పులగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పులగం పండుగలకు ఆంధ్రప్రదేశ్‌లో తయారుచేసిన చాలా సులభమైన వంటకం[1]. ఇది రాయలసీమలో గుర్తింపు పొందిన వంటకం. దీనిని బియ్యం, పెసర పప్పు తో తయారు చేస్తారు.

కావలసిన పదార్థములు[మార్చు]

  • పొట్టు పెసరపప్పు - 1/2 కప్పు
  • బియ్యం - 1 కప్పు
  • మంచినీరు - 4 కప్పులు
  • పసుపు - తగినంత
  • ఉప్పు - తగినంత

తయారు చేయు విధానం[మార్చు]

ముందుగా పెసరపప్పును దోరగా వెయించుకోవాలి.

పెసరపప్పు బియ్యాన్ని కలిపి, అన్నానికి బియ్యం కడిగినట్టే కడిగి నానబెట్టుకోవాలి. పసుపు, ఉప్పు తగినంత కలిపి ప్రెషర్ కుక్కర్ లేదా రైస్ కుక్కర్ లో ఉంచాలి. వేరొక బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో మిరియాలు, జీలకర్ర వేయాలి. కొద్దిగా వేగిన తరువాత దీనిని ప్రెషర్ కుక్కర్ లోఉన్న పప్పు, బియ్యం మిశ్రమంలో కలపాలి. అందులో ఒక స్పూన్ నెయ్యి వేయాలి. కుక్కర్ కు మూత పెట్టి అన్నం వండినట్టే వండుకోవాలి. తరువాత కుక్కర్ లో తయారైన పదార్థానికి కొంచెం నెయ్యి, వేయించిన జీడిపప్పు కలపాలి. ఈ పులగానికి వేరుశెనగపప్పు పచ్చడి, పచ్చిపులుసు, పెరుగు దీనితో బాటు మంచి రుచిని ఇస్తాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Pulagam - A Popular Naivedyam from Andhra Pradesh » ãhãram". ãhãram (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2016-01-10. Retrieved 2020-08-29.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పులగం&oldid=3023373" నుండి వెలికితీశారు