బిర్యాని
Appearance
బిర్యాని (Biryani) అనే పదం పర్షియా పదమైన beryā (n) (بریان) నుండి వచ్చింది. దీని అర్థం "వేయించిన" (లేదా) "వేపుడు". దక్షిణ ఆసియాలో ఈ వంటకం చాలా ప్రసిధ్ధమైనది. పులిహోర, పొంగళి వాటి లాగ ఇది బియ్యంతో తయారుచేస్తారు. దీనికి సన్నని పాత బియ్యం కావాలి.
కావలసిన పదార్ధాలు
[మార్చు]- పాత సన్నని బియ్యం - అరకిలో
- నెయ్యి - అరకిలో
- ఉల్లిపాయలు - అరకిలో
- జీడిపప్పు - పావుకిలో
- వెల్లుల్లిపాయలు - 100 గ్రా.
- గసగసాలు - 70 గ్రా.
- ధనియాలు - 100 గ్రా.
- కొబ్బరికాయ - ఒకటి
- లవంగాలు - 20 గ్రా.
- ఏలకులు - 20 గ్రా.
- దాల్చినచెక్క - 20 గ్రా.
- కుంకుమపువ్వు
- పచ్చి మిరపకాయలు - 150 గ్రా.
- అల్లం - 50 గ్రా.
- ఆకుపత్రి - 10 గ్రా.
తయారుచేయు విధానం
[మార్చు]- బియ్యం రాళ్ళు, నూకలు లేకుండా చెరిగి శుభ్రం చేసుకోవాలి.
- అల్లం, పచ్చి మిరపకాయలు, గసగసాలు, ధనియాలు కలిపి మెత్తగా రుబ్బాలి. వెల్లుల్లిపాయలు, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క సగంసగం చొప్పున తీసుకొని అవిగూడా మెత్తగా రుబ్బాలి. మిగతా సగం వెల్లుల్లిపాయలు తొక్క వొలుచుకొని, మామూలు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరిగాలి.
- కొబ్బరికాయ కొట్టి, కోరి, ఆ కోరుని రోట్లోవేసి మెత్తగా రుబ్బాలి. వీటినుండి రెండు-మూడుసార్లు పిండి కొబ్బరిపాలు తీసి పెట్టుకోవాలి.
- ఏరి శుభ్రం చేసిన బియ్యాన్ని 2-3 సార్లు కడిగి గాలించి ఒక వెదురు బుట్టలో వోడేసి ఉంచాలి.
- పొయ్యి మీద వెడల్పాటి కళాయి గిన్నె వించి, అందులో అరకిలో నెయ్యి వేయి, మరిగాక తరిగి వుంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి. ఉల్లిముక్కలు దోరగా వేగాక జీడిపప్పు, వెల్లుల్లిపాయలు, లవంగాలు, ఏలకులు, ఆకుపత్రి వగైరాలు అన్నీ నేతిలో వేసి, అవి వేగిన తర్వాత ముప్పావు లీటరు నీరుపోయాలి. సిద్ధం చేసుకున్న బియ్యం పోసి తగినంత ఉప్పు వేసి మూతపెట్టాలి.
- కాసేపు తర్వాత బియ్యం ఉడికి, నీరు ఇంకిపోయి ఉంటుంది. అప్పుడు కొబ్బరిపాలుపోసి, కుంకుమపువ్వు నలిపి అందులో వేసి, ఒక్కసారి గరిటెతో తిప్పి, మల్లీ మూతపెట్టి కాస్త మగ్గిన తర్వాత కిందనున్న మంట
బిర్యానీలో రకాలు
[మార్చు]- విజిటబుల్ బిర్యానీ
- ఎగ్ బిర్యానీ
- చికెన్ బిర్యానీ
- మటన్ బిర్యానీ
- FISH BIRYANI
- MASHUM BI
వెలుపలి లింకులు
[మార్చు]Look up వ్యాసం పేరు in Wiktionary, the free dictionary.
వికీమీడియా కామన్స్లో
కి సంబంధించిన మీడియా ఉంది.