Jump to content

కొబ్బరి చట్నీ

వికీపీడియా నుండి
కొబ్బరి చట్నీ
కొబ్బరి చట్నీ
మూలము
ఇతర పేర్లుతేంగా చమ్మంతి - కేరళ
మూలస్థానంభారతదేశము
ప్రదేశం లేదా రాష్ట్రంకేరళ
తయారీదారులుఉత్తర మలబార్
వంటకం వివరాలు
వడ్డించే విధానంరోటి పచ్చడి
ప్రధానపదార్థాలు కొబ్బరి, చింతపండు, మిరపకాయలు, ఉప్పు తదితర పదార్థాలు

దక్షిణ భారతీయ మసాలా చట్ని టైపు వంటకం. ఈ కొబ్బరి పచ్చడిని ఇడ్లీ, దోసెలతోనే కాకుండా అన్నంలో కూడా వడ్డిస్తారు.[1] దీన్ని తయారు చేేసేందుకు కావలసినవి ప్రాంతాన్నిబట్టి మారవచ్చు. సాధారణంగా పచ్చి కొబ్బరి, ఎండు మిరపకాయలు, చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర మొదలైనవాటితో పాటూ తాలింపు గింజలు, నూనె, ఉప్పు. ఎండు మిరపకాయలకు బదులు పచ్చిమిర్చి కూడా ఉపయోగించవచ్చు.[2] పచ్చికొబ్బరి పచ్చడి రుచిలోనే కాదు ఆరోగ్యం ఇనుమడింపచేయడంలోనూ మేటి.[3]

కావలసిన పదార్థాలు

[మార్చు]
  • కొబ్బరి ముక్కలు లేదా తురుము 1 కప్పు
  • ఎండు మిరపకాయలు 5
  • పచ్చి మిరపకాయలు 4 లేక 5 (ఐచ్చికం)
  • మినప్పప్పు 3 స్పూన్లు
  • ఆవాలు 1 స్పూను
  • బెల్లం చిన్న ముక్క (ఐచ్చికం)
  • నూనె 2 స్పూన్లు
  • చిటికెడు పసుపు (ఐచ్చికం)
  • ఇంగువ చిటికెడు
  • చింతపండు గుజ్జు 2 స్పూన్లు

తయారీ విధానం

[మార్చు]

ముందుగా గ్యాస్ స్టౌ వెలిగించి బాండీ వేడి అయ్యాక అందులో నూనె, ఆవాలు వేసి అవి చిటపటలాడగానే అందులో మినప్పప్పు వేసి వేయించాలి. తరువాత ఎండు మిరపకాయలు కూడా వేసి అవి వేగాక పచ్చి మిర్చి కూడా వేసి వేయించాలి. తరువాత ఇంగువ కూడా వేసి, స్టౌ ఆపేసి అన్నీ చల్లారాక మిక్సీలో వేయాలి. అందులో చింతపండు గుజ్జు కూడా వేసి రుబ్బుకోవాలి. చివరగా కొబ్బరి తురుము కూడా వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు చేర్చితే రుచికరమైన కొబ్బరి పచ్చడి తయారు అవుతుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "రుచికే కాదు.. ఆరోగ్యానికీ ఈ పచ్చడి మంచిదే! - try this tasty and healthy coconut chutney in telugu". www.eenadu.net. Retrieved 2021-12-11.
  2. "Coconut Chutney Recipe | Coconut Chutney". NDTV Food (in ఇంగ్లీష్). Retrieved 2021-12-11.
  3. "పచ్చి కొబ్బరి.. సర్వ రోగ నివారిణి". Sakshi. 2021-12-11. Retrieved 2021-12-11.