పకోడీ
ఉల్లి పకోడీ | |
| ఇతర పేర్లు | పకోడా, పికోరా, భజియా, పకోడీ, పొనాకో, పకూరా, ఫక్కురా, ఫులౌరీ, బోరా, ఛోప్ |
|---|---|
| రకం | ఫ్రిట్టర్ |
| Course | అపెటైజర్ లేదా స్నాక్ |
| మూల స్థానం | దక్షిణ ఆసియా[1][2][3] |
| రాష్ట్రం | దక్షిణ ఆసియా |
| Associated cuisine | |
| ప్రధాన అనుఘటకాలు |
|
| Variations |
|
| Similar dishes | క్యెట్ తున్ క్యావ్ ఫోలౌరీ |
పకోడీ అనేది భారత ఉపఖండం నుండి ఉద్భవించిన ఒక చిరు తిండి. ఇవి 5 నక్షత్రాల హోటళ్ల నుండి, వీధి బండ్ల దాకా ఉండే [5]అన్ని తిను బండారాల విక్రయశాలల్లో అమ్ముతారు. [6] విశాఖ పట్నం లో పకోడీ బండి అనే ఒక హోటలే ఉంది[7]. అవి తరచుగా బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వంటి కూరగాయలను కలిగి ఉంటాయి. వీటి రుచికోసం ఆయా కూరగాయలను తడిపిన శనగ పిండి లో ముంచి నూనెలో వేయిస్తారు.

దీనినే వివిధ ప్రాంతాలలో పికోరా, పకోడా, పకోడి అనీ అంతే కాక ప్రాంతీయ పేర్లలో భాజీ, భజియా, బోరా, పోనకో అని కూడా పిలుస్తారు
పద వివరణ
[మార్చు]పకోడీ అన్న శబ్దం సంస్కృత పదమయిన "పక్వత్" అన్న ధాతువు నుండి వచ్చింది, ఇది పక్వా ('వండిన), వత ('ఒక చిన్న ముద్ద) లేదా దాని నుండి వచ్చిన 'వటక'. నూనె లేదా నెయ్యి లో వేయించిన పప్పుతో తయారు చేసిన గుండ్రని పదార్థం యొక్క సమ్మేళనం.[8][9] బజ్జి అన్న శబ్దం కూడా వేయించిన అనే అర్థం కల సంస్కృత పద్యం 'భార్జిత'నుండి వచ్చింది..
చరిత్ర
[మార్చు]దీనికి కొంత తేడా ఉన్న పకోడీ, ప్రాచీన సంస్కృత గ్రంధాల లోనూ , తమిళుల సంగం సాహిత్యం లోనూ కనపడుతోంది కానీ తయారు చేసే విదానం అక్కడ స్పస్టం గా చెప్పలేదు. [10] [11]దినుసులతో చేసి, కూరగాయాలతో పాటు నూనెలో వేయించిన గుండ్రని భక్ష్యం, భోజనలో భాగంగా చెప్పారు . ప్రధామంగా పకోడీలు, ‘పరిక’ అన్న పేరుతో శనగ పిండి, కాయగూరలతో తయారు చేసే విధానం మానసోల్లాసం అనే క్రీస్తు శకం [12]1130 నాటి పుస్తకంలో కనపడు తోంది . ‘లోకోపకార’ అనబడే క్రీస్తు శకం 1025 నాటి వంటల పుస్తకంలో కూడా, శనగ పిండిని ఒక అపూర్వమయిన చేప ఆకారంలో వత్తి , అవ నూనెలో వేయించినట్లు ఉంది.
పకోడీలను మసాలా దినుసుల పిండిలో , సాధారణంగా కూరగాయలను ముంచి, ఆపై వాటిని పూర్తిగా వేయించి తయారు చేస్తారు. పకోడా యొక్క సాధారణ రకాలు ఉల్లిపాయ, మినప్పప్పు, శనగ , బొంబాయి రవ్వ, చికెన్, కంద , పాల కూర, మెంతి కూర , వంకాయ, బంగాళాదుంప, మిరపకాయ, , పనీర్, కాలీఫ్లవర్, పుదీనా, అరటి , బేబీ కార్న్ వాము ఆకు మొదలయినవి. ఇది పరిపూర్ణమయిన జాబితా కాదు . .[14][15][16]
పిందిలలో సాధారణంగా సెనగ పిండి లేదా సెనగ పిండిని, బియ్యం పిండిని కలిపి తయారు చేస్తారు, ఇవే కాకుండా మూల పదార్ధాం కోసం గోధుమ, బియ్యం పిండి, లాంటివి కూడా వాడుతారు. పిండిలో ఉపయోగించే మసాలా దినుసులు వంట చేసేవారి వారి ఇష్టానుసారంగాను, స్థానిక సంప్రదాయం లేదా లభ్యత కారణంగా ఎంచుకోవచ్చు-తరచుగా వీటిలో మిరపకాయలు, మెంతులు, అల్లం, ఏలకులు, పసుపు, కొత్తిమీర వంటి తాజా, ఎండిన మసాలా దినుసులను కలుపుతూ ఉంటారు.[17]
వివిధ ప్రాంతాల్లో దీని పేరు
[మార్చు]ఈ వంటకాన్ని అనేక రాష్ట్రాలల్లో అనేక పేర్లతో పిలుస్తారు. ఆంగ్లంలో పకోడీని ఫ్రీట్టర్ అని అంటారు.[18] . తమిళనాడు [19], శ్రీలంక లలో పకోడా లేదా బజ్జీ అని, గుజరాత్ రాష్ట్రంలో భజియా అని, మహారాష్ట్ర భాజీ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్/తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాలలో బజ్జీ లేదా పకోడీ అని పిలుస్తారు. బెంగాల్ లో కొన్ని ప్రాంతాల్లో దీనిని 'పకోడైన్' అని పిలుస్తారు. ఈ రాష్ట్రాల్లో 'ఝలపిత' అంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, సెనగ పిండిలో కలిపిన మసాలా దినుసుల తో వేయించిన బంతులుగా అర్థం చేసుకోవచ్చు. [20]మణిపూర్ లో దీనిని బోరా అని పిలుస్తారు. ఉత్తర ప్రదేశ్ లో 'కోరా ఉరద్ కా బడా' అంటారు. రాజస్థాన్ లో దీని పేరు 'పౌష్ బడా'. [21]మహా రాష్ట్ర లో పండగ సమయాల్లో 'అనార్సేను'చేస్తారు. ఇవన్నీ మాన పకోడీ నుండి కొద్ది తేడాలతో ఉంటాయి.
పకోడీ పై సాహిత్యం
[మార్చు]'మహాకవి శ్రీ శ్రీ 1934 లోనే 'ఋక్కులు' అన్న గేయం లో "కాదేదీ కవిత కనర్హం" ఆన్నారు[22]. అందుకనే పకోడీ మీద కూడా కవిత్వాలు పుట్టుకొచ్చాయి. చి లకమర్తి వారు ఒక సాయంకాలం నాడు తన స్నేహితులతో ఇష్టాగోష్టిలో పాల్గొంటూ వేడి వేడి పకోడీలను సేవిస్తుండగా 'పకోడీల' గురించి పద్యం చెప్పమని మిత్రులు కోరడంతో "కవులకు అక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది. పద్యమునకు పకోడినిచ్చెడి దుర్దినములు వచ్చినవి" అని హాస్యోక్తులు విసరి ఆయన పకోడిపై పద్యాలు చెప్పారు. అందులో మచ్చుకి రెండు పద్యాలు. ఇవి సులభంగా అర్థం చేసుకోవచ్చు.[23]
ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ
ముందర దిగదుడుపున కని
యందును సందియము కలుగ దరయ పకోడీ !
ఆ రామానుజు డాగతి
పోరున మూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడు, గాక, య
య్యారె నిను గొనిన బ్రతుకడట పకోడీ !
అలాగే ప్రఖ్యాత ప్రవచన కర్త గరికపాటి వారు చల్లని సాయంత్రం తను తినే పకోడీ మీద చాటు పద్యాలు చెప్పారు. అందులోనుండి రెండు పద్యాలు [24]
బంగారు బిందువు పొంగరి రంగారి సింగరమై పాత్ర సిగ్గు పడియే
పచ్చి మిరప ముక్క పంటికిందను జేరి కోరి తెచ్చిన బాధ కోరుకుమానియే
ఉల్లిపాయాల ఘాటు ఊర్వశీ ప్రణయమై ఒక వంక కన్నీటి నూరాడించే
కొరకొరా చూచుచూ కరకరా నములుఛూ గుండె నాలుక పైన తాండవించె
సందేవేళనందు సావాస గాళ్లతో
కవితతో పకోడీ కలిపి తినుమా
తెలుగు తల్లి దాల్చు తెలతెల్ల చీర పై
పైడిపూలు ఈ పకోడీ గుళ్ళు
ఇలాగే ఆధునిక కవులెందరో పకోడీ ఘనతను కొనయాడారు .
వివిధ సంప్రదాయాలలో పకోడీలు
[మార్చు]అదృష్టవశాత్తూ, చాలా మంది ప్రజలు అన్ని రకాల పకోడీలను ఆస్వాదిస్తూ, వారి ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకుంటున్నారు. నిజానికి కొన్ని పకోడీలు, వడ వంటకాలు పురాతనమైనవి. ఈ బాగా వేయించిన చిరుతిళ్లలో కొన్ని మన మతపరమైన ఆచారాలలో భాగంగా ఉన్నాయి, రాజస్థాన్‌లోని దేవాలయాలలో ప్రసాదంగా పంపిణీ చేయడానికి పుష్యమాసంలో 'పౌష్ బడాను' తయారు చేస్తారు.[25] ఇది పుష్య మాసం లోని కృష్ణ పక్ష పాడ్యమి నాడు జరిగే పండగ అయినప్పటికీ శీతా కాలాన్ని ఆహ్వానిస్తూ నెలంతా జరపు కుంటారు.[26]యుపి, బీహార్‌లో శ్రావణ మాసంలో, మహారాష్ట్రలో దీపావళి సమయంలో 'అనార్సేను' [27]తయారు చేస్తారు. ప్రతి సగటు భారతీయ కుటుంబం ఇంట్లో భోజనం, చిరుతిళ్లు వండాలని నమ్ముతుంది. పకోడీలు తయారు చేయడానికి అత్యంత సులభం.అంతే కాక, నూనె, దీనుసల నాణ్యతా పాటించవచ్చు.
పకోడీలు- పోషక విలువలు
[మార్చు]ప్రఖ్యాత పోషక శాస్త్ర వేత్త సంగీత ఖన్నా, 200 ల రకాల పకోడీల తయారీ పుస్తకం రాసి తాను పకోడీల మీద ఇలా అన్నారు.[28]
పురాతన చిరు తిళ్ళు ఇప్పటికీ సందర్భోచితంగా ఉండటానికి ఒక కారణం ఉంది. దాని ఉపాయం, మంచి నాణ్యత గల కోల్డ్-ప్రెస్డ్ నూనెలను ఉపయోగించడం. ఈ పకోడీలు ఎక్కువగా పప్పులతో తయారు చేయబడతాయి కాబట్టి, అవి గ్లూటెన్ రహితంగా ఉంటాయి, ఏవైనా అలెర్జీలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొన్ని పకోడీలు విత్తనాలు, గింజలతో కూడా తయారు చేయబడతాయి, కొన్ని అడవిలో సేకరించిన ఆకుకూరలతో, మరికొన్ని అస్పష్టమైన ముడి పదార్థాలతో తయారు చేయబడతాయి. అవి అన్ని రకాల ఆహార ప్రాధాన్యతలకు సరిపోతాయి. కొన్ని వేయించిన పకోడీలు కేలరీలు అధికంగా ఉంటాయి, కానీ అవి భోజనం లేదా చిరుతిండిగా చాలా సంతృప్తికరంగా ఉంటాయి. మరీ తిండిపోతులయితే తప్ప, రోజు ఎక్కువ కేలరీల తీసుకోవడం అరుదుగా ఉంటుంది. కాకపోతే. చాయ్ లేదా కాఫీతో ఒకరు అనుకోకుండా తినే కుకీలు, బ్రౌనీలతో వాటిని పోల్చండి లేదా డైటర్స్ క్లబ్‌లలో తిరుగుతున్న ఏదైనా ఇతర తక్కువ కేలరీల లేదా తక్కువ కొవ్వు స్నాక్‌తో పోల్చినప్పుడు పకోడీలు ఎంత ఆచరణాత్మకమైన ఆహార నీయంత్రకులో అని మీరు గ్రహిస్తారు. [
చిత్రమాలిక
[మార్చు]- శనగ పిండిలో వేయించిన పకోడీలు
- పుదీన చట్నీ తో ఉల్లిపాయ పకోడీలు
- చికెన్ పకోడీలు
- దగ్గర నుంచి పాలకూర పకోడీలు
- ఉల్లిపాయ పకోడీలు
- బ్రెడ్ పకోడీలు
- జయపూర్ లో అమ్మే పకోడీలు
- ఇంకో రకం చికెన్ పకోడీలు
- కడీ అనే పెరుగు తో చేసి, అన్నం తో తినే దాంట్లో వేసే పకోడీలు
- పాలకూర పకోడీలు
- కడీ పకోడీలు : వీటిని అన్నం తో కానీ రొట్టెలతో కానీ తినవచ్చు
మూలాలు
[మార్చు]- ↑ "Pakora - food". Britannica.com. Retrieved 23 January 2018.
- ↑ Bloom, Leora Y. (10 May 2016). "Pakoras are tasty, versatile treats from the Indian subcontinent that work well as appetizers, snacks or meals". The Seattle Times. Retrieved 23 January 2018.
- ↑ Sanghvi, Vir (18 April 2015). "Take pride in the bonda or pakora. It is our gift to the world". Hindustan Times. Retrieved 23 January 2018.
- ↑ "Hot Pink Puris and Onion Pakoras - the Brightest Snack You've Ever Seen?". 29 August 2013.
- ↑ "Onion Soft Pakodi | Methati Pakodi Recipe | Andhra Style Onion Pakodi". vismaifood.com. Retrieved 2025-12-08.
- ↑ Devi, Yamuna (1999). Lord Krishna's Cuisine: The Art of Indian Vegetarian cooking. New York: E. P. Dutton. pp. 447–466, Pakoras: Vegetable Fritters. ISBN 0-525-24564-2.
- ↑ "Pakodi Bandi, Visakhapatnam - Restaurant menu, prices and reviews". Restaurant Guru (in Indian English). 2025-10-13. Retrieved 2025-12-08.
- ↑ R. S. McGregor, ed. (1997). The Oxford Hindi-English Dictionary. Oxford University Press. p. 588. ISBN 978-0-19-864339-5.
- ↑ Monier-Williams, Monier (1995). A Sanskrit-English Dictionary. New Delhi: Motilal Banarsidass. p. 914. ISBN 81-208-0065-6. Retrieved 30 June 2010.
- ↑ Monier-Williams, Monier (2002). A Sanskrit-English dictionary. Ernst Leumann, Carl Capeller (Corrected edition, new edition, greatly enlarged and improved ed.). Delhi: Motilal Banarsidass. ISBN 978-81-208-0065-6.
- ↑ "Canadian Food Spending Habits". Canadian Institute of Food Science and Technology Journal. 14 (3): 160–161. 1981-07. doi:10.1016/s0315-5463(81)72748-2. ISSN 0315-5463.
{{cite journal}}: Check date values in:|date=(help) - ↑ – via Wikisource.
- ↑ "చేద్దాం రండి... పసందైన పకోడి." EENADU. Retrieved 2025-12-08.
- ↑ "Masoor Dal Pakora Recipe". 27 August 2022. Retrieved 9 Jan 2023.
- ↑ "Suji Pakora Recipe". 22 September 2022. Retrieved 5 Feb 2023.
- ↑ Siddiqi, Kamran (19 May 2016). "Mom's Onion Pakora Recipe". Sophisticated Gourmet. Sophisticated Gourmet. Retrieved 24 May 2020.
- ↑ Dalal, Tarla. "31 pakora recipes | collection of pakoda recipes | veg Indian fritters |". www.tarladalal.com (in ఇంగ్లీష్). Retrieved 2025-12-09.
- ↑ "What is Pakoda Called in English?". Jagranjosh.com (in ఇంగ్లీష్). 2025-08-09. Retrieved 2025-12-09.
- ↑ "Pakora in different languages". indifferentlanguages.in. Retrieved 2025-12-09.
- ↑ "bora dish in manipur india". Bing. Retrieved 2025-12-09.
- ↑ "FoodyBunny: पारंपरिक अनारसे रेसिपी | Anarse Recipe Marathi". FoodyBunny (in మరాఠీ). Retrieved 2025-12-09.
- ↑ telugu, NT News (2024-04-14). "కాదేది కవితకనర్హం". www.ntnews.com. Retrieved 2025-12-09.
- ↑ https://hasya-sabha.quora.com/%E0%B0%AA%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B1%80-%E0%B0https://hasya-sabha.quora.com/%E0%B0%AA%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B1%80-%E0%B0%AA%Ehttps://hasya-sabha.quora.com/%E0%B0%AA%E0%B0%95%E0%B1%8B%E0%B0%A1%E0%B1%80-%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%810%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81[permanent dead link]
- ↑ https://www.eenadu.net/telugu-news/general/garikapati-poetry-on-mouth-watering-pakodi/0600/121195141
- ↑ "Largest Festival of Jaipur". BhaktiBharat.com (in ఇంగ్లీష్). Retrieved 2025-12-08.
- ↑ "Largest Festival of Jaipur". BhaktiBharat.com (in ఇంగ్లీష్). Retrieved 2025-12-08.
- ↑ "Anarase ((अनरसे) – Maharashtrian Specialty Sweet Crispy Indian Pastry | My Family Recipes" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-12-09.
- ↑ https://www.thehindu.com/life-and-style/food/how-pakodas-are-healthier-than-processed-snacks/article29497592.ece