సున్నుండ
Jump to navigation
Jump to search

సున్ని ఉండలు పోషక పదార్ధాలు అధికంగా కల మినుముల, గోధుమల యొక్క మిశ్రమ మిఠాయిలు. ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ, ఎక్కువకాలం నిలువఉండేందుకుగానూ మంచి మిఠాయిలుగా సున్ని ఉండలను పేర్కొంటారు. సున్నుండ ఒక తెలుగు పిండివంట. దీనిని ఎక్కువగా కోస్తా ప్రాంతంలో తయారు చేస్తారు.
తయారీ విధానం[మార్చు]
మినుములను, గోధుమలను వేయించి, మెత్తగా పిండి ఆడించుకొని ఆ మిశ్రమానికి పొడిగా చేసిన బెల్లమును కలిపి ఉంచుతారు. ఆ పొడిని బాణలిలో వేసి తగినంత నెయ్యి పోస్తూ వేడిచేస్తూ కలియబెడతారు. బాగా వేడి అయిన తరువాత దానిని గుండ్రటి ఉండలుగా చేతి పట్టుతో బిగిస్తూ పోతారు. ఆవిధంగా సున్ని ఉండలు సిద్దం.
వివిద ప్రాంతాలలో సున్ని ఉండలు[మార్చు]
సున్ని ఉండలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఇతరప్రాంతాలలో సైతం వాడుతారు. ఆంధ్రప్రాంతంలో అధికంగా వీటిని పెద్దపండుగగా వ్యవహరించే సంక్రాంతికి ప్రతి ఇంట్లో చేస్తుంటారు.
బయటి లింకులు[మార్చు]

Look up సున్నుండ in Wiktionary, the free dictionary.
- తయారుచేయు విధానము Archived 2011-09-26 at the Wayback Machine