Jump to content

చికెన్ బిర్యాని

వికీపీడియా నుండి

'బొద్దు పాఠ్యం'వ౦కాయ==కావలసిన పదార్ధాలు==

  • మాంసం - 1 కిలో,
  • బాస్మతీ బియ్యం - 1 కిలో,
  • ఉల్లిపాయలు -250 గ్రాములు,
  • పెరుగు - 250 గ్రాములు,
  • అల్లం వెల్లుల్లి ముద్ద - 3 టీ స్పూన్,
  • కొత్తిమిర - 1/2 కప్పు,
  • పుదీన - 1/2 కప్పు,
  • పచ్చిమిర్చి - 3,
  • పసుపు - తగినంత,
  • కారం పొడి - 2 టీ స్పూన్,
  • ఏలకులు - 4,
  • లవంగాలు - 8,
  • దాల్చిన - 2,
  • షాజీర - 2 టీ స్పూన్,
  • గరం మసాలా పొడి - 2 టీ స్పూన్,
  • కేసర్ రంగు - 1/4 టీ స్పూన్,
  • పాలు - 1 కప్పు,
  • ఉప్పు తగినంత,
  • నూనె - తగినంత.

తయారు చేయు విధానం

[మార్చు]
  • ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి పెట్టుకోవాలి.
  • అలాగే తరిగిన కొత్తిమిర, పుదీనా కూడా. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి.
  • వేయించిన ఉల్లిపాయ, కొత్తిమిర, పుదీనా, పెరుగు, కారంపొడి, పసుపు, మాంసానికి తగినంతఉప్పు వేసి మిక్సిలో మెత్తగా ముద్ద చేసుకొనిపెట్టుకోవాలి.
  • ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం, నూరిన ముద్ద, పచ్చి కొత్తిమిర, పుదీనా, పచ్చిమిరపకాయలు, గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి.
  • బియ్యం కడిగి పదినిమిషాలు నాననిస్తే చాలు.
  • మందపాటి గిన్నె తీసుకొని నూనె వేసి దానిమీద నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి.
  • ఇంకో పెద్ద గిన్నెలో బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి అన్నానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
  • నీరు మరిగేటప్పుడు ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, షాజీర వేయలి. బియ్యంలోని నీరంతా వడకట్టాలి.
  • మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసి సగం ఉడకగానే గంజి వార్చి తర్వాత సగం ఉడికిన అన్నాన్ని మాంసంపై సమానంగా పరవాలి.
  • పైన కొన్ని ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమిర, పుదీనా కొద్దిగా, నెయ్యి, పాలు, కేసర్ రంగు వేసి, తడిపిన గోధుమపిండిని చుట్టలాగా చేసుకుని గిన్నె అంచులపై మొత్తం పెట్టి దానిమీద సమానమైన మూత పెట్టాలి.
  • పొయ్యిమీద ఇనప పెనం పెట్టి వేడి చేసి దానిపై ఈ గిన్నె పెట్టి దాని మీద బరువైన ఎదైనా వస్తువు పెట్టాలి.
  • దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. అరగంట తర్వాత ఇది తయారై గోధుమ పిండిని చీల్చుకుని ఆవిరి బయటకొస్తుంది ఘుమఘుమలతో. ఉడికించిన గ్రుడ్లతో అలంకరించుకోవాలి.దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి, గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటాయి.