంపల్లి శ్రీకాంత్), పద్మశాలి మొగ్గలు (భీంపల్లి శ్రీకాంత్), వినాయక మొగ్గలు (కడల శ్రీమంత్) వెలువడ్డవి. అంతేకాదు "ప్రేమ" అనే ఏకాంశంతో పన్నెండుమంది కవులు రాసిన ప్రేమ మొగ్గల కవితాసంపుటాలు వెలువడ్డాయి. ప్రేమ మొగ్గలు ( భీంపల్లి శ్రీకాంత్), శిథిలస్వప్నం ( బోల యాదయ్య), నీలో నేను (పులి జమున) ‌, నీ ధ్యాసలోనే (ఉప్పరి తిరుణలేష్), నీ తలపుల్లోనే (సత్యనీలిమ), చెదరని జ్ఞాపకం (ఓర్సు రాజ్ మానస), చెరగని సంతకం (కొప్పోలు యాదయ్య), కేరాఫ్ అడ్రస్ (పొన్నగంటి ప్రభాకర్), నీ ఆరాధనలో (కె.శైలజాశ్రీనివాస్), దాసుకున్న లోకం (కెపి.లక్ష్మీనరసింహ), తొలి చూపులోనే (బర్క శశాంక్), నీ ప్రేమ సాక్షిగా ( పోలే వెంకటయ్య)  వెలువడ్డాయి. ఇంకా సంకలనాలు కూడా వెలువడ్డాయి. వందమంది కవులతో "బతుకమ్మ మొగ్గలు", నలభై ఆరు మందితో "బాలల మొగ్గలు" వెలువడ్డాయి. త్వరలోనే సహస్రాధిక కవులతో "సాయి మొగ్గలు", నూటయాభైమంది కవులతో "గాంధీ మొగ్గలు", వందమందితో "సురవరం మొగ్గలు‌", "పివి మొగ్గలు"వెలువడ్డవి."ఆరెకటిక మొగ్గలు" పేరిట డా. మంగళగిరి శ్రీనివాసులు, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ " తెలంగాణ బాపూజీ " వెలువరించారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మొగ్గలు&oldid=4076867" నుండి వెలికితీశారు