సొర కాయ

వికీపీడియా నుండి
(సొరకాయ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సొరకాయ
Green calabash on the vine
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
లా. వల్గారిస్
Binomial name
లాజినేరియా వల్గారిస్
(Molina) Standl.
Lagenaria siceraria var peregrina

సొరకాయ లేదా అనప కాయ లేదా అనగ కాయ.

సొరకాయ - Lagenaria దీర్ఘకాలంగా సతాయిస్తున్న N.O. కుకుర్బిటేసి..

అనగ వేదకాలమునుండి ఈ దేశమున సాగుచేయబడుచున్న జాతి కూరగాయ!.

భౌతిక స్వరూపము

[మార్చు]

సొర కాయ అనుకూల పరిస్థితులలో మిక్కిలి విరివీగా ప్రాకు మోటుజాతి మలితీగలు రెండుగా చీలియుండును. పూవులు బీర పూవులకంటే కొంచెం పెద్దవి. మగ పూవులయందు పుష్పకోశము పొడవుగా ఉండును. ఆకర్షక పత్రములు క్రిందివరకు విడియుండును. తెలుపు, కింజల్కములు అన్నియూ జేరి యుండును. ఆడుపూవున దళవలయమును, పుష్పకోశమును నిడివియైన యండాశయముపై నమరియుండును.

రకములు

[మార్చు]
సొరకాయ

గుండ్రని

[మార్చు]

తెలుపు

[మార్చు]

నలుపు

[మార్చు]
దస్త్రం:Sora kaayalu.JPG
పొడవు సొరకాయలు

సాగు చేయుపద్దతి

[మార్చు]
సొరకాయ పోపు కూర

ఇవి అన్ని నేలలయందు పెరుగును. మంచిగా దున్నిన తరువాత సిద్దము చేసిన నేలలో2.5 - 3.5 మీటర్ల గోతులు తీసి వీటిని పెంచవలెను. ఆ గోతులలో పసువుల ఎరువును వేయవలెను.

విశేషములు

[మార్చు]

ఎండిన సొర కాయపై తొడుగును, సొర కాయ బుర్ర అని పిలుస్తారు, దీనిలో నీరు పోసుకొని పొలాలకు తీసుకొని వెళ్ళు అలవాటు ఉంది. అందులో నీరు చల్లగా ఉంటాయి. దీనిని మనము నాచురల్‌ వాటర్‌ బాటిల్‌, నాచురల్‌ మినీ కూలర్‌గా ఉపయోగించవచ్చు!

గుండ్రని సొర బుర్రలను వీణలుగా కూడా చేయుదురు.

వంటలు

[మార్చు]
సొరకాయ పప్పు
  1. సొరకాయ వడియాలు
  2. సొరకాయ పులుసు
  3. సొరయాక టమాటో కూర
  4. సొరకాయ సాంబారు

దీనిలో పెద్దగా పోషక విలువలు లేవు, మరియూ ఇది ఆలశ్యముగా జీర్ణమగును. నీరు ఎక్కువ.

ఔషధ గుణాలు

[మార్చు]

సొరకాయ లేదా అనప కాయ లేదా అనగ కాయ. ఆంగ్లములో Bottle gourd - (Lagenaria vulgaris N.O. Cucurbitaceae) అంటాము . అనప వేదకాలమునుండి ఈ దేశమున సాగుచేయబడుచున్న జాతి కూరగాయ!. విటమిన్ - సి, బి.కాంప్లెక్క్ష్, సొరకాయలో లభిస్తాయి . సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, సులువుగా జీర్ణమవుతుంది .డయూరెటిక్ గా పనిజేస్తుంది . ముత్రనాళాల జబ్బులకు ఇది మంచిది . పచ్చిసొరకాయ రసం దాహార్తిని అరికడుతుంది, అలసటను తగ్గిస్తుంది . భౌతిక స్వరూపము సొర కాయ అనుకూల పరిస్థితులలో మిక్కిలి విరివిరిగా ప్రాకు మోటుజాతి . మలితీగలు రెండుగా చీలియుండును. పూవులు బీర పూవులకంటే కొంచెం పెద్దవి. మగ పూవులయందు పుష్పకోశము పొడవుగా ఉండును. ఆకర్షక పత్రములు క్రిందివరకు విడియుండును. తెలుపు, కింజల్కములు అన్నియూ జేరి యుండును. ఆడు పూవున దళవలయమును, పుష్పకోశమును నిడివియైన యండాశయముపై అమరియుండును. సాగు చేయుపద్ధతి ఇవి అన్ని నేలలయందు పెరుగును. మంచిగా దున్నిన తరువాత సిద్దము చేసిన నేలలో2.5 - 3.5 మీటర్ల గోతులు తీసి వీటిని పెంచవలెను. ఆ గోతులలో పసువుల ఎరువును వేయవలెను. విశేషములు ఎండిన సొర కాయపై తొడుగును, సొర కాయ బుర్ర అని పిలుస్తారు, దీనిలో నీరు పోసుకొని పొలాలకు తీసుకొని వెళ్ళు అలవాటు ఉంది. అందులో నీరు చల్లగా ఉంటాయి. దీనిని మనము నాచురల్‌ వాటర్‌ బాటిల్‌, నాచురల్‌ మినీ కూలర్‌గా ఉపయోగించవచ్చు! గుండ్రని సొర బుర్రలను వీణలుగా కూడా చేయుదురు. పుట్తుక .. చరిత్ర : మానవజాతికి ఏనాడో పరిచయం అయిన అతి ప్రాచీన కూరగాయ సొరకాయ. ఇది పుట్టింది ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ,,, క్రీస్తుపూర్వము 11,000 - 13000 సంవత్సరాల మధ్య పెరూలో తొలిసారి సొరకాయ సాగు జరిగిందని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు . పోషకాలు : 100 గ్రాముల పచ్చి సొరకాయలో ...

శక్తి : 12 కిలో కాలరీలు,
ప్రోటీన్లు : 0.2 గ్రాములు,
కార్బోహైడ్రేట్స్ : 2.5 గ్రాములు,
ఫాట్స్ : 0.1 గ్రాములు,
విటమిన్‌ ఎ : పుస్కలముగా,
విటమిన్‌ సి : పుష్కలముగా .
ఖనిజలవణాలు : పుష్కలముగా,

వంద గ్రాముల సొరకాయలో కేవలం పదిహేను కెలోరీలు మాత్రమే ఉంటాయి. అలాగే పిండి పదార్థాలు అతి తక్కువగా ఉండడం వల్ల మధుమేహం ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం. వేసవికాలంలో సొరకాయలో నీటి శాతం ఎక్కువ కాబట్టి డీహైడ్రేషన్ అవకుండా సహాయపడుతుంది. సొరకాయ చెక్కుతో పీచుపదార్థం కూడా లభ్యమవుతుంది. సొరకాయ చెట్టు ఆకులనుంచి తీసిన రసంలో క్యాన్సర్ ను నియంత్రించే క్వెర్సెటిన్, ఆంత్రక్వినోన్ లాంటి ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి.[2]

వంటలు

[మార్చు]

1. సొరకాయ వడియాలు 2. సొరకాయ పులుసు 3. సొరయాక టమాటో కూర 4. సొరకాయ సాంబారు

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. readme5minutes[1] Archived 2019-03-25 at the Wayback Machine
  2. "సొరకాయ తినడం వల్ల ఉపయోగాలేమిటి?". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-01. Archived from the original on 2022-04-01. Retrieved 2022-04-01.
"https://te.wikipedia.org/w/index.php?title=సొర_కాయ&oldid=3851239" నుండి వెలికితీశారు