బోండా
Jump to navigation
Jump to search
బోండా (Bonda) దక్షిణ భారత దేశానికి చెందిన ఒక అల్పాహార వంటకం. దీనిలో కారం, తీపి రకాలున్నాయి.
తయారుచేయు విధానం[మార్చు]
కారపు బోండా తయారుచేయడానికి బంగాళాదుంప ముద్దని బాగా వేయించి, పలుచని శెనగ పిండి ముద్దలో ముంచి నూనెలో వేయించాలి. బంగాళాదుంపలో ఇష్టమైన కూరగాయ ముక్కలు ఉడికించి కలుపుకోవచ్చును. కొంతమంది మధ్యలో బంగాళాదుంప ముద్దకు బదులు నిలువుగా కోసిన ఉడికించిన కోడిగుడ్డును ఉంచి శెనగపిండి ముద్దలో ముంచి వేయిస్తారు. వీటిని 'ఎగ్ బోండా' అంటారు.
కేరళ రాష్ట్రంలో బోండాలను తీపిగా తయారుచేస్తారు. మిగిలిన దేశమంతా కారపు బోండాలు తింటారు. కారపు బోండాలో మసాలా రకం మహారాష్ట్రలో బటాటా వడ అంటారు.[1]
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో బోండాచూడండి. |