ఆకలి
ఆకలి అంటే ఏదైనా తినాలి అనిపించే ఒక భావన. కాలేయములో గ్లైకోజన్ ఒక నిర్ధిష్ట స్థాయి కంటే తగ్గినప్పుడు కలిగే అనుభూతిని ఆకలి (Hunger) అంటారు. ఆకలి వేసిన వెంటనే తినవలెననే కోరిక కలుగుట సహజము. ఈ ఇబ్బందికరమైన అనుభూతి హైపోథాలమస్ నుండి ఉద్భవించి కాలేయములోని రిసెప్టార్స్ ద్వారా శరీరములోనికి విడుదల అవుతుంది. ఒక సాధారణ మానవుడు ఆహారము తీసుకోకుండా వారముల తరబడి బ్రతకగలిగినా, [1] ఆకలి అనే భావన మాత్రం ఆహారములేని రెండు గంటల నుండి మొదలౌతుంది.
ఆకలి నొప్పులు
[మార్చు]ఆకలి సంకోచములు కడుపులో కలిగినప్పుడు వాటిని ఆకలి పోటులు (Hunger pains) అంటారు. సాధారణంగా పస్తు ఉన్నప్పుడు చివరిసారి ఆహారము తీసుకున్న 12 నుండి 24 గంటల తరువాత గాని ఆకలి పోటులు ప్రారంభం కావు. ఒక ఆకలి సంకోచము 30 సెకన్లు వరకు సాగగా, పోటులు 30-45 నిమిషముల వరకు ఉండిన పిదప, సుమారు 30 నుండి 150 నిమిషాల వరకు ఆకలి సద్దుమణుగుతుంది. సంకోచములు మొదట ఒక దాని తరువాత ఒకటిగా వచ్చినా, కొంత సమయము తర్వాత నిరంతరంగా వస్తాయి. భావోద్వేగస్థితులు (కోపం, సంతోషం లాంటివి) ఆకలి సంకోచాలను కొంత మేరకు అణచగల అవకాశముంది. ఆకలి యొక్క స్థాయి తక్కువ చక్కెర స్థాయి వలన పెరుగును, మధుమేహ వ్యాధిగ్రస్తులలో అధికముగానుండును. ఇవి 3 నుండి 4 రోజులలో చేరుకొనును. ఆకలి పూర్తిగా సమసిపోకున్ననూ రాను రాను ఆకలి నొప్పులు తగ్గుముఖము పడతాయి. ఉదరకోశ tonus స్థాయి అధికముగానున్న ఆరోగ్యవంతులయిన యుక్తవయస్కులలో ఆకలి సంకోచములు మిక్కిలి ప్రభావము కలిగి ఉంటాయి. ఆకలి సంకోచాల మధ్య వ్యవధి వయసుతో పాటు పెరుగుతుంది.
మానసిక ప్రతిస్పందన
[మార్చు]చాల జంతువుల్లో, ఆకలి చురుకుదనాన్ని, చలనాన్ని పెంచుతున్నట్లు తెలుస్తున్నది - ఉదా. సాలెపురుగుల మీద జరిపిన ప్రయోగములో పస్తు ఉన్న సాలెపురుగులలో చురుకుదనము, వేటాడు ప్రక్రియలలో పెరుగుదల తత్ఫలితముగా అధిక బరువు పెరుగుట కనిపించెను. ఈ బాణీ మానవులతో బాటు వివిధ జంతువులలో నిదురించు సమయములో కనిపిస్తుంది. మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ భాగాన్ని కానీ, ఉదరమును కానీ పూర్తిగా తొలగించిన ఎలుకలలో కూడా ఇదే బాణీ గోచరిస్తుంది.
ఎలుకలకు తిండిపెట్టనప్పుడు మాత్రమే కాకుండా నీరు లేదా థయామిన్ వంటి బి విటమిన్ను అందించకపోయినా ఎలుకల రాట్నంలో హెచ్చిన చలనాన్ని ఒక ప్రయోగంలో గమనించారు.[2] ఈ ప్రతిస్పందన ఆ జంతువు ఆహారాన్ని దొరికించుకోగల సంభావ్యతను పెంచే అవకాశముంది. అంతేకాక ఇటువంటి ప్రతిస్పందన స్థానిక జంతు సముదాయంపై ఒత్తిడిని తగ్గిస్తుందని ఒక ఊహ.
ఆకలి మాంద్యం
[మార్చు]ఆకలి లేకపోవడాన్ని ఆకలి మాంద్యం (Anorexia) అంటారు. ఇవి క్షయ, కాన్సర్ మొదలైన కొన్ని వ్యాధుల లక్షణము.
మూలాలు
[మార్చు]- ↑ "How long can someone survive without water?". Retrieved 2007-05-14.
- ↑ Guerrant, N.B., Dutcher, R.A. (1940) Journal of Nutrition 20:589.
బయటి లింకులు
[మార్చు]- పోషకారహార లోపానికి వ్యతిరేకంగా స్పైరులీనా మైకో-ఆల్గే యొక్క వాడకాన్ని ప్రోత్సహిస్తున్న అంతర్జాతీయ సంస్థ, ఐ.ఐ.ఎస్.ఏ.ఎం వెబ్ సైటు
- ఇథియోపియాలో ఆకలి, పేదరికంపై పోరాటం (పీటర్ మిడిల్బ్రూక్)
- ఆహారసంతృప్తిని పెంపొందించే ఆహారవస్తువులు సైంటిస్ట్ లైవ్