Jump to content

జానపద సాహిత్యం

వికీపీడియా నుండి
cultural map of India
భారతదేశ సంస్కృతి ప్రధానgxe ఐదు భౌగోళిక ప్రాంతాలుగా విభజించబడింది.
cultural map of India
ప్రాంతీయ సాంస్కృతిక సరిహద్దులు, వాటి స్థిరత్వం వివరించే మ్యాప్.

జానపద సాహిత్యం (ఆంగ్లం: Folklore) అనేది నిర్దిష్ట వ్యక్తుల సమూహం ద్వారా భాగస్వామ్యం చేయబడింది. ఇది వారివారి సంస్కృతి, సంప్రదాయాలను కలిగి ఉంటుంది. ఇందులో కథలు, పురాణాలు, ఇతిహాసాలు, సామెతలు, పద్యాలు, హాస్యం.. వగైరా ఉంటాయి. అవి సమూహానికి సాధారణమైన సాంప్రదాయ నిర్మాణ శైలుల నుండి భౌతిక సంస్కృతిని కలిగి ఉంటాయి. జానపద కథలు, జానపద నృత్యాలు, ఆచారాల వంటి వేడుకల రూపాలు కూడా ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్కటి, ఒక్కొక్కటిగా లేదా కలయికలో, జానపద కళాఖండంగా లేదా సాంప్రదాయ సాంస్కృతిక వ్యక్తీకరణగా పరిగణించబడుతుంది. జానపద సాహిత్యం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి లేదా ఒక తరం నుండి మరొక తరానికి విస్తరించబడుతుంది. జానపద సాహిత్యం అనేది పాఠ్యాంశాల్లోనో, లలిత కళలలో అధ్యయనంలోనో నేర్చుకునేది కాదు. ఈ సంప్రదాయాలు ఒక వ్యక్తి నుండి మరొకరికి మౌఖిక సూచన లేదా ప్రదర్శన ద్వారా చేరుతాయి. జానపద సాహిత్యం అకడమిక్ అధ్యయనాన్ని జానపద అధ్యయనాలు(Folklore studies) లేదా జానపద సాహిత్యం(Folkloristics) అని పిలుస్తారు. దీనిని అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పి,హెచ్.డి కోర్సుల ద్వారా విద్యార్థులు అన్వేషించవచ్చు.

వర్గీకరణ

[మార్చు]

రిచర్డ్ ఎం. డార్సన్ 1972లో ‘ఫోక్‌లోర్ అండ్ ఫోక్‌లైఫ్’ గ్రంథ ఉపోద్ఘాతంలో జానపద విజ్ఞానాన్ని నాలుగు విధాలుగా వర్గీకరించాడు.[1] అవి..

  1. మౌఖిక జానపద విజ్ఞానం: జానపద గేయాలు, కథా గేయాలు, జానపద పురాణాలు, ఇతిహాసాలు, గద్య కథనాలు, సామెతలు, పొడుపు కథలు, మాండలికాలు, నుడికారాలు, తిట్లు, ఒట్లు మొదలైనవన్నీ ఈ విభాగంలోకి వస్తాయి.
  2. సాంఘిక జానపదాచారాలు: పుట్టుక, వివాహం, మరణం తదితరాంశాలకు సంబంధించిన ఆచారాలు, కుటుంబం, సంబంధ బాంధవ్యాలు, పండుగలు, వినోదాలు, ఆటలు, జానపద వైద్యం, మతం, నమ్మకం మొదలైనవన్నీ ఈ విభాగంలో చేరతాయి.
  3. వస్తు సంస్కృతి: భౌతిక జీవితానికి సంబంధించిన అన్ని వస్తువులే కాకుండా కళారూపాలు కూడా వస్తు రూపంలో ఉంటే ఈ విభాగంలోనే చోటు పొందుతాయి. చిత్రకళ, వాస్తుకళ, వివిధ వృత్తుల పరికరాలు, దుస్తులు, అలంకరణ, ఆభరణాలు, ఆహార సామగ్రి, పూజా సామగ్రి, శిలా విగ్రహాలు, దారు విగ్రహాలు తదితర వస్తు రూపాంశాలెన్నో ఈ విభాగంలో వస్తాయి.
  4. జానపద కళలు: సంగీతం, నృత్యం, అభినయం ఉండే ప్రదర్శన కళలన్నీ ఈ విభాగంలో చేరతాయి. గాత్ర సంగీతం, వాద్య సంగీతం, తోలు బొమ్మలాటలు, యక్షగానం, వీధి భాగోతం, కోలాటం, పగటి వేషాలు, బహురూపుల గారడీ విద్యలు మొదలైనవి ఈ విభాగంలో వస్తాయి.

సాంస్కృతిక చిహ్నాలు

[మార్చు]
ఆర్కిటైప్ బొమ్మ వివరాలు
అహింస సర్వకాల సర్వావస్థలలో ఇతర ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస
భజన దేవాలయంలో, ఇతర ప్రార్థనా స్థలములలో గుంపుగా కొందరు చేరి సాగించు స్మరణం భజనగా వ్యవహరిస్తారు
కూర కూర అనేది ముఖ్యమైన వంటకం. దీన్ని సాధారణంగా అన్నంతో గాని లేదా చపాతీ లలో గాని తింటారు
ధర్మం ధర్మం అనగా మానవత్వాన్ని రక్షించే గుణం
గంగా నది భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడివడి ఉన్నాయి

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "జానపద సాహిత్యం | Sakshi Education". web.archive.org. 2023-02-26. Archived from the original on 2023-02-26. Retrieved 2023-02-26.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)