తెలుగు మాండలికాలు

వికీపీడియా నుండి
(మాండలికాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Telugu.svg

తెలుగు మాండలికాలు అనగా తెలుగు భాషకు సంబంధించిన మాండలిక భాషలు (Dialects). మండలం అంటే ప్రాంతం. ఒక ప్రాంతంలో ఎక్కువమంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు. ప్రతి భాషకి మాండలిక భాష ఉంటుంది. అలాగే తెలుగు భాషలో భాషాభేదాలున్నాయి. మాండలిక భాష అనేది ప్రత్యేకమైన భాష కాదు. ఇది ప్రధాన భాషలో ఒక అంతర్గత భాషగా ఉంటుంది. ఏ ప్రాంతనికి చెందిన భాషా భేదమైనా తెలుగు భాషలో భాగంగానే ఉంటుంది. మాండలిక భాషని న్యూన ప్రామాణికం (Substandard form) గా చూస్తారు. అంటే ప్రధాన భాషకన్న తక్కువగా - చిన్నచూపు ఉంటుంది. మాండలిక భాష వ్యవహార ప్రధానమైనది. కొందరు మాండలిక భాషలో రచనలు చేసినా సార్వజనీనంగా ఉండే అవకాశం తక్కువ.

మాండలిక భాషల్ని అవగాహన చేసుకోవడం అనేది ఆయా ప్రాంతాలతో ప్రత్యక్ష సంభంధం కలిగినపుడు సులభం అవుతుంది. ప్రధాన భాషలు పరిసరాల భాషల ప్రభావం వల్ల భాషా స్వరూపం మార్పుకు లోనవుతూ ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణా తెలుగుపై ఉర్దూ ప్రభావం వల్ల ప్రత్యేకత సంతరించుకుంది. భౌగోళిక పరిస్థితుల ప్రభావం చేత కూడా మాండలిక పదాలు ఏర్పడుతూ ఉంటాయి. సముద్రతీరంలోని వాళ్ళ భాషాపదాలు, ఎడారి ప్రాంతంలోగల భాషాపదాలు భిన్నంగా ఉంటాయి. కులాన్ని బట్టి, వృత్తిని బట్టి, మతాన్ని బట్టి మాండలిక భాషాభేదాలు ఏర్పడతాయి. మనదేశంలో కొన్ని కులాల భాష ప్రత్యేకంగా ఉంటుంది. కమ్మరి, జాలరి, వడ్రంగి మొదలైనవారి భాష ప్రత్యేకంగా ఉండి వృత్తి మాండలికాలుగా వ్యవహరింపబడతాయి. క్రైస్తవమతస్థులైన తెలుగువారి భాషకి, హిందూ మతస్థులైన తెలుగువారి భాషకి భేదాలు గమనించవచ్చును.

తెలుగు మాండలిక పదకోశాలను తెలుగు అకాడమి ప్రచురించింది.

ప్రధానమైన మాండలికాలు

[మార్చు]

తెలుగు భాషలో ప్రాంతాల ఆధారంగా నాలుగు ప్రధానమైన మాండలిక భాషలు,యాసలు ఉన్నాయి.

  • 1. సాగరాంధ్ర భాష : కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషని కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికాలు జాతీయాలు అంటారు.
  • 2. రాయలసీమ భాష : చిత్తూరు, అనంతపురం, కడప,కర్నూలు జిల్లాల ప్రాంతపు భాషని రాయలసీమ మాండలికం అంటారు.
  • 3. తెలంగాణ భాష : తెలంగాణ ప్రాంతపు బాషని తెలంగాణ మాండలికం అంటారు.
  • 4. కళింగాంధ్ర భాష : విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషని కళింగాంధ్ర మాండలికం అంటారు.

తేడాలు, మాండలిక సంఖ్య

[మార్చు]

1961జనగణన ప్రకారం తెలుగు మాండలికాలు:- అంకతి, ఆంధ్ర , బుడబుక్కల , డొక్కల , చెంచు , ఎకిడి , గొడారి, బేరాది, దాసరి , దొమ్మర , గోలారి (గొల్లరి), కమ్మర , కామాటి, కాశికాపిడి , కొడువ, మేదరి , మాలబాస, మాతంగి , నగిలి, పద్మసాలి , జోగుల , పిచ్చుకుంట్ల , పాముల , కొండ రెడ్డి, సాలెవారి, తెలంగాణా, తెలుగు, సగర, వడగ, వడరి, వాల్మీకి , యానాది , బగట, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, మద్రాసు(వడుగ ), ఒడిషా(బడగ )

వడ్డెర, చెంచు, సవర, మన్న దొర మాండలికాలు ప్రామాణిక తెలుగుకు అతిదగ్గరగా ఉంటాయి.

తమిళనాడులో తెలుగు మాండలికాలను 3 విధములుగా విభజించినారు - సేలం, కోయంబత్తూరు, మదరాసు. విరుదునగరమ్, తూతుకుడి, మధురై, తంజావూరు ప్రాంతాలలో తెలుగు విశేషంగా వ్యవహారికంలో ఉంది.

బాహ్య లింకులు

[మార్చు]

ఆంధ్రభారతి

యాసలు

మూలాలు

[మార్చు]

https://archive.org/details/mandalikapadakos021234mbp -తెలుగు మాండలికములు, అక్కిరాజు రమాపతి రావు గారి రచన