Jump to content

మజ్జిగ పులుసు

వికీపీడియా నుండి
మజ్జిగ పులుసు

మజ్జిగ పులుసు మజ్జిగ, కూరగాయముక్కలతో చేయబడిన శాకాహారం వంటకం. ముఖ్యంగా మనం " ఆవకాయ, మాగాయ " పచ్చళ్ళు తినేటప్పుడు ఈ పులుసును నంచుకు తింటే చాలా రుచిగా ఉంటుంది అని కొందరు భావిస్తారు. [1]

[2] చాలా మందికి " మజ్జిగ పులుసు " తెలిసే ఉంటుంది. ఎక్కువ మంది తినే ఉంటారు. ముందుగా పెరుగును కొద్దిగా నీళ్ళు పోసుకుని, మిక్సీలో వేసి చిక్కని మజ్జిగను తయారుచేసుకుని వెడల్పాటి గిన్నెలో పోసుకుని ప్రక్కన పెట్టి ఉంచుకోవాలి. సామాన్యంగా, మజ్జిగ పులుసు అంటే ఇంట్లో మిగిలిన పెరుగు, మజ్జిగతో మాత్రం ఎక్కువమంది చేసుకుంటూ ఉంటారు. పులుపుగా కావాలనుకునేవారు పుల్లని పెరుగు మజ్జిగ చేసుకుని వాడుకోవచ్చు. తయారు చేసుకున్న మజ్జిగలో కొద్దిగా సరిపడా పసుపు వేసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు

[మార్చు]
  1. మజ్జిగ
  2. సొరకాయ
  3. టమాటా
  4. పచ్చి మిరపకాయ
  5. శనగపిండి
  6. జీలకర్ర
  7. ఉప్పు
  8. కొత్తిమీర
  9. నూనె
  10. ఆవాలు
  11. ఎండు మిర్చి
  12. మెంతులు
  13. కరివేపాకు
  14. ఇంగువ

తయారీ విధానం

[మార్చు]

సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవి అన్నీ తక్కువ నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత, చిక్కటి, కమ్మటి మజ్జిగ తీసుకుని అందులో కొద్దిగా శనగపిండి, 1/2 స్పూను జీలకర్ర పొడి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న ముక్కల్లో ఈ మజ్జిగను పోయాలి. పులుసుకు సరిపడ ఉప్పు వేసి కొద్దిగా మరగనివ్వాలి. చివరగా కొత్తిమీర స్టవ్ కట్టేయాలి. [3] [4]

తింటే చాలా రుచిగా ఉంటుంది, ప్రతిరోజు కావాలని కోరుకునే వారు కూడా ఉండే ఉంటారు. మజ్జిగ పులుసు శరీరానికి చలువ చేస్తుంది.

తాలింఫు సామాను

[మార్చు]

మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ (కొద్దిగా), కరివేపాకు.

బేసిన్ వేడి చేసి, నెయ్యి/నూనె వేడి ఎక్కాక, తాలింఫు సామాను వరుసగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ (కొద్దిగా), కరివేపాకు వేసి దోరగా వేయించాలి, వేడిగానే దీన్ని పులుసులో వేసుకోవాలి. (ఇంకాస్త కారం కావాలనుకునే వారికి అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసుకుంటే సరిపోతుంది) [5] [6]

మజ్జిగ పులుసు రకాలు

[మార్చు]
  • వాము ఆకు మజ్జిగ పులుసు
  • బొబ్బాయి మజ్జిగ పులుసు
  • బంగాళాదుంప మజ్జిగ పులుసు
  • బెండకాయ మజ్జిగ పులుసు
  • తోటకూర మజ్జిగ పులుసు
  • బచ్చలి మజ్జిగ పులుసు
  • సీమవంకాయ మజ్జిగ పులుసు

సలహాలు,సూచనలు, జాగ్రత్తలు

[మార్చు]
  1. మజ్జిగ పులుసు పొంగకుండా ఉండేందుకు గరిటతో బాగా కలుపుతూ ఉండాలి.
  2. పొంగి పోయిన మజ్జిగ పులుసు రుచిలో బాగా తేడా వస్తుంది.
  3. కొత్తిమీర ఎప్పుడూ వంట చివర్లో వేసుకోవాలి.
  4. ముందుగా స్టవ్ మీద మజ్జిగ వేడి చేయకూడదు. మజ్జిగ విరిగి పోతాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-04-11. Retrieved 2018-03-22.
  2. http://telugu.webdunia.com/article/cookery-tips/మజ్జిగ-పులుసు-రుచిగా-108112500080_1.htm[permanent dead link]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-06. Retrieved 2018-03-22.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-25. Retrieved 2018-03-22.
  5. http://www.telugunris.com/vantakaalu/మజ్జిగ-పులుసుandhrakadi[permanent dead link]
  6. http://prabhanews.com/2016/09/మజ్జిగ-పులుసు/[permanent dead link]

చిత్రమాలిక

[మార్చు]