Jump to content

ఆవాలు

వికీపీడియా నుండి

ఆవాలు
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
బ్రా. నైగ్రా
Binomial name
బ్రాసికా నైగ్రా

ఆవాలు ముఖ్యమైన మసాలా దినుసులలో ఒకటి.

Brassica spp . పోపు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, కాల్సియం, మాగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉంటాయి . ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్‌ ఎక్కువగా లభిస్తాయి. * ప్రతి వందగ్రాముల ఆవాలలో 9-82గ్రా టోకోఫెనాల్‌ అనే పదార్థం (విటమిన్‌ 'ఇ'కి సమానం) శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా సహాయపడుతుంటాయి. అందుకనే కొంచెంగా ఆవనూనెను కూరల్లో వాడుకోమని వైద్యులు సూచిస్తారు. * ఆవాల్లోని సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. పోపుల్లో వాడినప్పుడు ఆకలిని పెంచి.. ఆహారాన్ని అరిగేటట్లు చేస్తుంటాయి. * గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, తగినంత తేనె వేసి ఇస్తే సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఘాటైన నూనెలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్తప్రసరణను వేగవంతం చేస్తుంటాయి. ఆవాలను దంచి వాపుగల ప్రదేశం, గౌట్‌ నొప్పిపైన పట్టుగా పెడితే ఉపశమనం ఉంటుంది. అరబకెట్‌ వేడినీళ్లలో చెంచా ఆవాల పొడి వేసి కాళ్లను కొద్దిసేపు ఉంచితే పాదాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. * తెల్ల ఆవనూనె చర్మ రంగును మెరుగు పరుస్తుంది. దీన్ని శరీరానికి రాసుకొని, నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గి రంగు తేలుతుంది. అలానే కొబ్బరినూనెలో ఆవనూనెను కలిపి శిరోజాలకు రాస్తుంటే ఫలితం ఉంటుంది.

లక్షణాలు

[మార్చు]
ఆవపిండి
  • విస్తారమైన శాఖలతో పెరిగే ఏకవార్షిక గుల్మము.
  • మూల సంబంధ పత్రాలు, పిచ్చాకార నొక్కులుతో, ప్రకాండ సంబంధ పత్రాలు.
  • అండాకారంగా శాఖాయుత అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న పసుపు పచ్చని పుష్పాలు.

పోషకాలు (వందగ్రాములలో),

[మార్చు]
  • తేమ- 6.5గ్రా,
  • పొటాషియం- 20.3గ్రా,
  • కొవ్వు- 39.7గ్రా,
  • ఖనిజాలు- 2.4గ్రా,
  • పీచు- 4.8గ్రా,
  • పిండిపదార్థాలు- 23.8గ్రా,
  • శక్తి- 541కిలో కెలోరీలు,
  • క్యాల్షియం- 490మిగ్రా,
  • ఫాస్పరస్‌- 700మిగ్రా,
  • ఇనుము- 7.9.
  • టోకోఫెనాల్‌-9-82గ్రా

ఆవ నూనె

[మార్చు]

ఆవాల గింజల నుంచి మూడు రకాలుగా తయారయిన నూనె లకి ఆవాల నూనె లేదా ఆవ నూనె (ఆంగ్లం: Mustard oil) అనే పదాన్ని ఉపయోగిస్తారు:

  1. విత్తనాలను దంచడం ద్వారా వచ్చే క్రొవ్వుతో కూడిన స్థావర నూనె (ఉద్భిజ్జ తైలం),
  2. విత్తనాలను రుబ్బి, నీటితో కలిపి, స్వేదన ప్రక్రియ ద్వారా ఆవశ్యక నూనెని గ్రహించడం వంటి పద్ధతుల ద్వారా లభించే సుగంధ తైలం.
  3. ఆవాల గింజల లభ్యాన్ని సోయాబీన్ నూనె వంటి వేరే స్థావర నూనెతో కలపడం ద్వారా చేసే నూనె.

ఆవ గింజలు

[మార్చు]
mustard seed, yellow
Nutritional value per 100 గ్రా. (3.5 oz)
శక్తి1,964 కి.J (469 kcal)
34.94 g
చక్కెరలు6.89 g
పీచు పదార్థం14.7 g
28.76 g
సంతృప్త క్రొవ్వు1.46 g
మోనోశాచురేటెడ్ కొవ్వు19.83 g
బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు5.39 g
24.94 g
విటమిన్లు Quantity
%DV
విటమిన్ - ఎ
0%
3 μg
థయామిన్ (B1)
47%
0.543 mg
రైబోఫ్లావిన్ (B2)
32%
0.381 mg
నియాసిన్ (B3)
53%
7.890 mg
విటమిన్ బి6
33%
0.43 mg
ఫోలేట్ (B9)
19%
76 μg
విటమిన్ బి12
0%
0 μg
విటమిన్ సి
4%
3 mg
Vitamin E
19%
2.89 mg
విటమిన్ కె
5%
5.4 μg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
52%
521 mg
ఇనుము
77%
9.98 mg
మెగ్నీషియం
84%
298 mg
ఫాస్ఫరస్
120%
841 mg
పొటాషియం
15%
682 mg
సోడియం
0%
5 mg
జింక్
60%
5.7 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు6.86 g
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database

ఆవ గింజలు (Mustard seeds) ఆవ మొక్కల నుండి లభించే చిన్న గుండ్రని విత్తనాలు. ఇది సాధారణంగా 1 or 2 మి.మీ. పరిమాణంలో ఉంటాయి. ఇవి పసుపు పచ్చని తెలుపు నుండి నలుపు మధ్య రంగులలో ఉంటాయి. ఇది మూడు రకాల మొక్కలనుండి లభిస్తాయి: నల్లని ఆవాలు (Brassica nigra) నుండి, బ్రౌన్ ఆవాలు (Indian mustard) (Brassica juncea) నుండి, తెల్లని ఆవాలు (Brassica. hirta/Sinapis alba) నుండి తీస్తారు.* ఆవాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. కారణం వీటిలోని ఘాటైన ద్రవ్యాలు పైత్యాన్ని పెంచుతాయి. కడుపు మంట, చర్మ సమస్యలు ఉన్నవారు పోపులకే పరిమితమైతే మంచిది. * మరీ అధికంగా తీసుకొంటే పైత్యం చేసి శరీర వేడిని పెంచుతాయి. దురదలు మంటలు పెరుగుతాయి, కొన్నిసార్లు కడుపులో రక్తం విరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలం, వేడి శరీరం కలవారు మితంగా తీసుకుంటే మంచిది. విరుగుడు మజ్జిగ, పెరుగు.

వైద్య పరం గా ఉపయోగాలు :

[మార్చు]
  1. పంటి నొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కొంత సేపు తర్వాత ఆ నీటిని పుక్కలేస్తే నొప్పి తగ్గుతుంది .
  2. ఆవాలపోడితో జుట్టు కడుక్కూంటే .. జుట్టు రాలడం తగ్గుతుంది ..
  3. పేలు తగ్గదానికు తగ్గదనికు ఆవాల పొడి నునే రాసుకోవాలి .
  4. మాడు మీద కురుపులు, దురదలను అవ్వలు తగ్గిస్తయాయి .
  5. ఉబ్బసం వ్యాధి ఉపశమనానికి ఆవాలను కొద్దిగా చెక్కెరతో కలిపి తీసుకోవాలి.
  6. ఆవాల పొడిని తేనేతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలను పరిస్కరించవచ్చును .
  7. మందంగా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్దా రాస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి .
  8. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు .. ఆవాల ముద్దా, కర్పూరము కలిపి బాధించే ప్రాంతమము మీద రాయటం వల్ల బాధ తగ్గుతుంది .
  9. ఆవాలులో సెలీనియం అనే రసాయనం వలన మనకు యాంటీ ఇంఫ్లమేటరీ ప్రయోజనాలు ఉన్నాయి. ఆవాలలోని మెగ్నీషియం అస్థమా, కీళ్ళ వాతం, రక్త పోటును తగ్గించును.
  10. ఇవి పార్శవ నొప్పిని తగ్గిస్తాయి.
  11. ఆవనూనె పూర్తిగా సహజసిద్ధమైనది. దీనిని మన శరీరం సులభంగా జీర్ణం చేస్తుంది. అంతే కాకుండా ఇది గట్ బ్యాక్టీరియాకు మేలు చేయడమే కాకుండా..  జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

వాడకూడని పరిస్తితులు :

[మార్చు]
  • జీర్ణ కోశ అల్సర్లు, కిడ్నీ జబ్బులు ఉన్నా వారు
  • దీని వేపర్స్ (పొగలు) కంటికి తగిలితే కన్ను ఇర్రిటేట్ అగును .
  • ఆరు సం. లోపు పిల్లలకు ఇవ్వకూడదు .

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]

—డా|| పెద్ది రమాదేవి-ఆయుర్వేదిక్‌ ఫిజీషియన్‌-ఫోన్‌:9246276791

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆవాలు&oldid=3912007" నుండి వెలికితీశారు