అల్లం పచ్చడి
స్వరూపం
మూలము | |
---|---|
మూలస్థానం | దక్షిణ భారత దేశం |
వంటకం వివరాలు | |
వడ్డించే విధానం | బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ |
ప్రధానపదార్థాలు | అల్లం, శెనగపప్పు, మినపపప్పు మొ. |
అల్లం పచ్చడి ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలలో ఒక పేరుపొందిన పచ్చడి. దీన్ని ప్రధానంగా ఇడ్లీ, దోశ లాంటి అల్పాహారాలతో కలిపి భుజిస్తారు.
కావలసిన పదార్థాలు
[మార్చు]- అల్లం - 1/4 కిలో
- శెనగపప్పు (సెనగబెడలు) - 1/2 స్పూన్
- మినపప్పు - 1/2 స్పూన్
- ఆవాలు - 1 స్పూను
- కరివేప ఆకు - 3 రెబ్బలు
- ఎండుమిర్చి - 8
- కారం - 4 స్పూన్లు
- బెల్లం - 100 గ్రాముల
- చింతపండు - 100 గ్రాముల
- ఉప్పు - రుచికి తగినంత
- నూనె - 5 టేబుల్ స్పూను
తయారుచేసే విధానం
[మార్చు]- 2 స్పూన్లు నూనెలో అల్లం దోరగా వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో 1 టీ స్పూను నూనెలో ఎండుమిర్చి వేగించి పక్కనుంచాలి.
- వెయించిన అల్లం ఎండుమిర్చి రుబ్బు కొవాలి. మిగిలిన 2 టీ స్పూను నూనెలో శనగపప్పు (సెనగబెడలు), మినపప్పు, ఆవాలు, కరివేప ఆకులు వేసి దోరగ వేగించి పక్కనుంచాలి.
- మిగిలిన నూనెలో అల్లం ఎండుమిర్చి మిశ్రమం, కారం, చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు వేసి వేయించాలి (నీరు పూర్తిగా అవిరి అయ్యేవరకు).
- పచ్చడి చల్లరాక గాజు సీసలో ఉంచుకోవాలి. దాదాపు ఒక నెల నిలువ వుంటుంది.