అన్నం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |

అన్నం, భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సాధారణంగా రోజూ భుజించే ఆహారం. వరి ధాన్యం నుండి వేరుచేసిన బియ్యం నీటిలో ఉడికించగా అన్నం తయారవుతుంది. పుట్టిన పిల్లలకు మొట్టమొదటి సారిగా అన్నం తినిపించడం హిందూ సంప్రదాయంలో అన్నప్రాసన అనే కార్యక్రమం తప్పనిసరిగా జరుపుకుంటారు.
వండే విధానం
[మార్చు]- సాధారణ పద్ధతి: కావలసిన బియ్యం తీసుకుని అవసరమైన దాని కంటే ఎక్కువగా నీరు పోసి పెద్దదైన గిన్నెలో ఉడికించాలి. బియ్యం ఉడికిన తరువాత, ఎక్కువైన నీటిని వంచేయాలి.
- అత్తెసరు పద్ధతి: కావలసిన బియ్యం తీసుకుని అవి ఉడకడానికి కావలసినన్ని మాత్రమే నీరు పోసి ఉడికించాలి. నీరు వంచాల్సిన అవసరం లేదు.
- కుక్కర్ పద్ధతి: కావలసిన బియ్యం తీసుకుని అవి ఉడకడానికి కావలసినన్ని మాత్రమే నీరు పోసి, కుక్కర్లో ఉంచి నీటి ఆవిరి మీద నిర్ణీత సమయంలో వంటచేసే పద్ధతి.
నూకల అన్నం
[మార్చు]దక్షిణ భారతీయ వంటకాల్లో నూకల అన్నం నిన్న, మొన్నటి వరకు కనిపించేది. ఇది సాధారణంగా ఉదయాన్నే తినే పదార్థం. మన పెద్దలు ముఖ్యంగా వ్యవసాయదారులు ఉదయాన్నే పొలాలకు వెళ్ళే ముందు నూకల అన్నం తిని బయల్దేరేవారు. బియ్యాన్ని జల్లెడ పడితే నూకలు లభిస్తాయి. ఒక వంతు నూకలకు 2 వంతుల నీళ్ళు పోసి అచ్చం అన్నం లాగానే ఉడకబెట్టేవారు. దించి కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా తొక్కు లేదా పప్పు వేసుకుని తినేవారు. నేడు ఈ వంటకం చేసుకోవడం దాదాపుగా అంతరించిపోయింది. అందుకు ముఖ్య కారణం ఇప్పుడు ధాన్యం అధికంగా లభించడం. పూర్వ కాలంలో యుద్ధాలు, కరువు మొదలయిన వాటి వల్ల బియ్యం దొరకక నూకలను కూడా తినేవారు.
ప్రభుత్వాల అన్నదాన పథకాలు
[మార్చు]ఢిల్లీ సర్కారు పేదలకు హల్వా, అన్నం, పూరీ, చపాతీ తదితర వంటకాలతో రూ.15కే భోజనం అందించే పథకాన్ని చేపట్టింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అన్నపూర్ణ పథకం కింద హైదరాబాదులోని పేదల కొరకు 5 రూపాయాలకే భోజనాన్ని అందిస్తుంది.