చికెన్ 65

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చికెన్ 65

ఇది ఒక చైనీస్ వంటకం.ఎలా చేస్తారొ చూద్దాం.

కావలసిన పదార్దాలు[మార్చు]

 1. బోన్ లెస్ చికెన్ -పావు కిలో.
 2. మైదా-3 స్పూన్స్
 3. కార్న్ ఫ్లోర్-3 స్పూన్స్
 4. కోడి గుడ్డు-1
 5. అల్లం వెల్లుల్లి పేస్ట్-2 స్పూన్స్
 6. కారం-1 స్పూన్
 7. అజినోమోటో-అర స్పూన్
 8. సోయా సాస్-4 స్పూన్స్
 9. ఎరుపు ఫుడ్ కలర్
 10. ఉప్పు-తగినంత
 11. గరం మసాలా-1 స్పూన్
 12. కొత్తి మీర,కరివేపాకు-తగినంత
 13. పచ్చి మిరపకాయలు-3
 14. నూనె (డీప్ ఫ్రైకు సరిపడా)

తయారు చేయు విధానం[మార్చు]

చికెన్,మైదా,కార్న్ ఫ్లోర్,గుడ్డు,ఉప్పు,కారం,అజినోమోటో అన్ని బాగా కలిపి 2 గంటలు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత కళాయులో నూనె పోసి బాగా వేడెక్కాక ఒక్కొక్క చికెన్ ముక్కను పిండితో ముంచి నూనెలో ఫ్రై చేసి తీయాలి.

ఇప్పుడు వేరే మూకుడులో కాస్త నూనె వేసి కాగాక పచ్చిమిరప,కరివేపాకు,అల్లం వెల్లుల్లి పేస్ట్,సోయాసాస్,అజినోమోటో,ఫుడ్ కలర్, పెరుగు వేసి వేయించిన చికెన్ ముక్కలను అందులో వేసి కాసేపు వేయించి దించేయాలి.పైన కొత్తిమీర,నిమ్మకాయ,ఉల్లి పాయముక్కలతో అలంకరించాలి.అంతే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ చికెన్ 65 తయారు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చికెన్_65&oldid=1995035" నుండి వెలికితీశారు