విటమిన్ బీ12

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విటమిన్ బీ12
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
α-(5,6-dimethylbenzimidazolyl)cobamidcyanide
Clinical data
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి POM (UK) OTC (US)
Routes oral, IV, IM
Pharmacokinetic data
Bioavailability Readily absorbed in distal half of the ileum
Protein binding Very high to specific transcobalamins plasma proteins
Binding of hydroxocobalamin is slightly higher than cyanocobalamin.
మెటాబాలిజం hepatic
అర్థ జీవిత కాలం Approximately 6 days
(400 days in the liver)
Excretion Renal
Identifiers
CAS number 68-19-9 checkY
ATC code B03BA01
PubChem CID 5479203
DrugBank DB00115
ChemSpider 10469504 checkY
KEGG D00166 checkY
ChEMBL CHEMBL1697777 ☒N
Chemical data
Formula C63H88CoN14O14P 
Mol. mass 1355.37 g/mol
  • NC(=O)C[C@@]8(C)[C@H](CCC(N)=O)C=2/N=C8/C(/C)=C1/[C@@H](CCC(N)=O)[C@](C)(CC(N)=O)[C@@](C)(N1[Co+]C#N)[C@@H]7/N=C(C(\C)=C3/N=C(/C=2)C(C)(C)[C@@H]3CCC(N)=O)[C@](C)(CCC(=O)NCC(C)OP([O-])(=O)O[C@@H]6[C@@H](CO)O[C@H](n5cnc4cc(C)c(C)cc45)[C@@H]6O)[C@H]7CC(N)=O
  • InChI=1S/C62H90N13O14P.CN.Co/c1-29-20-39-40(21-30(29)2)75(28-70-39)57-52(84)53(41(27-76)87-57)89-90(85,86)88-31(3)26-69-49(83)18-19-59(8)37(22-46(66)80)56-62(11)61(10,25-48(68)82)36(14-17-45(65)79)51(74-62)33(5)55-60(9,24-47(67)81)34(12-15-43(63)77)38(71-55)23-42-58(6,7)35(13-16-44(64)78)50(72–42)32(4)54(59)73–56;1–2;/h20-21,23,28,31,34-37,41,52-53,56-57,76,84H,12-19,22,24-27H2,1-11H3,(H15,63,64,65,66,67,68,69,71,72,73,74,77,78,79,80,81,82,83,85,86);;/q;;+2/p-2/t31?,34-,35-,36-,37+,41-,52-,53-,56-,57+,59-,60+,61+,62+;;/m1../s1 checkY
    Key:RMRCNWBMXRMIRW-WYVZQNDMSA-L checkY

 ☒N (what is this?)  (verify)
Methylcobalamin (shown) is a form of vitamin B12. Physically it resembles the other forms of vitamin B12, occurring as dark red crystals that freely form cherry-colored transparent solutions in water.

మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిన్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, నోటి పుండు, మూత్రం ఆపుకోలేకపోవటం, రక్తపోటు తక్కువ కావటం, కుంగుబాటు, మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలాల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలాకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్టు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాలా త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది.

విటమిన్ బీ12 లోపం[మార్చు]

విటమిన్‌ బీ 12 మీ శరీర పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పోషకలోపం వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాళ్లు నొప్పులు, స్కిన్‌ డిసీజెస్‌, గుండె సంబంధిత సమస్యలు, చిరాకు, వికారం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలుంటాయి. ఇవి మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి[1].

విటమిన్ బీ12 లోపించిన లక్షణాలు[మార్చు]

  • చర్మం పొడిబారడం
  • మలబద్దకం
  • ఇన్సోమియా లేదా నిద్రలేమి
  • ఆలోచనలో మార్పులు, త్వరగా చీరాకు పడడం
  • జుట్టు రాలడం, జుట్టు రంగుమారడం లేదా పలచన అవ్వడం
  • మానసిక ఒత్తిడి , తడబాటు
  • నోటి అల్సర్
  • మతిమరుపు
  • శ్వాసలో ఇబ్బంది, బరువు తగ్గడం
  • అలసట, శరీరంలో శక్తి తగ్గడం[2]

వృద్దులలో సమస్యలు[మార్చు]

వృద్ధుల్లో తికమక పడటం, మతిమరుపు వంటి లక్షణాలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిన్ లోపమూ కారణం అవుతుండొచ్చు.ఎందుకంటే వయసు మీద పడుతున్నకొద్దీ మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిన్‌ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడటం, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి వృద్ధుల్లో కనిపిస్తే వయసుతో పాటు వచ్చే లక్షణాలుగానే చాలామంది పొరపడుతుంటారు. అందుకె బీ12 విటమిన్ తీసుకొవాలి.

లభించే పదార్థాలు[మార్చు]

  • ఆహారం పదార్థాల్లో కేవలం మాంసంలో.. ముఖ్యంగా కాలేయంలో బీ12 అధిక మొత్తంలో ఉంటుంది.
  • సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిన్ లభిస్తుంది.
  • చేపలు, షెల్‌ఫిష్‌లో కూడా ఎక్కువగానే ఉంటుంది.
  • పాల పదార్థాలు, గుడ్లు, చికెన్‌లో కాస్త తక్కువ.
  • మాంస పదార్థాల్లో ఈ బీ12 విటమిన్ ప్రోటీన్లతో కలిసిపోయి ఉంటుంది.
  • జీర్ణాశయంలోని ఆమ్లం ఇది విడుదలయ్యేలా చేస్తుంది.
  • అయితే వయసుతో పాటే జీర్ణాశయంలోని ఆమ్లం స్థాయీ తగ్గుతుండటం వల్ల వృద్ధాప్యంలో బీ12ను గ్రహించే శక్తీ మందగిస్తుంది.
  • ఇక శాకాహారంలో బీ12 చాలా తక్కువగా ఉండటమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బీ12 మాత్రలు వేసుకోవాలి.

రోజుకు ఎంత విటమిన్ B12 అవసరం[మార్చు]

  • ఆరోగ్యవంతమైన పెద్దవారిలో బి12 విటమిన్ యొక్క సగటు రోజువారీ అవసరం 2.4 మైక్రోగ్రాములు. మీరు సహజంగా b12 తీసుకుంటే, అది నీటిలో కరిగేది కాబట్టి మొత్తం 2.4 mcg కంటే ఎక్కువగా ఉంటుంది. మీ మూత్రపిండాలు అదనపు బి12 మొత్తాన్ని కరిగించి మూత్రం ద్వారా విసర్జిస్తాయి.

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://tv9telugu.com/lifestyle/b12-vitamin-benefits-120064.html
  2. https://vedix.com/blogs/articles/vitamin-b12-deficiency-hair-loss#vitamin-b12-deficiency-symptoms