Jump to content

తెలుగు సాహిత్యం - నన్నయ యుగము

వికీపీడియా నుండి
తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

తెలుగు సాహిత్యంలో సా.శ. 1000 నుండి 1100 వరకు నన్నయ యుగము అంటారు.

రాజకీయ, సామాజిక వేపధ్యం

[మార్చు]

నన్నయకు ముందే ఆంధ్ర సాహిత్యానికి సన్నాహాలు జరిగాయి. రంగం సిద్ధమైంది. ప్రస్తావనానంతరము పాత్ర ప్రవేశపు సూచన కూడా ఇవ్వబడింది. ఇక నన్నయ అనే సూత్రధారుడు "ఆంధ్ర మహా భారతము" అనే పాత్రను తెలుగు సాహితీ రంగంపై ఆవిష్కరించాడు. భారత రచనా ప్రేరణ యశస్సు రాజరాజనరేంద్రునకు దక్కినా గాని అంతకు ముందు మార్గ కవితను సేవించుచున్న ఆంధ్రులకు తెలుగు దేశి కవితను పుట్టించిన ఘనత చాళుక్య రాజులకు దక్కింది.[1]

బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి (సా.శ.608–644) తూర్పు దక్కన్ ప్రదేశాన్ని (ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) సా.శ. 616 సంవత్సరంలో, విష్ణుకుండినుని ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేశి సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు అన్న అనుమతితో వేంగిలో స్వతంత్ర రాజ్యం స్థాపించాడు. ఈ ప్రాంతం క్రమంగా వేంగి సామ్రాజ్యంగా పరిణితి చెందింది. కాని రాజరాజ నరేంద్రుని కాలానికి అంతఃకలహాల వలన, శత్రువుల దండయాత్రల వలన వేంగి గణనీయంగా బలహీనపడింది. అయితే తెలుగు సాహిత్యం మాత్రం వ్రేళ్ళూనుకొని అప్పటినుండి మహావృక్షంగా విస్తరించింది. తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని అద్దంకి, కందుకూరులలో నున్న పాండురంగ శిలాశాసనాలు చెబుతున్నాయి. ప్రఖ్యాతి గాంచి, ప్రాచుర్యంలోకి వచ్చిన సాహిత్య కార్యకలాపాలు 11వ శతాబ్దంలో కవిత్రయంలో మెదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రాంరంభించేవరకు జరగలేదు.

నన్నెచోడుని ఈ ప్రసిద్ధ పద్యం నన్నయకు ముందున్న తెలుగు కవిత్వం దశను గురించిన ముఖ్య ఆధారం

మును మార్గ కవిత లోకంబున వెలయగ దేశి కవిత పుట్టించి తెనుం
గును నిలిపిరంధ్ర విషయంబున జన చాళుక్య రాజు మొదలుగ పలువుల్

ఇక్కడ "మార్గ కవిత", "దేశి కవిత" అనేవి ఏమిటి? తెనుంగును నిలిపిన చాళుక్యరాజులెవరు? - అనే వాటిపై సాహితీవేత్తలు పలు అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఏమైనా "దేశి కవిత" అంటే నిజమైన తెలుగు సాహిత్య రూపంగా భాష ఆవిర్భవించిందని పలువురి అభిప్రాయం.

బొద్దు పాఠ్యం'వాలు పాఠ్యం'వాలు పాఠ్యం'వాలు పాఠ్యం'వాలు పాఠ్యం'వాలు పాఠ్యం

ఈ యుగంలో తెలుగు లిపి

[మార్చు]
చాళుక్య భీముని శాసనం లిపి
రాజరాజనరేంద్రుని శాసనం లిపి

ముఖ్య కవులు

[మార్చు]

పండిత సభలు ఉన్నాయని నన్నయయే పేర్కొన్నాడు. నన్నయకు తోడు నిలిచిన నారాయణభట్టు ఉన్నాడు. కాని ఇతర కవుల గురించి ఇదమిత్థంగా తెలియరావడంలేదు. కనుక ఈ యుగంలో నన్నయయే మనకు తెలియవస్తున్న కవి, యుగకర్త. ఆంధ్ర మహాభారతమే ఈ యుగపు మహాగ్రంధము. వేములవాడ భీమకవి, అధర్వణుడు, పావులూరి మల్లన వంటి కవులు ఈ కాలంలోనివారు కావచ్చునని అభిప్రాయాలున్నా గాని అవి నిర్ధారింపబడలేదు.

ముఖ్య రచనలు

[మార్చు]

ముఖ్య పోషకులు

[మార్చు]
ఆంధ్రమహాభారతం రచించమని నన్నయను కోరిన రాజరాజ నరేంద్రుని (సా.శ. 1019–1061) విగ్రహం (రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద

ఇతరాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం

వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]